India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని కాంగ్రెస్ నేత MA ఫహీమ్ ఆరోపించారు. ఈ విషయంపై CID, విజిలెన్స్&ఎన్‌పోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘అర్హత లేకపోయినా కొందరిని సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. ఎన్పీ సింగ్, ఆకాశ్ బండారికి తప్ప ఛైర్‌పర్సన్‌తో సహా మరెవరికీ సరైన అర్హతలు లేవు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు.
AP: జిల్లా, మండలాల పేర్లు, సరిహద్దుల మార్పుపై ఈనెల 13న GOM భేటీ కానుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘గత ప్రభుత్వం జిల్లాల పున:వ్యవస్థీకరణను అడ్డదిడ్డంగా చేసింది. వాటి సరిహద్దులు, పేర్లు మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకా అర్జీలుంటే ఇవ్వొచ్చు. వీటిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని వెల్లడించారు. GOMలో నారాయణ, అనిత, జనార్దన్, నిమ్మల, మనోహర్, సత్యకుమార్ ఉన్నారు.
మహానగరంలో మరోసారి భారీ వర్షం మొదలైంది. ట్యాంక్‌బండ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, రాజేంద్రనగర్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. రాత్రి 9 గంటల వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగా ప్రజలు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అటు వర్షం నేపథ్యంలో GHMC మాన్సూన్ బృందాలు అలర్ట్ అయ్యాయి.
AP: పులివెందుల ZPTC ఉపఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల మార్పుపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ ఎన్నికల్లో ఒక ఊరిలోని 6 పోలింగ్ బూత్‌లను మరో ఊరికి మార్చడంపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. మరికొన్ని గంటల్లో(రేపు) పోలింగ్ పెట్టుకుని మార్చడం కుదరదన్న ఈసీ న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.
బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ.50,000 పెంచుతూ ICICI తీసుకున్న <<17349792>>నిర్ణయంపై <<>>విమర్శలొస్తున్న వేళ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ‘కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది బ్యాంకుల ఇష్టం. కొన్ని బ్యాంకులు రూ.10,000 ఫిక్స్ చేస్తాయి. మరికొన్ని రూ.2,000 ఉంచుతాయి. మరికొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేశాయి. ఇది ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు’ అని ఆయన వెల్లడించారు.
TG: నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నేతలతో వేర్వేరుగా భేటీ అయిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షూటింగ్‌లు బంద్ చేయడం సరికాదని, పనిచేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలని కార్మికులకు సూచించారు. నిర్మాతలు కూడా కొంచెం వేతనం పెంచాలని, సమస్యను పెద్దది చేయొద్దని కోరారు. రేపు నిర్మాతలు, కార్మికులు సమావేశమై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ భేటీకి ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
AP: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో దీన్ని రూపొందించి, సమర్పించింది. కుంభకోణంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రలపై ఆధారాలను ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. మద్యం ముడుపులు ఎవరి నుంచి తీసుకున్నారు? ఎవరికి అప్పగించారు? అనే అంశాలను సిట్ పేర్కొన్నట్లు సమాచారం.
రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB ప్లేయర్ <<17189705>>యశ్ దయాల్<<>>పై UP క్రికెట్ అసోసియేషన్ (UPCA) నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఈ నెల 17 నుంచి జరగబోయే UP T20 లీగ్‌లో అతడు ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. దయాల్‌ను రూ.7 లక్షలు వెచ్చించి గోరఖ్‌పూర్ లయన్స్ వేలంలో దక్కించుకుంది. కాగా నిషేధంపై తమకెలాంటి సమాచారం లేదని ఫ్రాంచైజీ చెబుతోంది.
AP: రాష్ట్రంలో అమలు కానున్న స్త్రీ శక్తి పథకాన్ని చూసి YCP ఓర్వలేకపోతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ పథకంపై ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘పథకం దీర్ఘకాలం ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. మహిళలు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అనుమతిస్తున్నాం. దీంతో లక్షలాది మహిళలు లబ్ధి పొందనున్నారు’ అని పేర్కొన్నారు.
అశ్విన్ కుమార్ తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.210 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. హొంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రూ.300 కోట్లను క్రాస్ చేయొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి.
Sorry, no posts matched your criteria.