News July 26, 2024

స్కూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

AP: స్కూళ్లలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన CBSE, టోఫెల్ బోధన విధానంపై సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. వాటిని హడావుడిగా అమలు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సన్నద్ధం కాలేదన్నారు. వాటి మంచి, చెడులపై అధ్యయనం చేస్తామన్నారు. అటు స్కూళ్లలో ప్రవేశాలు తగ్గుతున్నందున అడ్మిషన్లు పెంచడం, నాణ్యమైన విద్య అందించడంపై వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలిస్తామని వెల్లడించారు.

News July 26, 2024

ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

image

TG: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. జూరాలకు 2.38 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అంతే నీటిని బయటకు వదులుతున్నారు. తుంగభద్రకు 89 వేల క్యూసెక్కుల ప్రవాహం పోటెత్తడంతో 28 గేట్లు ఎత్తివేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలానికి 2,46,965 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 858.40 అడుగులుగా ఉంది.

News July 26, 2024

నా వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి: లాయర్

image

TNలోని కన్యాకుమారిలో తన వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని లాయర్ మురుగన్ మద్రాస్ HCలో పిటిషన్ వేయగా కోర్టు అవాక్కైంది. తాము పరస్పర సమ్మతితో సెక్స్ సర్వీస్‌ అందిస్తున్నామని వాదించారు. తనపై కేసు కొట్టేయాలని, తన వ్యాపారం జోలికి రాకుండా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. చట్టవిరుద్ధ వ్యాపారానికి భద్రత కోరినందుకు ఆగ్రహించిన కోర్టు మురుగన్‌కు ₹10వేల ఫైన్‌, సర్టిఫికెట్లు సమర్పించాలని ఆదేశించింది.

News July 26, 2024

పింఛన్ల పెంపు లేనట్లేనా?

image

TG: కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో పింఛన్ల పెంపు ఒకటి. కానీ ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు చూస్తే పెంపు కష్టమేనని తెలుస్తోంది. ఆసరా స్థానంలో చేయూత తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత బడ్జెట్‌లో ఆసరాకు రూ.12వేల కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.14,861 కోట్లు కేటాయించారు. అయితే పింఛన్లు రూ.4వేలకు పెంచాలంటే ఇవి సరిపోవని తెలుస్తోంది. మరి పెంచుతారా? లేదా? అనేది ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.

News July 26, 2024

దీనిపై కాంగ్రెస్ ఏం చెబుతుంది?: KTR

image

TG: గతంలో ప్రధానితో సమావేశాలను సీఎం కేసీఆర్ బహిష్కరిస్తే, కేంద్రంతో BRS కుమ్మక్కైందని కాంగ్రెస్ ఆరోపించిందని మాజీ మంత్రి KTR ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశాన్ని రేవంత్ రెడ్డి బాయ్ కాట్ చేయడంపై కాంగ్రెస్ ఏం చెబుతుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమస్యలపై ప్రధాని(పెద్దన్న)ని కలిసి మాట్లాడాలని తమ్ముడు(రేవంత్) ఎందుకు అనుకోవట్లేదని ప్రశ్నించారు.

News July 26, 2024

ఆ ఒక్కటి జరిగితే అందరూ BSNLలోకే!

image

JIO, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు పెంచడంతో అందరి చూపు డేటా ప్రైవసీ, ప్లాన్ల ధరలు తక్కువున్న BSNLపై పడింది. అయితే ప్రైవేటు కంపెనీలు 5G సేవలు అందిస్తుంటే BSNL మాత్రం 4G సేవలు అందించేందుకే తంటాలు పడుతోంది. కేంద్రం బడ్జెట్‌లో ఈ సంస్థ కోసం రూ.82,916కోట్లు కేటాయించింది. కేంద్రం ఇలాగే BSNLకు అండగా ఉండి 5G తీసుకొస్తే ఆ నెట్‌వర్క్‌లోకి వెళ్లేందుకు యూజర్లు సిద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

News July 26, 2024

నేడు ఆర్థిక శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం

image

AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. రూ. 11 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు సర్కారు తేల్చింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులు రూ.1.41 లక్షల కోట్లని, వాటిలో ప్రాజెక్టులకు సంబంధించి రూ.19,324 కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖలో రూ.19,549 కోట్లు, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.7700 కోట్ల బకాయిలున్నట్లు సమాచారం.

News July 26, 2024

టీమ్ ఇండియా నిర్ణయం సరైందే: భజ్జీ

image

పాక్‌లో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా వెళ్లకపోవడమే సరైన నిర్ణయమని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అక్కడి పరిస్థితులేవీ బాలేవని తెలిపారు. ‘భారత జట్టు పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లాలి? ఆ దేశంలో భద్రతపై ఆందోళనలున్నాయి. ప్రతిరోజూ అక్కడ ఏదొక ఘటన జరుగుతుంటుంది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే. ఆటగాళ్ల భద్రతకంటే ఏదీ ముఖ్యం కాదు’ అని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

News July 26, 2024

స్మిత వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: మంత్రి సురేఖ

image

TG: దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన <<13679127>>వ్యాఖ్యలు<<>> బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉన్నత స్థానంలో ఉండి, తర్వాతి పరిణామాల గురించి ఆలోచించకుండా మాట్లాడటం తగదని ఓ ప్రకటనలో తెలిపారు. తమ మాటలు సమాజానికి ఎలాంటి సందేశాన్నిస్తాయో ఆలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వివక్షకు చోటు లేదని, అన్ని వర్గాల హక్కులకు రక్షణ ఉంటుందని మంత్రి చెప్పారు.

News July 26, 2024

Govt Schools ఖాళీ అయిపోతున్నాయ్!

image

AP: ఎందరో మహనీయుల్ని తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి నేడు ఘోరంగా మారింది. మొత్తం 44వేల ప్రభుత్వ పాఠశాలలకు గాను 6216 స్కూళ్లలో 10మందిలోపే విద్యార్థులున్నారు. 104 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. 81 స్కూళ్లు కేవలం ఒకే విద్యార్థితో నడుస్తున్నాయి. సర్కారు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే పరిస్థితి వస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.