India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్ర పుణే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖేడ్ సమీపంలోని మహాలుంగే ప్రాంతంలో టెంపో వాహనం లోయలో పడిన ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. ఘటన జరిగిన సమయంలో 30 మంది వరకూ అందులో ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. శ్రావణ సోమవారం సందర్భంగా వీరంతా కుందేశ్వర్ ఆలయ సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో KTR, హరీశ్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెల 14న కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించే బీసీ సభపై సమాలోచనలు చేశారు. భారీగా జనసమీకరణ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపైనా చర్చించారు.
ట్రంప్ టారిఫ్స్ భయాల నుంచి కోలుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 746 పాయింట్లు లాభపడి మళ్లీ 80,604, నిఫ్టీ 221 పాయింట్లు వృద్ధి చెంది 24,585 వద్ద క్లోజ్ అయ్యాయి. టాటా మోటార్స్, ఎటర్నల్, ట్రెంట్, SBI, అల్ట్రాటెక్ సిమెంట్, L&T, అదానీ పోర్ట్స్, రిలయన్స్, కోటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. బెల్, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.
TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 1-2 గంటల్లో ఎల్బీ నగర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో వాన పడుతుందని అంచనా వేసింది. అదే విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ <<17364906>>వ్యాఖ్యలపై<<>> కేంద్రం తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి ఆయన ప్రేలాపనలు చేయడం సిగ్గుచేటని మండిపడింది. అణుదాడి చేస్తామన్న బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది. అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్ ఆర్మీ చీఫ్‌కు అలవాటుగా మారిందని భారత్ విమర్శించింది.
TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో సినీనటుడు దగ్గుబాటి రానాను ఈడీ విచారించింది. దాదాపు 4 గంటలపాటు ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న రెమ్యునరేషన్, కమీషన్లపై ఆయన్ను ఆరా తీసినట్లు సమాచారం. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని రానాకు సూచించారు. కాగా రానాతోపాటు ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్‌ను కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ‘రెస్ట్ ఇన్ పీస్ డాడ్.. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్’ అని జాస్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన తండ్రితో కలిసి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. మృతికి కారణాలు వెల్లడించలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, బట్లర్ ధైర్యంగా ఉండాలని కాంక్షిస్తూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
TG: రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాళేశ్వరంపై NDSA నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని, మేడిగడ్డ లాంటి ఘటనలు జరగకుండా ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలవడంపై సిట్‌దే అంతిమ నిర్ణయమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు.
యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్ల జాబితాలో అక్షయ్ కుమార్(స్కై ఫోర్స్-రూ.113 కోట్లు), సల్మాన్ ఖాన్(సికందర్-రూ.110 కోట్లు) చిత్రాలను దాటేసి 6వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ చిత్రం హిందీలోనే రూ.126 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది.
TG: తనకు మంత్రి పదవి ఇస్తామని మాటివ్వడం నిజమేనంటూ ప్రజలకు చెప్పినందుకు Dy.CM <<17365508>>భట్టి <<>>విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందించాలని కోరారు. TG సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నానన్నారు.
Sorry, no posts matched your criteria.