India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబోలో రానున్న ‘హిట్-3’ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్‌తోనూ ఆయన ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.

వాట్సాప్‌లో ‘ఫేవరెట్స్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మీరు ముఖ్యమైన కాంటాక్ట్స్‌కు వెంటనే కాల్ చేసేందుకు ఇది సాయపడుతుంది. ఇందుకోసం కాంటాక్ట్స్‌ను ఫేవరెట్స్ లిస్టులోకి యాడ్ చేసుకోవాలి. దీనికోసం యాప్‌లో ‘కాల్స్’ బటన్‌పై క్లిక్ చేయాలి. టాప్‌లో ‘Add to favorites’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కావాల్సిన నంబర్లను సెలక్ట్ చేసి యాడ్ చేయాలి. అవి కాల్స్ ట్యాబ్ క్లిక్ చేయగానే పైన కనిపిస్తాయి.

AP: రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానించేలా CRDA ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీడ్ యాక్సిస్ రోడ్డు తరహాలో మరో రెండు రోడ్లు అభివృద్ధి చేయాలని భావిస్తోంది. చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేకు ఈ-11, 12 రోడ్లను కనెక్ట్ చేయాలని, కొండ అంచు నుంచి రోడ్లు నిర్మించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌కు 3 ఫార్మాట్లలో ఆడగలిగే సత్తా ఉందని మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ తెలిపారు. భవిషత్తులో వీరిద్దరూ టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు బ్యాక్‌బోన్‌గా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. చాలా కాలం భారత జట్టుకు ఆడతారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. IND బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ పదవీకాలం టీ20 WC అనంతరం ముగిసిన సంగతి తెలిసిందే.

TG: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ‘ప్రజావాణి’ ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు అధికారులను DGP జితేందర్ ఆదేశించారు. పీఎస్‌లలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. హిస్టరీ షీట్‌లను సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలన్నారు. SC, STలు, మహిళలు, శాంతి భద్రతలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

పీఎం కేర్స్ చిల్డ్రన్ స్కీమ్‌కు దేశవ్యాప్తంగా 9,331 దరఖాస్తులు రాగా, వాటాలో సగం మాత్రమే ఆమోదం పొందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మిగతావి రిజెక్ట్ అయినట్లు సమాచారం. కోవిడ్ టైంలో పేరెంట్స్‌ను కోల్పోయిన చిన్నారుల కోసం కేంద్రం ఈ పథకాన్ని తెచ్చింది. పిల్లలకు 23 ఏళ్లు వచ్చేసరికి ₹10లక్షల సాయం అందించనుంది. దీంతో పాటు స్కూల్‌కు వెళ్లే పిల్లలకు ₹20వేల స్కాలర్‌షిప్, ఖర్చుల కోసం నెలకు ₹4వేలు ఇవ్వనుంది.

AP: గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతలా దిగజారిందో అమిత్ షాకు వివరించినట్లు CM చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాలపై ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ అసమర్థత, అవినీతి రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయని ట్వీట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు.

తేది: జులై 17, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:31 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

వలస కార్మికుల రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను రాష్ట్రాలు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 4 వారాల్లోగా వెరిఫికేషన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న దాదాపు 8కోట్ల మంది వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని గతంలో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు TG, బిహార్ మాత్రమే 100% వెరిఫికేషన్‌ను పూర్తిచేశాయి.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.