News July 24, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 24, 2024

TODAY HEADLINES

image

* రూ.48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల
* మధ్యతరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్: మోదీ
* AP: బడ్జెట్ నిధులతో రాష్ట్రానికి ఎంతో ఊరట: చంద్రబాబు
* TG: బడ్జెట్‌లో తెలంగాణ పదం నిషేధించారు: రేవంత్
* తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
* మహిళల ఆసియాకప్‌లో సెమీస్ దూసుకెళ్లిన భారత్
* ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడి 229 మంది మృతి

News July 23, 2024

BUDGET.. వారికి జీరో ట్యాక్స్

image

కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి గతంలో రూ.7లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది కాదు. సెక్షన్ 87A కింద రూ.25వేలు రిబేట్ లభిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50వేలు కలిపి ₹7.50 లక్షల వరకు పన్ను కట్టే పనిలేదు. తాజా బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ ₹75వేలకు పెంచారు. రిబేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో రూ.7.75 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

News July 23, 2024

ఎల్లుండి క్యాబినెట్ భేటీ

image

AP: ఈ నెల 25న మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ అత్యవసర క్యాబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అటు రేపు సాయంత్రం 4.30 గంటలకు మంత్రులు, కార్యదర్శులు, HODలతో చంద్రబాబు భేటీ కానున్నారు. శాఖల వారీగా ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉన్న అంశాల గురించి వారికి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

News July 23, 2024

నేపాల్‌పై ఘనవిజయం.. సెమీస్‌లోకి భారత్

image

ఆసియాకప్ టోర్నీలో నేపాల్‌తో జరిగిన మ్యాచులో భారత మహిళల జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. షఫాలీ(81), హేమలత(47) అదరగొట్టారు. ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 96 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి 3, అరుంధతి, రాధా యాదవ్ చెరో 2, రేణుకా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ సెమీస్ దూసుకెళ్లింది.

News July 23, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

News July 23, 2024

స్నేహపూర్వక దేశాలకు బడ్జెట్ కేటాయింపులు

image

ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి పనుల కోసం స్నేహపూర్వక దేశాలకు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. గతేడాది ₹5408.37 కోట్లు ఇవ్వగా, ఈసారి ₹4883.56 కోట్లు ఇవ్వనుంది. అత్యధికంగా భూటాన్‌కు ₹2068.56 కోట్లు, నేపాల్‌కు ₹700 కోట్లు, మాల్దీవులకు ₹400 కోట్లు, మారిషస్‌కు ₹270 కోట్లు, మయన్మార్‌కు ₹250 కోట్లు, శ్రీలంకకు ₹245cr, బంగ్లాదేశ్‌కు ₹120cr సహా మరికొన్ని దేశాలకు నిధులు కేటాయించింది.

News July 23, 2024

ఈ నెల 25న మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు

image

ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం కలసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 26న మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్‌ను సందర్శిస్తామని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో చెప్పారు. లక్షల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, BJPని చెరో ఎనిమిది సీట్లలో గెలిపిస్తే రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు.

News July 23, 2024

IPL.. ఆ జట్టుకు బిగ్ షాక్?

image

IPLలో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఆ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. 2022 నుంచి జట్టుతో ఉన్న వీరు వచ్చే సీజన్ కోసం GTతో కొనసాగేందుకు సుముఖంగా లేరని సమాచారం. నెహ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫ్రాంచైజీ యువరాజ్ సింగ్‌తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నెహ్రా అసంతృప్తికి గల కారణాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

News July 23, 2024

రెండు రోజుల్లో నీట్ తుది ఫలితాలు: కేంద్రమంత్రి

image

నీట్-యూజీ పేపర్ లీకేజీ కేసులో పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు <<13690901>>తీర్పును<<>> కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. సత్యమే గెలిచిందని, నీట్ తుది ఫలితాలను 2 రోజుల్లోగా వెల్లడిస్తామని మీడియాతో చెప్పారు. సుప్రీంకోర్టు <<13692290>>పరిశీలన<<>> ప్రకారమే నీట్ యూజీ మెరిట్ జాబితాను సవరిస్తామని చెప్పారు. పరీక్షల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే వదిలిపెట్టమని హెచ్చరించారు.