News July 23, 2024

నేను తప్పు చేసినా చర్యలు తీసుకోండి: పవన్

image

AP భవిష్యత్తు, పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి తాము పూర్తి సహకారం అందిస్తామని డిప్యూటీ CM పవన్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో ఖజానా ఖాళీ అయ్యింది. పోలవరం, అమరావతి ఆగిపోయాయి. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. ఎవరూ కక్ష సాధింపులకు పాల్పడవద్దు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన స్పష్టం చేశారు.

News July 23, 2024

తోటి IAS గురించి తెలుసుకోవాలని స్మితకు నెటిజన్ల హితవు!

image

<<13679127>>దివ్యాంగుల<<>> కోటాపై IAS స్మిత చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చేముందు తోటి IAS లోకేశ్ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. IAS లోకేశ్ కుమార్ దివ్యాంగుడైనప్పటికీ నిత్యం ప్రజల్లో ఉండేవారని చెబుతున్నారు. 2003 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారి 2019-23లో GHMC కమిషనర్‌గా ఫీల్డ్‌లో పనిచేశారు. వర్షాల్లో, కరోనా సమయంలోనూ రోడ్లపైకి వచ్చారని గుర్తుచేస్తున్నారు.

News July 23, 2024

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

image

బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా, రాష్ట్ర హక్కులను కాపాడేలా రేపు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిరసనను ప్రధానికి అధికారికంగా తెలియజేయడానికి తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతో కలిసిరావాలన్నారు. గతంలో ఇలాంటి వివక్షనే ప్రత్యేక రాష్ట్ర సాధనకు కారణమైందని సీఎం గుర్తు చేశారు.

News July 23, 2024

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ

image

TG: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సభ్యులతో ఆయన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ హామీల అమలు, జాబ్ క్యాలెండర్, రుణమాఫీ అమలులో ఆంక్షలు, రైతు భరోసా చెల్లింపులో ఇబ్బందులు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

News July 23, 2024

అధికారుల నిర్లక్ష్యానికి UPSC ఆస్పిరెంట్ బలి!

image

ఎన్నో ఆశలతో UPSCలో ర్యాంకే లక్ష్యంగా ఢిల్లీలో కోచింగ్‌కి వచ్చిన ఓ యువకుడు విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. వర్షానికి రోడ్డుపై వరద నిలవడంతో స్తంభం గుండా నీటిలో కరెంట్ ప్రవహించింది. అటువైపు ఇతడు వెళ్లడంతో విద్యుదాఘాతం జరిగి కుప్పకూలాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటో వైరలవుతోంది. వర్షం పడేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ కరెంట్ స్తంభాలను ముట్టుకోకండి.

News July 23, 2024

ఏపీకి ఇచ్చారు.. TGకి నిధులు ఇవ్వాలన్న బాధ్యత లేదా?: రేవంత్

image

AP పునర్విభజన చట్టంలో భాగంగా బడ్జెట్‌లో APకి నిధులు కేటాయించిన కేంద్రం.. TGకి ఎందుకు ఇవ్వలేదని CM రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘అమరావతి, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ప్రకటించింది. అదే పునర్విభజన చట్టం కింద TGకి నిధులు ఇవ్వాలన్న బాధ్యత లేదా? బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కనీసం స్పందించలేదు’ అని సీఎం ధ్వజమెత్తారు.

News July 23, 2024

బడ్జెట్‌లో తెలంగాణ పదం నిషేధించారు: సీఎం రేవంత్

image

TG: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై CM రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘TGపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించింది. మాకు నిధులు కేటాయించాలని స్వయంగా నేనే ఢిల్లీ వెళ్లి 3సార్లు PM మోదీకి విన్నవించాను. అనేకసార్లు కేంద్రమంత్రులను కలిశాను. ఇవాళ బడ్జెట్‌లో తెలంగాణ పదం నిషేధించారు. రాష్ట్రం ఊసే ఎత్తడానికి కేంద్రం ఇష్టపడలేదు. మోదీ మనసులో రాష్ట్రంపై కక్ష ఉంది’ అని విమర్శించారు.

News July 23, 2024

ఇండెక్సేషన్ అంటే? రద్దుతో ఎంత నష్టం?

image

2014లో మీరు రూ.10లక్షలు పెట్టి ప్లాట్ కొన్నారనుకుందాం. ఇప్పుడు రూ.20 లక్షలకు అమ్మేశారు. దానిపై వచ్చిన దీర్ఘకాల లాభం రూ.10లక్షలు. వడ్డీరేట్ల మార్పు, ద్రవ్యోల్బణాన్ని బట్టి గతంలో ఇండెక్సేషన్ బెనిఫిట్ కింద మీ లాభాన్ని సర్దుబాటు చేసేవాళ్లు. దాంతో LTCG, IT పన్ను భారం తగ్గేది. ఇప్పుడు ఇండెక్సేషన్ రద్దుతో పాటు పెంచిన LTCG పన్ను 12.5% గణిస్తే ఎక్కువ పన్నులు కట్టాలి. బంగారం, ఇతర ఆస్తుల పైనా ఈ పోటు తప్పదు.

News July 23, 2024

బడ్జెట్ షాక్: ప్లాట్లు అమ్మేవాళ్లపై పిడుగు

image

బడ్జెట్లో సాధారణ ప్రజలకు అర్థమవ్వని మెలిక ఒకటుంది. అదే ఇండెక్సేషన్ బెనిఫిట్ తొలగింపు. స్థిరాస్తి, బంగారం, నమోదు కాని ఇతర ఆస్తులపై దీర్ఘకాల లాభాల లెక్కింపును సరళతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒకవైపు LTCG పన్ను 10 నుంచి 12.5 శాతానికి పెంచడమే కాకుండా ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించడంతో జనాల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. రియల్ ఎస్టేట్‌ పెట్టుబడిదారులకు ఇది పెద్ద దెబ్బే!

News July 23, 2024

2023లో దాదాపు 4 కోట్ల మంది HIV బాధితులు: యూఎన్ రిపోర్ట్

image

2023లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది HIV బాధితులు ఉన్నట్లు UN నివేదిక పేర్కొంది. సరైన చికిత్స తీసుకోకపోవడంతో నిమిషానికి ఒకరు ఎయిడ్స్ సంబంధిత సమస్యతో మరణిస్తున్నారని తెలిపింది. మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరోప్, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలో కొత్త కేసులు పెరుగుతున్నాయంది. ప్రపంచ నేతలంతా 2030 కల్లా ఈ మహమ్మారిని అంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని UNAIDS ఈడీ విన్నీ కోరారు.