News July 23, 2024

కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

image

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పలు కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు YSR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును సైతం వైసీపీ ప్రభుత్వం YSR హెల్త్ యూనివర్సిటీగా మార్చింది.

News July 23, 2024

ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈరోజు మొదలైన విషయం తెలిసిందే. ఇవే 8రోజుల పాటు జరుగుతాయి. కాగా ఎల్లుండి ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

News July 23, 2024

ఏంజిల్ ట్యాక్స్ అంటే?

image

కొన్ని కంపెనీలు పెట్టుబడి కోసం ఏంజిల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు షేర్లను జారీ చేస్తాయి. వీటిని ఫెయిర్ మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తారు. ఒకవేళ సమీకరించిన పెట్టుబడి మార్కెట్ విలువను మించితే ఆదాయంగా భావించి IT స్లాబుల ప్రకారం పన్ను వేస్తారు. ఈ పన్ను ఎగవేసేందుకు కొందరు మార్కెట్ విలువను తగ్గించి చూపిస్తున్నారు. దీనిని అడ్డుకొనేందుకు 2012లో ఏంజిల్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు.

News July 23, 2024

చారిత్రక నిర్ణయం : ఏంజిల్ ట్యాక్స్ రద్దు

image

పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం చారిత్రక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు ఏంజిల్ ట్యాక్స్‌ను రద్దు చేసింది. అలాగే విదేశీ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్‌ను 40 నుంచి 35 శాతానికి కుదించింది. దీంతో స్టార్టప్‌లు, అన్ లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడిని సమీకరించే అవకాశాలు మెరుగవుతాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఏంజిల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు లబ్ధి చేకూరుతుంది.

News July 23, 2024

బడ్జెట్‌ కేటాయింపులపై నెట్టింట మీమ్స్

image

బడ్జెట్‌లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌పైనే ప్రత్యేకంగా కేంద్రం దృష్టి పెట్టిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలకు మొండిచేయి చూపిందంటూ పలువురు మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలూ జాక్‌పాట్ కొట్టాయని పోస్టులు పెడుతున్నారు. అటు.. అవసరం ఉంది కాబట్టే కేటాయింపులు జరిగాయని ఆ రెండు రాష్ట్రాలవారు సమర్థించుకుంటున్నారు.

News July 23, 2024

ఏపీ-బిహార్ బడ్జెట్‌లా ఉందని విమర్శలు!

image

నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశానిదా లేక బిహార్, ఏపీ రాష్ట్రాలదా అని కొందరు మండిపడుతున్నారు. ఏపీలో అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి నిధులు. వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు. బిహార్‌లో రోడ్డు ప్రాజెక్టులకు రూ. 26,000 కోట్లు కేటాయించారు. దీంతో 8 MPలు ఇచ్చిన తెలంగాణను మరిచిపోయారా? అని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

News July 23, 2024

బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యి

image

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్‌తో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్‌లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తలేదు.

News July 23, 2024

ఇదీ చంద్రబాబంటే: టీడీపీ శ్రేణుల సంబరాలు

image

AP: అమరావతికి కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై TDP శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తమ అధినేత చంద్రబాబు సమర్థతతోనే కేంద్రం ఈ నిధులిచ్చిందని కొనియాడుతున్నాయి. ‘విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఈ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చింది లేదు. వ్యూహాత్మకంగా ఎన్డీయేలో చేరడం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ద్వారా చంద్రబాబు తన మార్కు రాజకీయం చూపించారు’ అంటూ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 23, 2024

ఏటా 25వేలమంది విద్యార్థులకు లోన్లు: నిర్మల

image

విద్యార్థుల చదువుకోసం మోడల్ స్కిల్ రుణ పథకంలో మార్పులు తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. ‘దీని ద్వారా ఏటా 25వేలమంది విద్యార్థులకు సాయం అందనుంది. ఇక స్వదేశీ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ. 10లక్షల వరకు రుణాన్ని ఈ-వోచర్ల రూపంలో విద్యార్థులకు అందివ్వనున్నాం. ఏటా లక్షమంది విద్యార్థులకు వీటిని డైరెక్ట్‌గా ఇస్తాం. లోన్ మొత్తంలో 3శాతం వార్షిక వడ్డీ ఉంటుంది’ అని తెలిపారు.

News July 23, 2024

MSMEల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం: నిర్మల

image

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)ల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘దీని ద్వారా టర్మ్ లోన్లను జారీ చేస్తాం. పాత లోన్లను క్లియర్ చేసిన వారికి ‘ముద్ర’ రుణాల పరిమితిని ప్రస్తుతమున్న రూ.10లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతాం. కొవిడ్‌ సమయంలో MSME రంగం తీవ్రంగా దెబ్బతింది. అది కోలుకునేందుకు ఈ రుణాలు ఉపకరిస్తాయి’ అని తెలిపారు.