India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

US సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రంప్‌పై కాల్పుల ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆమె రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాల్పుల ఘటనలో సీక్రెట్ సర్వీస్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ను రక్షించడంలో తమ ఏజెన్సీ విఫలమైందని ఆమె ఇప్పటికే అంగీకరించారు. కాల్పుల ఘటన తర్వాత పెరిగిన ఒత్తిడితోనే ఆమె రాజీనామా చేశారని సమాచారం.

దేశంలోని టాప్-500 కంపెనీల్లో <<13688478>>ఇంటర్న్‌షిప్<<>> పొందేందుకు 21 నుంచి 24 ఏళ్లలోపు యువత అర్హులు. ఉద్యోగం లేని, ఫుల్ టైం ఎడ్యుకేషన్‌కు దూరంగా ఉండే వారు త్వరలో ప్రారంభమయ్యే పోర్టల్‌లో దరఖాస్తు చేయాలి. కంపెనీలే అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. IIT, IIM, IISER, CA, CMA క్వాలిఫై అయిన వారు.. పన్ను చెల్లించే, ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు అర్హులు కాదు. ఎంపికైతే నెలకు ₹5000, వన్‌టైమ్ అసిస్టెన్స్ కింద ₹6000 ఇస్తారు.

ఆసియా కప్‌లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో భారత ఉమెన్స్ ప్లేయర్లు చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన IND ప్లేయర్లలో ఓపెనర్ షెఫాలీ వర్మ నేపాల్ బౌలర్లపై ఫోర్లతో విరుచుకుపడ్డారు. కేవలం 48 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 81 రన్స్ చేశారు. మరో ఓపెనర్ హేమలత 47 రన్స్‌తో రాణించారు. రోడ్రిగ్స్ 28 పరుగులు చేశారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 178/3 రన్స్ చేసింది.

నీట్-యూజీ పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థుల్లో 4.2 లక్షల మంది 4 మార్కులు కోల్పోయారు. ఫిజిక్స్‌లోని ఓ ప్రశ్నకు రెండు ఆప్షన్లు సరైనవిగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో చాలామందికి 4 మార్కులు(ఓ ప్రశ్నకు) అదనంగా కలిశాయని, ఇది మెరిట్ లిస్టుపై ప్రభావం చూపిందని తెలిపారు. దీనిపై IIT ఢిల్లీ సూచనలతో ఆప్షన్ 4 ఎంచుకున్న వారికే మార్కులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

తనకు జనసేన నుంచి MLC ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కమెడియన్ హైపర్ ఆది స్పష్టం చేశారు. ‘శివం భజే’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు. పవన్ సంతోషంగా ఉంటే దూరం నుంచి చూస్తానని, బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటానని ఆది వ్యాఖ్యానించారు. ఇక అల్లు అర్జున్‌పై ట్రోలింగ్ ఆపాలని ఆయన కోరారు.

ఉద్యోగం చేసే చోట పలు విషయాలు రహస్యంగా ఉంచాలని సైకాలజీ నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక అంశాలు, రాజకీయ, మతపరమైన అభిప్రాయాలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటివి తోటి ఉద్యోగులతో షేర్ చేసుకోవద్దని అంటున్నారు. పంచుకుంటే అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే పనిచేసే చోట ఏమైనా సమస్యలు ఎదురైతే సరైన వారితో పంచుకోవాలని చెబుతున్నారు.

కేంద్ర బడ్జెట్‌పై హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సెటైర్లు వేశారు. ‘NDA బడ్జెట్ సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలోనే INDIA బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘బడ్జెట్ అసలేం అర్థంకాలేదు’ అని కొందరు అంటుండగా.. ‘ముందు ఇండియన్-2 బడ్జెట్ ఏమైందో చెప్పండి?’ అని మరికొందరు కమల్‌కు కౌంటర్ ఇస్తున్నారు.

నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)లో కేంద్రం మార్పులు చేసింది. పెన్షన్ పథకంలో మైనర్లను చేరుస్తూ ‘NPS-వాత్సల్య’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పేరెంట్స్, సంరక్షకులు పిల్లల పేరిట డబ్బులు జమ చేయొచ్చు. వారు మేజర్ అయ్యాక అది అటోమేటిక్‌గా రెగ్యులర్ NPS అకౌంట్‌గా మారుతుంది. పిల్లలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు FM నిర్మలా సీతారామన్ తెలిపారు.

వయసు పెరిగే కొద్ది ఆలోచన శక్తి మందగిస్తుంది. అయితే పలు అలవాట్లతో మెదడును యాక్టివ్‌గా, యవ్వనంగా మార్చవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. పోషకాహార డైట్, వ్యాయామాలు, మానసికంగా ఉత్తేజం కలిగించే పనులు చేయడం, సరిపడా నిద్ర, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, డీహైడ్రేట్ అవకుండా ఉండటం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వంటివి చేయాలని వెల్లడించాయి. వీటిని పాటిస్తే మెదడు ఆరోగ్యంగా ఉంటూ జ్ఞాపకశక్తి మెరుగవుతుందని పేర్కొన్నాయి.

2024లో ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో మోస్ట్ పాపులర్ సినిమాల లిస్టును IMDb పంచుకుంది. ‘కల్కి 2898AD’ దేశంలోనే టాప్‌లో నిలవగా ఆ తర్వాత మంజుమ్మల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, సైతాన్, లాపతా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్య సినిమాలు నిలిచాయి. అలాగే పుష్ప-2, దేవర పార్ట్-1, వెల్కమ్ టు ద జంగిల్ సహా మరికొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు IMDb తెలిపింది.
Sorry, no posts matched your criteria.