News July 23, 2024

BREAKING: ‘నీట్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

నీట్-యూజీ పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకైందని, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్లపై ఆయన ఈ తీర్పు వెలువరించారు. నీట్ పేపర్ లీకేజీ వాస్తవమేనని, కానీ దేశమంతా జరిగిందని చెప్పలేమన్నారు. లీకేజీతో లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హజారీబాగ్, పట్నాలో కాపీ జరిగినట్లు పేర్కొన్నారు.

News July 23, 2024

BREAKING: హైకోర్టుకు జగన్

image

AP: మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని ఆయన పిటిషన్ వేశారు. ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లేఖ రాసినా ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష నేతగా జగన్‌కు అర్హత లేదని టీడీపీ చెబుతోంది.

News July 23, 2024

షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారా?

image

TG: గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 63 ప్రకారం HYDలోని ప్రతి షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్‌లో మొదటి అరగంట పార్కింగ్ ఉచితం. ఆ తర్వాత ఒక్కో గంట చొప్పున రుసుం వసూలు చేయవచ్చు. అరగంట మించి, అక్కడ ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన బిల్లు చూపిస్తే వాహనం ఎంత సేపు ఉన్నా పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఈ నిబంధనలు పక్కాగా అమలవుతున్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.

News July 23, 2024

ఘోరం.. కొండచరియలు విరిగిపడి 146 మంది మృతి

image

ఇథియోపియాలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో భారీగా మరణాలు సంభవించాయి. గోఫాలోని గెజ్ ప్రాంతంలో ఇప్పటివరకు 146 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నిన్న ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు ఈ ప్రాంతంలో తరచుగా కొండ చరియలు విరిగిపడతాయని వెల్లడించారు.

News July 23, 2024

ఈ జిల్లాల్లో కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలో నిన్న కాస్త తెరిపిచ్చిన వర్షం ఇవాళ మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లో ఉదయం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. అయితే జిల్లాల్లోనూ రానున్న 3 గంటల్లో మోస్తరు వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయని పేర్కొంది.

News July 23, 2024

పురుషుల్లోనూ ప్రసవానంతర ఒత్తిడి

image

బిడ్డకు జన్మనిచ్చాక తల్లికి ప్రసవానంతర ఆందోళన, ఒత్తిడి ఉండటం సహజమే. అయితే తండ్రిలోనూ ప్రసవానంతర ఒత్తిడి ఉంటుందట. దీన్ని ‘న్యూ డాడ్ బ్లూస్’ అంటున్నారు. ప్రసవమైన భాగస్వామికి మద్దతివ్వడం, చిన్నారి విషయంలో అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించడంతో పురుషులు ఒత్తిడికి గురవుతున్నారట. నిద్రలేమి, దినచర్యలో మార్పులు జరిగి వారిలో కోపం, చిరాకు కనిపిస్తాయట. దీని నుంచి వ్యాయామాలు, యోగా వంటివి ఉపశమనం కలిగిస్తాయట.

News July 23, 2024

ఉద్యోగికి ఉన్న ట్యాక్స్ BCCIకి ఉండదా?.. నెట్టింట విమర్శలు

image

బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో బీసీసీఐ ట్యాక్స్ ఫ్రీగా ఉండటంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ‘ఏడాదికి రూ.17వేల కోట్లు ఆర్జించే బీసీసీఐకి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కానీ రూ.7 లక్షల ఆదాయం కలిగిన ఉద్యోగి మాత్రం 10శాతం పన్ను చెల్లించాలి. ఇదెక్కడి న్యాయం’ అని పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. బీసీసీఐ ఛారిటబుల్ ఆర్గనైజేషన్‌గా రిజిస్టర్ అయింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్‌లోని 12A ప్రకారం BCCIకి ట్యాక్స్ ఉండదు.

News July 23, 2024

హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు ప్రత్యేక నిధులు

image

పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించింది. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ఫండ్స్ కేటాయించింది. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా పారిశ్రామికాభివృద్ధికి సహకారం ఇస్తామని పేర్కొంది.

News July 23, 2024

నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

image

స్టాక్‌మార్కెట్ సూచీలు స్తబ్ధుగా ముగిశాయి. 80,724 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ ఒకానొక దశలో 1000 పాయింట్ల నష్టంతో 79,224 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత పుంజుకొని 80,766 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 73 పాయింట్ల నష్టంతో 80,429 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 24,074 వద్ద కనిష్ఠ, 24,582 వద్ద గరిష్ఠ స్థాయుల్ని తాకింది. 30 పాయింట్ల నష్టంతో 24,479 వద్ద క్లోజైంది. టైటాన్, ఐటీసీ షేర్లు 6.5% మేర ఎగిశాయి.

News July 23, 2024

కుర్చీని కాపాడుకునే బడ్జెట్: రాహుల్

image

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాలను పణంగా పెట్టి మిత్ర పక్షాలకు బుజ్జగించేందుకు హామీలు ఇచ్చారని Xలో పేర్కొన్నారు. సామాన్యులకు ఊరట కల్పించకుండా మిత్రులకు(అంబానీ, అదానీ) ప్రయోజనం చేకూర్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, గత బడ్జెట్లను కాపీ, పేస్ట్ చేశారని విమర్శించారు.