News October 3, 2024

ఈనెల 6 నుంచి కాలేజీలకు దసరా సెలవులు

image

TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈనెల 6 నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. హాలిడేస్ 13 వరకు కొనసాగుతాయని, కళాశాలలు తిరిగి 14న పున:ప్రారంభం అవుతాయని తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని ఆదేశించింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.

News October 3, 2024

ధర్మారెడ్డి ఎక్కడ?: పవన్

image

AP: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మాత్రమే బయటకొచ్చి మాట్లాడుతున్నారన్నారు. తన బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి వచ్చిన ధర్మారెడ్డి లడ్డూ వివాదం రాగానే మాయమయ్యారని ఆక్షేపించారు. ఆయనపై చాలా ఆరోపణలున్నాయని, అన్నింటినీ బయటకు తీస్తామని చెప్పారు. తాను బాధ్యతలు తీసుకున్నప్పుడు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రస్తుత ఈవో చెప్పారన్నారు.

News October 3, 2024

USCIRF మత స్వేచ్ఛ నివేదికను తోసిపుచ్చిన భారత్

image

భార‌త్‌లో మ‌త స్వేచ్ఛ‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం (USCIRF) ఇచ్చిన నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. దీన్ని ఏక‌ప‌క్ష, రాజ‌కీయ ప్రేరేపిత నివేదిక‌గా పేర్కొంది. ఈ నివేదిక USCIRFని మరింత అప్రతిష్ఠపాలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని దుయ్య‌బ‌ట్టింది. USలో మానవ హక్కుల సమస్యల పరిష్కారానికి USCIRF తన సమయాన్ని వినియోగించుకోవాలని స‌ల‌హా ఇచ్చింది.

News October 3, 2024

మహిళల T20WCలో బోణీ కొట్టిన బంగ్లాదేశ్

image

మహిళల T20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. స్కాట్లాండ్‌పై 16 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 రన్స్ చేసింది. 120 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 రన్స్ మాత్రమే చేయగలిగింది. రేపు రా.7.30 న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

News October 3, 2024

తిరుపతి లడ్డూ అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదు: పవన్

image

AP: తిరుపతి వారాహి సభలో మాజీ సీఎం జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ‘గత సీఎం తిరుపతి లడ్డూలు చుట్టారని, అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుముకుంటున్నారు. పైగా మేమే రాజకీయం చేస్తున్నామంటున్నారు. జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరిపైనే మా ఆరోపణలు. తిరుమల ప్రసాదంలో నిబంధనల ఉల్లంఘనపైనే మా ఆవేదన’ అని వ్యాఖ్యానించారు.

News October 3, 2024

BJPకి ప్రచారం.. 2గంటల్లోనే కాంగ్రెస్‌లోకి

image

హరియాణాకు చెందిన మాజీ MP అశోక్ తన్వర్ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన తన్వర్ 2019లో పార్టీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2022లో AAP తీర్థం పుచ్చుకున్నారు. 2024 ప్రారంభంలో BJP కండువా కప్పుకొని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈరోజు జింద్ జిల్లాలోని సఫిడాన్‌లో BJP తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే కాంగ్రెస్‌లో చేరారు.

News October 3, 2024

దేశ సంస్కృతికి మూలం శ్రీరాముడు: పవన్

image

AP: దేశ సంస్కృతికి మూలం శ్రీరామచంద్రుడని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘రాముడిని హేళన చేస్తే ప్రతిఘటించకుండా ఇంట్లో కూర్చొని ఏడుస్తాం. రాముడు ఆర్యుడు, ఉత్తరాది దేవుడనే తప్పుడు సిద్ధాంతాన్ని కొందరు ముందుకు తీసుకెళ్లారు. ఆయన నల్లని ఛాయలో ఉంటాడు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు. సూడో సెక్యులర్ వాదులు తమ సిద్ధాంతాలను ఇతరులపై రుద్దవద్దు’ అని అన్నారు.

News October 3, 2024

గిఫ్టులు అక్క‌ర్లేదు.. రైతుల‌కు హ‌క్కులు కావాలి: రాహుల్ గాంధీ

image

దేశంలోని రైతులు ఉచిత బ‌హుమ‌తుల‌ను కోరుకోవ‌డం లేద‌ని, వారి హ‌క్కుల‌ను మాత్ర‌మే కోరుకుంటున్నార‌ని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ, అంబానీల రుణాల‌ను మాఫీ చేసిన‌ప్పుడు, రైతుల‌వి కూడా మాఫీ చేయాల‌న్నారు. హ‌రియాణా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న మాట్లాడుతూ అదానీ పోర్టుల్లో వేల కిలోల డ్ర‌గ్స్ దొరికినా మోదీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్నారు. హరియాణా పిల్ల‌ల భ‌విష్య‌త్తును అదానీ నాశ‌నం చేస్తున్నార‌ని ఆరోపించారు.

News October 3, 2024

ఫామ్ హౌస్‌లు ఎక్కడున్నాయో వివరాలు బయట పెట్టాలి: సబిత

image

TG: అక్రమంగా నిర్మించిన సబిత ఫామ్ హౌస్‌ను కూల్చాలా? అన్న సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి సబిత కౌంటర్ ఇచ్చారు. తన అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి 3 ఫామ్ హౌస్‌లు ఎక్కడున్నాయో వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్ని రకాలుగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. రేవంత్ మాట తీరును తెలంగాణ సమాజం గమనిస్తుందని Xలో పేర్కొన్నారు.

News October 3, 2024

ఫేక్ SBI బ్రాంచ్ పెట్టి రూ.లక్షలు దోచారు

image

ఈమధ్య సైబర్ నేరాలను తరచూ చూస్తున్నాం. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో కొందరు కేటుగాళ్లు మరో అడుగు ముందుకేసి ఏకంగా నకిలీ SBI బ్రాంచ్‌ ప్రారంభించారు. అందులో ఉద్యోగాలు, శిక్షణ పేరుతో మోసగించి రూ.లక్షలు దండుకున్నారు. నిజమైన బ్యాంకులాగే ఉండటంతో ఈ మోసం గ్రహించలేకపోయిన ప్రజలు కొత్త అకౌంట్లు, లావాదేవీల కోసం రావడం ప్రారంభించారు. అందులో ఉద్యోగం పొందినవారు సైతం నిజం తెలిసి షాకయ్యారు.