News July 31, 2024

వాలంటీర్లను సమర్థంగా వినియోగించడంపై ఆలోచించాలి: సీఎం చంద్రబాబు

image

AP: సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి పలు అంశాలపై CM చంద్రబాబు సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న దానిపై ప్రణాళికలు రచించాలని CM సూచించారు.

News July 31, 2024

ఎరువుల వ్యాపారులకు ప్రభుత్వం వార్నింగ్

image

TG: నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల క్రయవిక్రయాలు జరిపే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వారి వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లను వెంటనే స్వాధీనం చేసుకుని మరొకరికి అప్పగించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎరువుల నిల్వలు, సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొంది. రైతులకు ఎరువులు సజావుగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

News July 31, 2024

నేటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

image

AP: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రూ.200‌ ఫైన్‌తో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. <>ఆన్‌లైన్‌లో<<>> దరఖాస్తులు స్వీకరించనున్నారు.

News July 31, 2024

వచ్చే బడ్జెట్ సమావేశాలు 20 రోజులు నిర్వహించాలి: కేటీఆర్

image

TG: వచ్చే బడ్జెట్ సమావేశాలను 20 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. అందుకు తమ వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రభుత్వానికి తెలిపారు. ‘కొత్తగా 57మంది ఎమ్మెల్యేలు సభలో అడుగుపెట్టారు. వారందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి. సభ ఎక్కువ రోజులు నిర్వహిస్తే సమాధానం ఇచ్చేందుకు మంత్రులకూ సమయం ఉంటుంది’ అని పేర్కొన్నారు.

News July 31, 2024

ఎల్లుండి NEET-UG రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదల

image

AP: నీట్-యూజీ రాష్ట్ర ర్యాంకుల జాబితా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ర్యాంకుల్ని కేంద్రం ప్రకటించింది. దాన్ని అనుసరించి ఎల్లుండి రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని డా.ఎన్టీఆర్ వర్సిటీ అనౌన్స్ చేయనుంది. ఇక వచ్చే నెల 14 నుంచి MBBS అకడమిక్ సెషన్ స్టార్ట్ అవుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. ఆగస్టు తొలివారంలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది.

News July 31, 2024

హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్.. ఒకరు అరెస్ట్

image

HYD వనస్థలిపురం PS పరిధిలో దారుణం జరిగింది. యువతి(24)పై ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ అత్యాచారం చేశారు. ఇటీవల జాబ్ రావడంతో ఓ ఫ్రెండ్‌కు యువతి పార్టీ ఇచ్చింది. అతడు ఆమెకు బలవంతంగా మద్యం తాగించడంతో స్పృహ కోల్పోయిన అనంతరం రూమ్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఓ మ్యూచువల్ ఫ్రెండ్‌ను పిలిపించి, ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. స్పృహలోకి వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఓ యువకుడిని పట్టుకున్నారు.

News July 31, 2024

గనుల శాఖపై నేడు చంద్రబాబు సమీక్ష

image

AP: గనుల శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. YCP నేతలు ఇసుక ద్వారా రూ.వేల కోట్లు దోచుకున్నారని, క్వార్ట్జ్, సిలికాశాండ్ వంటివాటిల్లోనూ భారీగా దండుకున్నారని NDA కూటమి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై CM ఇప్పటికే శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.19,137కోట్ల మేర దోపిడీ జరిగిందని ఆయన పేర్కొన్నారు. నేటి సమీక్షలో సీఎం ఆ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు టాక్.

News July 31, 2024

మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

TG: రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రుణాలున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అవుతున్నాయి. రెండో విడత రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం నిన్న 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లను జమ చేసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 51,515 మందికి రుణమాఫీ కాగా.. అత్యల్పంగా HYD జిల్లాలో ఏడుగురికి మాఫీ జరిగింది. మరి డబ్బులు డిపాజిట్ అయినట్లు మీకు మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News July 31, 2024

హోంమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరతా: మల్లారెడ్డి

image

TG: బీఆర్ఎస్ మూడోసారి గెలిచిఉంటే తాను హోంమంత్రి అయ్యేవాడినని మల్లారెడ్డి చెప్పారు. సంవత్సరానికి నాలుగు సినిమాలు తీసేవాడినని, కొత్త శాటిలైట్ ఛానల్ పెట్టేవాడినని తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు హోంమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇందుకు సీఎం రేవంత్ అంగీకరించరని, జర్నలిస్టులు మధ్యవర్తిత్వం చేయాలని కోరారు.

News July 31, 2024

ప్రియుడితో పారిస్‌ టూర్.. బ్రెజిల్ అథ్లెట్‌పై వేటు

image

ఒలింపిక్స్‌లో మెడల్ కొట్టేందుకు అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. బ్రెజిల్‌కు చెందిన స్విమ్మర్ కరోలినా వియెరా మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరో అథ్లెట్ అయిన గాబ్రియేల్ శాంటోస్‌తో కలిసి పారిస్ అంతా విహరించి టోర్నీ సమయానికి తిరిగివచ్చారు. దీంతో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ ఆమెను స్వదేశానికి పంపించింది. సారీ చెప్పిన శాంటోస్‌కు ఆడే ఛాన్స్ ఇచ్చినప్పటికీ అతడు ఓడిపోయాడు.