India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులో మరణాల సంఖ్య 163కి చేరింది. ఇంకా 85 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. భారత సైన్యంతో పాటు NDRF బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి జార్జి కురియన్ తెలిపారు. 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. కాగా ఇప్పటివరకు 89 మృతుల వివరాలను గుర్తించారు.

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారు. హనియే 1963లో గాజాలోని ఓ శరణార్థి శిబిరంలో జన్మించారు. 1980ల చివర్లో హమాస్‌లో చేరారు. హమాస్ ఫౌండర్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎన్నికయ్యారు. 2017లో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. అమెరికా అతడిని ఉగ్రవాదిగా గుర్తించడంతో ఖతర్‌లో నివాసముండేవారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన ముగ్గురు కుమారులూ చనిపోయారు.

ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ ముగ్గురు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకునేలా BCCI అంగీకరించనున్నట్లు TOI తెలిపింది. నేడు జరిగే BCCI-IPL సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది. ఆయా ఫ్రాంచైజీలు రూ.కోట్లు వెచ్చించి యంగ్ ప్లేయర్లను తీర్చిదిద్దాయి. దీంతో వారిని వదిలిపెట్టేందుకు ఫ్రాంచైజీలు ఇష్ట పడటం లేదట. అందుకే క్యాప్‌డ్ ప్లేయర్లతోపాటు, అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల రిటెన్షన్‌కూ BCCI గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట.

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది.

ముంబైలోని చెంబూర్ స్టేషన్ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై కొబ్బరి కాయలు కొడుతూ భక్తులు పూజలు చేస్తున్నారు. ఇది ప్రమాదకరమని ఓ వ్యక్తి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయడంతో భక్తులను అక్కడి నుంచి పంపించేశారు. అయితే, అక్కడ ఎందుకు పూజలు చేస్తున్నారని ఓ భక్తుడిని ప్రశ్నించగా.. గతంలో ఇక్కడే ఆలయం ఉండేదని, అప్పటి నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని భక్తులు RPF సిబ్బందికి తెలిపారు.

భారత్‌తో జరిగిన 3 టీ20 మ్యాచుల్లోనూ శ్రీలంక పోరాడినా చివరకు పరాజయం మూటగట్టుకుంది. ఓపెనర్లు, టాపార్డర్ రాణించినా స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడం ఇందుకు కారణం. మొదటి టీ20లో 6 ఓవర్ల వ్యవధిలో 30 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. రెండో మ్యాచులో 5 ఓవర్లలో 31 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకుంది. చివరి T20లోనూ 4.1 ఓవర్లలో 22 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది.

నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి 2898AD’ మూవీ అరుదైన ఘనత సాధించింది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో భారతీయ చిత్రంగా నిలిచిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. 18.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో షారుఖ్ మూవీ పఠాన్‌ను($17.45 మిలియన్) అధిగమించింది. అత్యధిక వసూళ్లలో బాహుబలి-2($20.7 మిలియన్) తొలి స్థానంలో ఉంది.

AP: రాష్ట్రంలో 129 కట్టడాల్లో ఒక్కదానికీ యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కలేదని అమరావతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జాస్తి వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గండికోట, అమరావతి, నాగార్జునకొండ, సాలిహుండం, శంకరం, అతి పెద్ద ఏకశిలా నంది, అతి పెద్ద 7 పడగల నాగేంద్రుడు, 856 స్తూపాల ఆలయం, వేలాడే ధ్వజస్తంభం, 12 ధ్వజస్తంభాలతో కూడిన నాట్య మండపాల గుర్తింపునకు ప్రభుత్వం కృషి చేయాలి’ అని పేర్కొన్నారు.

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఆగస్టు 13 వరకు ఆమెకు జుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కవితతోపాటు మిగతా నిందితులను అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు.

స్టార్ హీరో దుల్కర్ నటిస్తోన్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమా రచయిత ఎవరో తెలుసా? తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ‘అమృతం’ సీరియల్‌ను అందించిన గుణ్ణం గంగరాజు. దీనిపై ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ.. ఈ స్క్రిప్ట్ రాయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సీతారామశాస్త్రి పాట ‘నింగి ఎంత పెద్దదైనా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా’ సాంగ్‌కు ఈ కథ వాస్తవరూపం దాల్చినట్లు ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.