News August 1, 2024

NEETలో 705 మార్కులు.. ఇంటర్‌లో ఫెయిల్!

image

నీట్‌లో టాప్ మార్కులు తెచ్చుకున్న గుజరాత్‌కు చెందిన ఓ విద్యార్థిని క్లాస్-12 (ఇంటర్‌)లో ఫెయిలైంది. ఆమెకు నీట్‌లో 720కి 705 మార్కులొచ్చాయి. కానీ బోర్డు పరీక్షల్లో ఫిజిక్స్‌లో 21, కెమిస్ట్రీలో 31 మార్కులే వచ్చాయి. సప్లిమెంటరీలోనూ మరోసారి ఫిజిక్స్‌(22)లో విఫలమైంది. దీంతో బోర్డు పరీక్షలే పాస్ కాని విద్యార్థినికి NEETలో అన్ని మార్కులెలా వచ్చాయని నెటిజన్లు మరోసారి పేపర్ లీకేజీపై సందేహాలు వ్యక్తం చేశారు.

News August 1, 2024

అధికంగా ఒత్తిడికి లోనవుతోంది మహిళా ఉద్యోగులే!

image

ఇంటిపనులు, ఆఫీస్ వర్క్‌‌తో మహిళా ఉద్యోగులే అధికంగా ఒత్తిడికి లోనవుతున్నారట. ‘యువర్‌ దోస్త్’ 5వేల మందిపై చేసిన అధ్యయనంలో ఇండియాలో వర్కింగ్ ఉమెన్స్ పురుషుల కంటే ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నట్లు తేలింది. ఇందులో 72.2% మంది మహిళలు, 53.64% మంది పురుషులు తాము ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నట్లు చెప్పారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై మహిళలు అవగాహన కలిగి ఉండటం మేలని నిపుణులు చెబుతున్నారు.

News August 1, 2024

896 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం

image

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 896 స్పెషలిస్ట్ ఆఫీసర్స్(SO) పోస్టుల భర్తీకి IBPS నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈనెల 21తో ఈ ప్రక్రియ ముగియనుంది. డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారు అప్లికేషన్‌కు అర్హులు. ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును రూ.850గా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175గా IBPS నిర్ణయించింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలుంటాయి. పూర్తి వివరాలకు <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించండి.

News August 1, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీఖాన్: మంత్రి పొంగులేటి

image

MLC అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి గవర్నర్‌కు పంపనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు, మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను HYD జంట జలాశయాలకు తరలిస్తామన్నారు. విధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం, మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్-1 జాబ్ ఇస్తామన్నారు.

News August 1, 2024

జుట్టు కత్తిరించేదే లేదు: జాన్వి

image

సినిమాలో తన పాత్ర కోసం ఎంత కష్టమైన భరిస్తాను కానీ జుట్టు మాత్రం కత్తిరించనని హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపారు. ‘నా కెరీర్‌ను మలుపు తిప్పే రోల్ అయినా సరే గుండు చేయించను. VFXలో మేనేజ్ చేస్తామంటే ఓకే. దీనికి కారణం మా అమ్మ శ్రీదేవి. ఆమెకు నా హెయిర్ అంటే ఇష్టం. దఢక్ మూవీ సమయంలో హెయిర్ కట్ చేస్తే తిట్టింది. ఏ పాత్ర కోసమైనా జుట్టు మాత్రం కత్తిరించుకోవద్దని సూచించింది’ అని ఉలఝ్ మూవీ ప్రమోషన్స్‌లో చెప్పారు.

News August 1, 2024

GOOD NEWS: రేపే జాబ్ క్యాలెండర్

image

TG: జాబ్ క్యాలెండర్‌‌ను రేపు అసెంబ్లీలో ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు రూ.437 కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. GHMCలో ఔటర్ గ్రామాల విలీనానికి శ్రీధర్‌బాబు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News August 1, 2024

OLYMPICS: ప్రణయ్‌పై లక్ష్యసేన్ విజయం

image

పారిస్ ఒలింపిక్స్ ప్రీక్వార్టర్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్‌తో జరిగిన పోరులో లక్ష్యసేన్ విజయం సాధించారు. తొలి సెట్లో 21-12, రెండో సెట్లో 21-6 తేడాతో ప్రణయ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. <<-se>>#Olympics2024<<>>

News August 1, 2024

BADMINTON: ఎనిమిదిసార్లు ఓడించిన జట్టు చేతిలోనే మళ్లీ..!

image

ఫైనల్ చేరి గోల్డ్ కొడుతుందనుకున్న సాత్విక్-చిరాగ్ జోడీ క్వార్టర్స్‌లో ఓడటంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. విజేతగా నిలిచిన మలేషియా జోడీ (చియా ఆరోన్- సోహ్ వోయ్ యిక్) గతంలో వీరిని వరుసగా ఎనిమిది సార్లు ఓడించింది. 2023లో సాత్విక్-చిరాగ్ జోడీ వరుసగా మూడుసార్లు గెలిచి ప్రతీకారం తీర్చుకోవడంతో ఒలింపిక్స్‌లో వీరి మధ్య పోరుపై అంచనాలు పెరిగాయి. కానీ దురదృష్టవశాత్తు మలేషియా మళ్లీ పైచేయి సాధించింది. <<-se>>#Olympics2024<<>>

News August 1, 2024

రాహుల్ vs పంత్.. రోహిత్ శర్మ ఏమన్నారంటే?

image

శ్రీలంకతో రేపటి నుంచి జరిగే ODI సిరీస్‌లో WKగా ఎవరిని ఆడించాలనేది ఇంకా నిర్ణయించలేదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘కేఎల్ రాహుల్, పంత్ ఇద్దరూ క్వాలిటీ ప్లేయర్స్, మ్యాచ్ విన్నర్స్. టీమ్‌లో క్వాలిటీ ఉంది కాబట్టే సెలక్షన్ గురించి బయట చర్చ జరుగుతోంది. జట్టులో ఇలాంటి మంచి ప్లేయర్లు ఉన్నప్పుడు తుది జట్టు ఎంపిక కష్టంగా మారుతుంది. కానీ ఇలాంటి సమస్యలు ఉండటం మంచిదే’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్నారు.

News August 1, 2024

త్వరలోనే కొత్త తెల్ల రేషన్ కార్డులు: ప్రభుత్వం

image

TG: కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీ రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు రూపొందించనుంది. ఈమేరకు త్వరలోనే కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇస్తామన్నారు. ధరణి పోర్టల్ పేరు భూమాతగా మార్పు, వయనాడ్ మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.