News July 17, 2024

రూపాయి రూపాయి పోగేసి రుణమాఫీ చేస్తున్నాం: భట్టి

image

TG: రైతులకు పంట రుణాలు మాఫీ చేసేందుకు రూపాయి రూపాయి పోగేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.2లక్షలు ఒకేసారి మాఫీ చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని తెలిపారు. అన్ని రైతు కుటుంబాలకు ఆగస్టు ముగిసేలోపు కచ్చితంగా రుణమాఫీ చేస్తామని భట్టి స్పష్టం చేశారు.

News July 17, 2024

ALERT.. కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షం

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాత్రి 8 గంటల్లోగా వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మల్కాజ్‌గిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, భువనగిరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

News July 17, 2024

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ ఇంటిపైకి బుల్డోజర్

image

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌ ఇంటి బయట ఉన్న అక్రమ నిర్మాణాలను పుణే మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్‌తో కూల్చేస్తోంది. దీనిపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, వారి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే కూల్చివేతలు చేపట్టామని అధికారులు వివరించారు. బ్యూరోక్రాట్‌గా పదవిని దుర్వినియోగం చేయడం, తప్పుడు పత్రాల్ని సమర్పించడం వంటి పలు ఆరోపణల్ని పూజ ఎదుర్కొంటున్నారు.

News July 17, 2024

ట్రంప్ మళ్లీ గెలిస్తే నాటో పాలసీల్లో మార్పు?

image

మరోసారి అధికారంలోకి వస్తే US అంతర్జాతీయ వ్యవహారాల్లో ట్రంప్ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నాటో వ్యవహారాల్లో US పాత్రను తగ్గించేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం అందించినందుకు అమెరికాకు $200 బిలియన్లు పరిహారం చెల్లించమని ఐరోపాను అడుగుతానని ప్రచారం సందర్భంగా ట్రంప్ చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు సాయాన్ని కొనసాగించడంపైనా ట్రంప్ విముఖంగా ఉన్నారు.

News July 17, 2024

ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్లు: హరియాణా ప్రభుత్వం

image

సైన్యంలో పని చేసే అగ్నివీర్‌లకు పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు హరియాణా CM నాయబ్ సైనీ ప్రకటించారు. కానిస్టేబుల్, మైనింగ్ గార్డ్, ఫారెస్ట్ గార్డ్, జైల్ వార్డెన్ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే కానిస్టేబుల్ నియామకాల్లో CISF, BSF, CRPF వంటి కేంద్ర సంస్థల్లో అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

News July 17, 2024

అలాగైతే కేజ్రీవాల్ నిద్ర నుంచి లేవకపోవచ్చు: లాయర్

image

ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న CM కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని ఆయన లాయర్ అభిషేక్ సింఘ్వీ అన్నారు. కేజ్రీవాల్ నిద్రలో ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ 50కి పడిపోయాయని, ఇలా అకస్మాత్తుగా పడిపోవడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇలాగైతే ఆయన నిద్ర నుంచి లేవలేరని ఢిల్లీ హైకోర్టుకు వివరించారు. మరోవైపు మార్చి 21న అరెస్టయినప్పటి నుంచి కేజ్రీవాల్ 8.5KGల బరువు తగ్గారని AAP నేత సంజయ్ సింగ్ అన్నారు.

News July 17, 2024

ఆ మూడు చట్టాలను సడలించనున్న కేంద్రం?

image

ది కంపెనీస్ యాక్ట్ (2013), కాంపిటీషన్ యాక్ట్ (2002), ఇన్సాల్వెన్సీ & బ్యాంక్రప్ట్సీ కోడ్ (2016) చట్టాలను కేంద్రం సడలించే అవకాశం ఉంది. ఈ చట్టాల్లోని 14 ప్రొవిజన్లను డీక్రిమినలైజ్ చేసే అంశాన్ని పరిశీలిస్తోందట. ఆరు ప్రొవిజన్లు ఇప్పటికే షార్ట్ లిస్ట్ కాగా మరో ఎనిమిదింటిని కేంద్రం పరిశీలిస్తోందని అధికార వర్గాల సమాచారం. వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

News July 17, 2024

ITR ఫైలింగ్ గడువు పొడిగిస్తారా?

image

ITR దాఖలులో పలువురు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో గడువు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ-ఫైలింగ్ సైట్లో లాగిన్ ఇబ్బందులు, పాస్‌వర్డ్ రీసెట్, ఈ-వెరిఫికేషన్‌లోనూ సమస్యలున్నట్లు చార్టెడ్ అకౌంటెంట్లు, పలువురు ఆర్థిక నిపుణులు ఆదాయ పన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లారు. కాగా జులై 31తో ఈ గడువు ముగియనుంది. ఇక జులై 14 వరకు 2.7కోట్ల రిటర్నులు దాఖలైనట్లు సమాచారం. గతేడాదితో పోల్చితే ఇది 13% అధికం.

News July 17, 2024

3 విడతల్లో రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్

image

TG: రైతు రుణమాఫీని మొత్తం మూడు విడతల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీపీసీసీ నేతలతో ప్రజాభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రేపు సా.4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తాం. రూ.7వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయి. ఈ నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు, ఆగస్టులో రూ.2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తాం. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తవుతుంది’ అని వెల్లడించారు.

News July 17, 2024

త్వరలో APకి ఆకే రవికృష్ణ

image

AP: కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆంధ్రా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆకే రవికృష్ణ మరికొన్ని రోజుల్లో ఏపీకి రానున్నారు. ఈ మేరకు ఆయన్ను పంపించే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ఏపీలో డ్రగ్స్ నియంత్రణకోసం ఏర్పాటు కానున్న యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ ఫోర్స్‌ బాధ్యతల్ని ఆయనకు అప్పగించే అవకాశముంది. 2006 బ్యాచ్‌కు చెందిన రవికృష్ణ 2018 నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు.