India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రపంచ నంబర్-1 టెన్నిస్ ప్లేయర్, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జన్నిక్ సిన్నర్ (ఇటలీ) పారిస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నారు. టాన్సిల్స్ కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని, ఇటలీ అథ్లెట్లకు ఇంటి నుంచే సపోర్ట్ చేస్తానని చెప్పారు.
<<-se>>#Olympics2024<<>>

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమాపై ఆగస్టు 22న అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అదే రోజు నుంచి షూటింగ్‌ను ప్రారంభిస్తారని సినీవర్గాలు తెలిపాయి. దీనికోసం ఒక ప్రత్యేక సెట్ వేశారని పేర్కొన్నాయి. ‘స్పిరిట్’ మూవీ ఆలస్యం కానున్న నేపథ్యంలో దానికంటే ముందే రాజాసాబ్, హనుతో చేసే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని రెబల్ స్టార్ భావిస్తున్నారట.

AP: రాష్ట్ర పోలీస్ శాఖలో 20వేల సిబ్బంది కొరత ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ‘కోర్టుల్లో కేసుల కారణంగా కానిస్టేబుళ్ల నియామకం నిలిచిపోయింది. వివాదం పరిష్కారం కాగానే నియామకాలు చేపడతాం’ అని శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చెప్పారు. 2024 నాటికి రాష్ట్రంలో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు 46,538 నమోదయ్యాయని, ట్రేసవుట్ కాని కేసుల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

బడ్జెట్‌లో బిహార్, ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపించిందని ఇండియా కూటమి నేతలు ఫైరవుతున్నారు. ఇదే ప్రచారాస్త్రంగా పలు రాష్ట్రాల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. త్వరలో ఎలక్షన్స్ జరిగే మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు BJP విస్తరించాలని భావిస్తున్న తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఇది ప్రధాన ప్రచారంగా మారే అవకాశం ఉంది. దీనిపై LSలో చర్చించేందుకు రాహుల్ 20 మంది ఎంపీలకు బాధ్యతలు అప్పగించారు.

TG: BRS అధినేత, మాజీ CM కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు అసెంబ్లీకి రానున్నారు. గాయం కారణంగా గత సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పలుమార్లు చెప్పింది. అటు తమ బాస్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చూడాలని BRS అభిమానులూ వేచి చూస్తున్నారు. మొత్తానికి ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగనున్నాయి.

గాజాతో యుద్ధంలో పూర్తి విజయాన్ని సాధించేవరకూ పోరాటం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. హమాస్‌తో పాటు ఇరాన్ మద్దతున్న గ్రూపులతో పోరాడేందుకు తమకు యూఎస్ సపోర్ట్ కావాలన్నారు. US, ఇజ్రాయెల్ కలిసి పని చేస్తే వారిని ఓడించవచ్చని అన్నారు. ‘మా యుద్ధం మీ యుద్ధమే. మా శత్రువులూ మీకు శత్రువులే. మా విజయం మీకూ విజయమే’ అని యూఎస్ కాంగ్రెస్‌లో వ్యాఖ్యానించారు.

TG: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. జీపీఎఫ్, ఇతర బిల్లులు కలిపి దాదాపు రూ.40వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో 10, 15 తేదీల వరకూ ఉద్యోగులకు జీతాలు వచ్చేవి కాదని, ఇప్పుడు తాము ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

AP: బీజేపీ శాసనసభాపక్ష నేతగా MLA విష్ణుకుమార్ రాజు, పార్టీ విప్‌గా MLA ఆదినారాయణరెడ్డి ఎంపికయినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. వీరిద్దరి ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి లేఖ పంపినట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధ ప్రసాద్, వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలిత కుమారి, దాసరి సుధ, పి.విష్ణుకుమార్ రాజులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

ఈసారి ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. అందులో 40 మందికి పైగా మహిళా అథ్లెట్లు ఉన్నారు. ఇందులో ఐదుగురు తెలుగమ్మాయిలు.
1. బ్యాడ్మింటన్: పీవీ సింధు
2. బాక్సింగ్: నిఖత్ జరీన్
3. 100 మీ. హార్డిల్స్ రేస్: జ్యోతి యర్రాజీ
4. టేబుల్ టెన్నిస్: శ్రీజ ఆకుల
5. 4×400M రిలే ఈవెంట్: జ్యోతిక శ్రీ
<<-se>>#Olympics2024<<>>

TG: రాష్ట్రంలో జోరు వర్షాలతో వానాకాలం సాగుకు సంబంధించి యూరియా, డీఏపీలకు డిమాండ్ పెరిగింది. గతంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు దుకాణదారులు ఎరువులు విక్రయించేవారు. ఇప్పుడు రవాణా ఛార్జీల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. బస్తా యూరియా రూ.273 కాగా రూ.300 తీసుకుంటున్నారు. డీఏపీ రూ.1,150 ఉండగా రూ.1,200 తీసుకుంటున్నారు. డిమాండ్ ఇంకా పెరిగితే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు భావిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.