India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఈ నెల 25న మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ అత్యవసర క్యాబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అటు రేపు సాయంత్రం 4.30 గంటలకు మంత్రులు, కార్యదర్శులు, HODలతో చంద్రబాబు భేటీ కానున్నారు. శాఖల వారీగా ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉన్న అంశాల గురించి వారికి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

ఆసియాకప్ టోర్నీలో నేపాల్‌తో జరిగిన మ్యాచులో భారత మహిళల జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. షఫాలీ(81), హేమలత(47) అదరగొట్టారు. ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 96 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి 3, అరుంధతి, రాధా యాదవ్ చెరో 2, రేణుకా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ సెమీస్ దూసుకెళ్లింది.

AP: రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి పనుల కోసం స్నేహపూర్వక దేశాలకు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. గతేడాది ₹5408.37 కోట్లు ఇవ్వగా, ఈసారి ₹4883.56 కోట్లు ఇవ్వనుంది. అత్యధికంగా భూటాన్‌కు ₹2068.56 కోట్లు, నేపాల్‌కు ₹700 కోట్లు, మాల్దీవులకు ₹400 కోట్లు, మారిషస్‌కు ₹270 కోట్లు, మయన్మార్‌కు ₹250 కోట్లు, శ్రీలంకకు ₹245cr, బంగ్లాదేశ్‌కు ₹120cr సహా మరికొన్ని దేశాలకు నిధులు కేటాయించింది.

ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం కలసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 26న మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్‌ను సందర్శిస్తామని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో చెప్పారు. లక్షల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, BJPని చెరో ఎనిమిది సీట్లలో గెలిపిస్తే రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు.

IPLలో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఆ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. 2022 నుంచి జట్టుతో ఉన్న వీరు వచ్చే సీజన్ కోసం GTతో కొనసాగేందుకు సుముఖంగా లేరని సమాచారం. నెహ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫ్రాంచైజీ యువరాజ్ సింగ్‌తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నెహ్రా అసంతృప్తికి గల కారణాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నీట్-యూజీ పేపర్ లీకేజీ కేసులో పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు <<13690901>>తీర్పును<<>> కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. సత్యమే గెలిచిందని, నీట్ తుది ఫలితాలను 2 రోజుల్లోగా వెల్లడిస్తామని మీడియాతో చెప్పారు. సుప్రీంకోర్టు <<13692290>>పరిశీలన<<>> ప్రకారమే నీట్ యూజీ మెరిట్ జాబితాను సవరిస్తామని చెప్పారు. పరీక్షల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే వదిలిపెట్టమని హెచ్చరించారు.

US సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రంప్‌పై కాల్పుల ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆమె రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాల్పుల ఘటనలో సీక్రెట్ సర్వీస్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ను రక్షించడంలో తమ ఏజెన్సీ విఫలమైందని ఆమె ఇప్పటికే అంగీకరించారు. కాల్పుల ఘటన తర్వాత పెరిగిన ఒత్తిడితోనే ఆమె రాజీనామా చేశారని సమాచారం.

దేశంలోని టాప్-500 కంపెనీల్లో <<13688478>>ఇంటర్న్‌షిప్<<>> పొందేందుకు 21 నుంచి 24 ఏళ్లలోపు యువత అర్హులు. ఉద్యోగం లేని, ఫుల్ టైం ఎడ్యుకేషన్‌కు దూరంగా ఉండే వారు త్వరలో ప్రారంభమయ్యే పోర్టల్‌లో దరఖాస్తు చేయాలి. కంపెనీలే అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. IIT, IIM, IISER, CA, CMA క్వాలిఫై అయిన వారు.. పన్ను చెల్లించే, ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు అర్హులు కాదు. ఎంపికైతే నెలకు ₹5000, వన్‌టైమ్ అసిస్టెన్స్ కింద ₹6000 ఇస్తారు.

ఆసియా కప్‌లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో భారత ఉమెన్స్ ప్లేయర్లు చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన IND ప్లేయర్లలో ఓపెనర్ షెఫాలీ వర్మ నేపాల్ బౌలర్లపై ఫోర్లతో విరుచుకుపడ్డారు. కేవలం 48 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 81 రన్స్ చేశారు. మరో ఓపెనర్ హేమలత 47 రన్స్‌తో రాణించారు. రోడ్రిగ్స్ 28 పరుగులు చేశారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 178/3 రన్స్ చేసింది.
Sorry, no posts matched your criteria.