News August 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 12, 2025

శుభ సమయం (12-08-2025) మంగళవారం

image

✒ తిథి: బహుళ తదియ మ.10.10 వరకు
✒ నక్షత్రం: పూర్వాభాద్ర మ.2.13 వరకు
✒ శుభ సమయం: ఉ.7.51-8.15
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.09.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, రా.10.48-11.36
✒ వర్జ్యం: రా.22.21-రా.12.51
✒ అమృత ఘడియలు: ఉ.6.27-ఉ.7.59

News August 12, 2025

TODAY HEADLINES

image

* భారత్ ఎవరికీ తలవంచదు: సీఎం చంద్రబాబు
* AP DSC ఫలితాలు విడుదల
* తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
* షూటింగ్‌లు బంద్ చేయడం సరికాదు: కోమటిరెడ్డి
* కాంగ్రెస్ చేతకానితనంతో ఎకానమీ పతనమవుతోంది: KTR
* పులివెందులలో టీడీపీ రిగ్గింగ్ కుట్రలు: అవినాశ్
* హీరో రానాను విచారించిన ఈడీ
* తగ్గిన బంగారం ధరలు
* ‘మాస్ జాతర’ టీజర్ విడుదల

News August 12, 2025

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థ: US

image

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA), దాని సహచర సంస్థ మజీద్ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది. కొన్ని దాడుల తర్వాత 2019లో BLAను స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించారు. 2019నుంచి మజీద్ బ్రిగేడ్ ద్వారా జరిగిన దాడులకు BLA బాధ్యత వహించినట్లు పేర్కొంది. ఇటీవలదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కానీ, ఇది పాకిస్థాన్ కోసం చేశారంటూ విమర్శలు వస్తున్నాయి.

News August 12, 2025

భారత్ ఎవరికీ తలవంచదు: చంద్రబాబు

image

AP: పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శక్తిమంతంగా ఎదుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ ఎవరికీ తల వంచదని, దేశం జోలికి ఎవరొచ్చినా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. విజయవాడలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘టారిఫ్స్ విధిస్తే భారత్ ఆగిపోతుందనుకోవడం భ్రమే. మనకు ఉద్యోగాలు ఇవ్వని దేశాల్లోనే అభివృద్ధి నిలిచిపోతుంది. ఇప్పుడు ఉన్నది పవర్ ఫుల్ ఇండియా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News August 12, 2025

ALERT: రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు

image

AP: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News August 12, 2025

మాజీ ఎమ్మెల్యేలు కన్నుమూత

image

AP: అన్నమయ్య(D) రాజంపేట మాజీ MLA కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1989లో రాజంపేట నుంచి INC MLAగా గెలిచారు. 1985, 1994, 2009లో పోటీ చేసి ఓడిపోయారు. అటు తిరుపతి(D) శ్రీకాళహస్తి మాజీ MLA తాటిపర్తి చెంచురెడ్డి కూడా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1988 ఉపఎన్నికలో INC తరఫున MLAగా గెలిచారు.

News August 12, 2025

ట్రంప్ అండతో పాక్ అధ్యక్షుడిగా ఆసిమ్ మునీర్?

image

భారత్‌కు దూరమవుతున్న ట్రంప్ పాక్‌ను అక్కున చేర్చుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఆ దేశ అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 2 నెలల్లో మునీర్ 2 సార్లు US వెళ్లారు. పాక్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధ్యక్ష పదవి దక్కించుకునేలా ట్రంప్‌తో కలిసి ప్లాన్ వేస్తున్నట్లు భారత విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇప్పటికే US గడ్డపై నుంచి మునీర్ భారత్‌పై విషం కక్కుతున్నారు.

News August 11, 2025

మార్పుల తర్వాత ఇన్‌కమ్ టాక్స్ బిల్లుకు ఆమోదం

image

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ LSలో ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ టాక్స్ బిల్లు చర్చ లేకుండానే ఆమోదం పొందింది. FEBలోనే బిల్లును కేంద్రం LSలో ప్రవేశపెట్టింది. 1961 నుంచి ఎన్నో సవరణలకు గురై సంక్లిష్టంగా మారిందని విపక్షాలు అభ్యంతరం చెప్పాయి. దీంతో కేంద్రం సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసింది. ఈక్రమంలోనే గత శుక్రవారం దాన్ని వెనక్కి తీసుకొని కమిటీ సూచనలతో మార్పులు చేసింది. ఇది 2026 APR 1 నుంచి అమల్లోకి రానుంది.

News August 11, 2025

నిద్రలో కాళ్లు, చేతులు మొద్దుబారుతున్నాయా?

image

నిద్రలో కొందరికి చేతులు, కాళ్లు మొద్దుబారిపోతుంటాయి. ఇది ఒక రకమైన ఆరోగ్య సమస్య అని వైద్యులు చెబుతున్నారు. మణికట్టు నరాలపై ఒత్తిడి పెరిగితే వేళ్లు, సయాటిక్ నాడీపై ఒత్తిడి పెరిగితే కాళ్లు, మోచేతి నరాలపై ఒత్తిడి పెరిగితే చేతులు తిమ్మిరి ఎక్కుతాయి. విటమిన్ B12, B6, మెగ్నీషియం లోపం వల్ల నరాలు బలహీనపడి ఒత్తిడికి గురవుతాయి. మెరుగైన రక్త ప్రసరణకు వ్యాయామం చేయాలని, సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.