News July 26, 2024

భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు

image

ఐఫోన్ ధరలను యాపిల్ సంస్థ తగ్గించింది. బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసింది. దీంతో 15 ప్రో మోడల్ ధర రూ.5100, ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.6వేలు తగ్గాయి. SE మోడల్ ధర రూ.2300 తగ్గింది. భారత్‌లో తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలూ రూ.300 తగ్గాయి. కాగా బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని 20 నుంచి 15శాతానికి కేంద్రం తగ్గించింది.

News July 26, 2024

ఆమెకు 115.. కూతురికి 95 ఏళ్లు

image

USలో ఓల్డెస్ట్ మహిళ ఎలిజబెత్ ఫ్రాన్సిస్ 115 ఏట అడుగుపెట్టారు. ఈమె 1909లో లూసియానాలో జన్మించారు. 11ఏళ్లకే తల్లి చనిపోవడంతో ఎన్నో కష్టాలు అనుభవించారు. టీనేజ్‌లో కాఫీ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. తన జీవితకాలంలో 20 మంది US అధ్యక్షులను, మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా-ఉక్రెయిన్ వార్ వరకు ఎన్నో ఉదంతాలను వీక్షించారు. ప్రస్తుతం తన 95 ఏళ్ల కూతురు డోరతీ విలియమ్స్‌తో కలిసి జీవిస్తున్నారు.

News July 26, 2024

గంజాయి, డ్రగ్స్ బానిసల కోసం డీఅడిక్షన్ సెంటర్లు: అనిత

image

AP: రాష్ట్రంలోని గంజాయి, డ్రగ్స్ బానిసల కోసం డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అనిత తెలిపారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. ‘గత పాలకులు రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారు. యువతకు ఉపాధి లేక డ్రగ్స్ రవాణా చేశారు. దాడుల సంఖ్యపై మాజీ సీఎం జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారు. దాడులకు గురైనవారి జాబితా ఇస్తే మేం అక్కడకు వెళ్తాం’ అని మంత్రి కౌంటర్ ఇచ్చారు.

News July 26, 2024

నీట్ యూజీ(రివైజ్డ్) ఫైనల్ ఆన్సర్ కీ విడుదల

image

నీట్ యూజీ(రివైజ్డ్) ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. తొలుత మే 5న నీట్ యూజీ పరీక్షను నిర్వహించగా, ఫలితాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఫైనల్ కీ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 26, 2024

LRS అమలుకు ప్రత్యేక టీమ్‌లు: భట్టి

image

TG: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(LRS) అమలు కోసం జిల్లాల్లో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా LRS సమస్యలను పరిష్కరించాలన్నారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. త్వరలో కొత్త దరఖాస్తులకు తేదీలను ప్రకటిస్తామన్నారు.

News July 26, 2024

సముద్ర గర్భంలో ‘డార్క్ ఆక్సిజన్’.. అసలేంటిదిదీ?(1/2)

image

భూమి పొరలు, మొక్కల నుంచి ఆక్సిజన్ లభిస్తుంది. అదేకాకుండా సముద్ర గర్భం నుంచి ‘డార్క్ ఆక్సిజన్’ ఉత్పత్తి అవుతోందని సైంటిస్టులు తాజాగా గుర్తించారు. సూర్యరశ్మి తాకని చోట సహజంగా ఏర్పడే చిన్న నాడ్యుల్స్(దృఢమైన లోహం) అణువులను ఆక్సిజన్‌, హైడ్రోజన్‌గా విడదీస్తున్నాయని చెప్పారు. గవ్వలు, నత్తగుల్లలు, సముద్రపు నీటిలో కరిగిన ఇతర మెటల్స్ నుంచి నాడ్యుల్స్ ఏర్పడ్డాయని తెలిపారు. ఈ ప్రక్రియకు వేల ఏళ్లు పడుతుందట.

News July 26, 2024

‘డార్క్ ఆక్సిజన్’ నాడ్యుల్స్‌పై కంపెనీల కన్ను.. పర్యావరణ విధ్వంసమే(2/2)

image

డార్క్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే నాడ్యుల్స్‌లో లిథియం, కోబాల్ట్, కాపర్ వంటి మెటల్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాటరీలు తయారు చేయడానికి అవసరం. దీంతో వాటిని సేకరించడానికి మైనింగ్ కంపెనీలు సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల వల్ల ఊహించని పర్యావరణ విధ్వంసం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎన్నో అరుదైన సముద్ర జీవులకు హాని కలుగుతుందని, సముద్ర అడుగుభాగం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

News July 26, 2024

ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: CM రేవంత్

image

TG: ధరణి పోర్టల్‌లో సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. సచివాలయంలో ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులపై సమీక్ష నిర్వహించారు. ‘ధరణి సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపాలి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలి. వాటి ఆధారంగా సమగ్ర చట్టం తేవాలి. అవసరమైతే అసెంబ్లీలో దీనిపై చర్చ పెడదాం’ అని అన్నారు.

News July 26, 2024

Paytmకు మళ్లీ అచ్చే దిన్!

image

పేటీఎంకు మళ్లీ మంచిరోజులు వస్తున్నట్టున్నాయ్! కంపెనీ పేమెంట్ సర్వీసెస్‌ యూనిట్లో చైనా పెట్టుబడులకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. తుది అనుమతి రాగానే పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం RBI వద్దకు పేటీఎం వెళ్లే ఛాన్స్ ఉంది. రూల్స్ పాటించకపోవడంతో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా 2023 మార్చిలో పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజా వార్తలతో పేటీఎం షేర్లు 10% ఎగిశాయి.

News July 26, 2024

ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక నిజాలు బయటకొస్తాయి: సిసోదియా

image

AP: మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో రికార్డుల దహనం కేసులో కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడుతుందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోదియా తెలిపారు. ‘YCP నేత మాధవరెడ్డి పరారయ్యారు. ఏడుగురిని విచారిస్తున్నాం. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక నిజాలు తెలుస్తాయి. రికార్డుల రికవరీకి ప్రయత్నం చేయొచ్చు. 20 ఏళ్ల తర్వాత డీ పట్టాలు ఫ్రీహోల్డ్ అవుతాయనే ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నాం’ అని చెప్పారు.