News August 12, 2025

6,115 రైల్వే స్టేషన్స్‌లో ఫ్రీ వైఫై.. ఇలా పొందండి

image

6,115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఓ MP ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాచిగూడ, సికింద్రాబాద్ వంటి స్టేషన్లలోనూ ఈ సౌకర్యం ఉంది. కనెక్ట్ చేసుకునేందుకు మీ ఫోన్‌లో వైఫై ఆన్ చేయాలి. RailWire Wi-Fiని సెలక్ట్ చేయాలి. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే.. OTP వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే వైఫై కనెక్ట్ అవుతుంది.

News August 12, 2025

ఇన్‌కమ్ టాక్స్ బిల్లు-2025లో ఏం మారాయి?

image

ఇవాళ ఆమోదం <<17375107>>పొందిన<<>> ఇన్‌కమ్ టాక్స్ బిల్లు-2025లో కొన్ని పదాలను మార్చారు. పాత బిల్లులో ‘క్రితం సంవత్సరం, అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘టాక్స్ ఇయర్’ అని రీప్లేస్ చేశారు. కొత్త పన్నులు, శ్లాబులు, ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, రేట్లనేమీ మార్చలేదు. స్టాండర్డ్ డిడక్షన్, గ్రాడ్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర సెక్షన్లు, నిబంధనలను ఒక పట్టిక రూపంలోకి తీసుకొచ్చారు. బిల్లు కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 12, 2025

APLలో ఇవాళ్టి మ్యాచులు ఇవే

image

AP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్4 సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. నిన్న మొదటి మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌పై అమరావతి రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లైన్స్‌పై కాకినాడ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గం.కు భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సా.6.30గం.కు విజయవాడ సన్ షైనర్స్, సింహాద్రి వైజాగ్ లైన్స్ తలపడనున్నాయి.

News August 12, 2025

భారత్ సరిహద్దు సమీపంలో చైనా రైల్వే లైన్!

image

ఇండియా సరిహద్దు సమీపంలో చైనా రైల్వేలైన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో కొంత భాగం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) సమీపంలో ఉంటుందని చెప్తున్నారు. టిబెట్‌ను షిన్‌జాంగ్ ప్రావిన్సుతో కలపనున్నారు. రూ.1.15 లక్షల కోట్ల క్యాపిటల్‌తో ‘ది షిన్‌జాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేశారని చైనా మీడియాలో వార్తలొచ్చాయి. LAC సమీపంలో కాబట్టి రక్షణపరంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరముంది.

News August 12, 2025

చెప్పే కథ ఒకటి.. తీసేది ఇంకొకటి: అనుపమ

image

తాము ఓకే చేసిన స్క్రిప్టు మూవీ పూర్తయ్యేలోగా మారిపోతూ ఉంటుందని హీరోయిన్ అనుపమ పేర్కొన్నారు. ‘పరదా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కథ మాత్రమే కాదు పాత్రల విషయంలోనూ ఇలాంటి మార్పులు ఉంటూనే ఉంటాయి. అవన్నీ తెలియక ప్రేక్షకులు ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేస్తారు? అని ప్రశ్నిస్తూ ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. ‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రం గురించే ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.

News August 12, 2025

టెంపో ప్రమాదంలో.. 10కి చేరిన మృతుల సంఖ్య

image

మహారాష్ట్ర పుణే జిల్లా మహాలుంగేలో <<17371241>>టెంపో<<>> లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 40 మంది ఉన్నారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శ్రావణ సోమవారం సందర్భంగా వీరంతా కుందేశ్వర్‌ ఆలయ సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

News August 12, 2025

ఆగస్టు 12: చరిత్రలో ఈ రోజు

image

1919: అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్(ఫొటోలో) జననం
1939: నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా జననం
1972: భారత మాజీ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే జననం
1892: గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ జననం
1995: హీరోయిన్ సారా అలీఖాన్ జననం
1997: హీరోయిన్ సయేశా సైగల్ జననం
*ప్రపంచ ఏనుగుల దినోత్సవం

News August 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 12, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.42 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.58 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.44 గంటలకు
✒ ఇష: రాత్రి 8.00 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 12, 2025

BC రిజర్వేషన్ల సాధనకు త్వరలో కార్యాచరణ: కవిత

image

TG: కాంగ్రెస్ పార్టీ BCలను వంచించాలని చూస్తోందని MLC కవిత ఆరోపించారు. పలువురు BC నేతలు, జాగృతి కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ‘రాహుల్ ప్రధాని అయ్యాకే రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామనేది కంటితుడుపు చర్య. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లడం లేదు? BC రిజర్వేషన్ల సాధన కోసం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తా’ అని ఆమె వెల్లడించారు.