India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పూరీ జగన్నాథుని ‘రత్నభాండాగారం’ లోపలి గదిలో ఇప్పటివరకు లిస్టులో లేని పురాతన విగ్రహాలను అధికారులు గుర్తించారు. ‘అవి చిన్న విగ్రహాలు. 5 నుంచి 7 వరకూ ఉండొచ్చు. నల్లగా మారిపోయాయి. వాటిని మేము తాకలేదు. దీపం వెలిగించి పూజలు చేశాం. వాటిని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తాం’ అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఇవాళ రహస్య గదిని కూడా తెరవనున్నారు.

TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నేటి నుంచి వచ్చే నెల 5 వరకు DSC పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు 14 జిల్లాల్లోని 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. ప్రతి రోజూ రెండు షిఫ్టుల్లో (9-11:30AM, 2-4:30PM) ఎగ్జామ్స్ జరగనుండగా, పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను ప్రభుత్వం తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది.

TG: రైతులకు రుణమాఫీ పథకాన్ని సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. సా.4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన అనంతరం నిధులను విడుదల చేయనున్నారు. తొలి విడతలో భాగంగా ఇవాళ రూ.లక్షలోపు రుణాలున్న 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. అగస్టు 15 నాటికి రూ.2లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

TG: రైతు రుణమాఫీ గైడ్‌లైన్స్ సరిగ్గా లేవని CPM నేత బీవీ.రాఘవులు విమర్శించారు. పాస్ బుక్ ఆధారంగా కౌలు రైతులు, పోడుదారుల రుణాలు ఎలా మాఫీ అవుతాయని ప్రశ్నించారు. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కౌలుదారులకు ఇవ్వకుండా ఎవరికిచ్చినా ప్రయోజనం లేదన్నారు. రీషెడ్యూల్ చేసిన రుణాలకు రైతుమిత్ర గ్రూపులకు, చిన్న, సన్న కారు రైతులకు మాఫీ జరగటం లేదన్నారు. వెంటనే గైడ్‌లైన్స్ మార్చాలని కోరారు.

AP: పల్నాడులో తమ కార్యకర్త దారుణ <<13650476>>హత్యపై<<>> వైసీపీ తీవ్రంగా స్పందించింది. ‘మీ టీడీపీ వాళ్ల రాక్షసానందానికి ఇంకెంతమంది బలి కావాలి?’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనితను ట్విటర్‌లో ట్యాగ్ చేసింది. ‘దేశంలో మరీ ఇంత నీచమైన కక్ష సాధింపు రాజకీయాలు ఎవరైనా చేస్తారా చంద్రబాబు?’ అని ప్రశ్నించింది. రషీద్‌ను జిలానీ కత్తితో నరుకుతున్న వీడియోను పోస్ట్ చేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్థాన్‌కు టీమ్ ఇండియా వెళ్తుందా? లేదా? అనే దానిపై రేపు స్పష్టత వచ్చే అవకాశముంది. శ్రీలంకలో రేపు జరగనున్న ICC వార్షిక సమావేశంలో దీనిపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. దీనితో పాటు ప్రస్తుతం BCCI సెక్రటరీగా ఉన్న జై షా ICC ఛైర్మన్ అవుతారా? అనే దానిపై కూడా క్లారిటీ రానున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్‌లే (NZ) ఉన్నారు.

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీకి 7లక్షల ఓట్ల మెజారిటీ తీసుకురావాలని AICC లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై స్థానిక నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. రాహుల్ గాంధీకి ఇక్కడ 2019లో 4.31లక్షలు, 2024లో 3.64లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆయన ఈ స్థానాన్ని వదులుకోవడంతో బై ఎలక్షన్ రానుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. తాజా పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు వాక్సినేషన్ జరిగిందని, డెలావేర్‌లో ఐసొలేషన్‌లో ఉంటారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ తెలిపారు. ఆయన హెల్త్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, ఐసొలేషన్‌లో ఉంటూనే బైడెన్ తన విధులను నిర్వహిస్తారని పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం ‘మల్టీ ఆడియో ట్రాక్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఉపయోగించి యూజర్లు ఒకే రీల్‌కు 20 వరకు ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత యాప్‌లోని వీడియో ఎడిటర్‌లో ‘Add to mix’ అనే ఆప్షన్ ఎంచుకుని కావాల్సిన ఆడియో ట్రాక్స్‌ను సెలక్ట్ చేయాలి. ఇలా క్రియేట్ చేసిన ట్రాక్‌లను ఇతరులు కూడా వాడుకోవచ్చు.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో వాడిన ‘వాఘ్ నఖ్’ ఆయుధాన్ని లండన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. 1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను చంపేందుకు ఆయన దీనిని వాడినట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో యూకేకి చేరిన ఈ ఆయుధాన్ని నిన్న బుల్లెట్ ప్రూఫ్ కవర్‌లో స్వదేశానికి తీసుకువచ్చారు. దీనిని 7 నెలలపాటు మహారాష్ట్రలోని సతారాలో ఉన్న శివాజీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు.
Sorry, no posts matched your criteria.