India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టెక్ దిగ్గజం శామ్‌సంగ్ స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. Samsung Galaxy Ring పేరుతో రిలీజైన ఇది మానవ జీవన శైలిని క్యాప్చర్ చేస్తుంది. Samsung Health యాప్‌లోని AI.. వ్యక్తికి సంబంధించిన పీరియడ్స్ టైమింగ్, స్లీప్ ట్రాకింగ్, హృదయ స్పందన రేటు, స్కిన్ టెంపరేచర్ వంటివి తెలియజేస్తుంది. దీని ధర $399 (రూ.33వేలు)గా శామ్‌సంగ్ నిర్ణయించింది. తాజాగా ప్రీఆర్డర్ మొదలవగా ఈనెల చివరి వారంలో డెలివరీ చేయనుంది.

అధికారాలను దుర్వినియోగం చేసిన ట్రైనీ IAS <<13605832>>పూజా<<>> ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రం చర్యలు చేపట్టింది. ఇంటర్వ్యూ సమయంలో ఆమె సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2 వారాల్లో తన నివేదికను సమర్పించనుంది. మరోవైపు వివాదం నేపథ్యంలో పుణేలోని పూజ ఇంటికెళ్లిన మీడియాపై ఆమె తల్లి చిందులు తొక్కారు. కెమెరామెన్లపై అరుస్తూ తోసేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

విద్యార్థుల ఆత్మహత్యల అంశం సామాజిక సమస్యగా మారిందని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని CJI జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. సూసైడ్‌లను అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలంటూ గౌరవ్ బన్సల్ అనే లాయర్ దాఖలు చేసిన పిల్‌పై సుప్రీం స్పందించింది. కాగా 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు.

భారతీయుడు-2 సినిమాకు మధురై జిల్లా కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమని పిటిషనర్ రాజేంద్రన్‌కు స్పష్టం చేసింది. మర్మకళపై తాను రాసిన పుస్తకం ఆధారంగా మూవీలో సీన్లు తీశారని రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా పార్ట్-1లోని సన్నివేశాలనే కొనసాగించామని నిర్మాతలు కోర్టుకి తెలిపారు. వాదనల అనంతరం రాజేంద్రన్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

TG: ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. <

AP: గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని డిప్యూటీ CM పవన్ చెప్పారు. 250 పైన జనాభా కలిగిన ప్రతి పల్లెనూ మెయిన్ రహదారితో అనుసంధానించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ₹4,976 కోట్ల నిధులతో 7,213KM మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30% మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించేలా కేంద్రాన్ని కోరతామని తెలిపారు.

బరువు తగ్గాలని చాలామంది ఆహారంలో మార్పులు చేస్తుంటారు. కొంతమంది రాత్రిపూట భోజనం మానేస్తుంటారు. సమతుల్య ఆహారం తీసుకుంటే బరువును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బియ్యం, రోటీ రెండూ ఆరోగ్యకరమైనవే. కానీ గోధుమ రొట్టెలో అధిక ఫైబర్, ప్రొటీన్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల బరువు తగ్గేందుకు కొంత వెసులుబాటు ఉంది. ఒక్కోసారి తెలియకుండా వైట్ రైస్ ఎక్కువగా తినడం వల్ల కొంచెం బరువు పెరుగుతారు.

రాష్ట్రంలో కీలక హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. కాగా అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ను సైతం ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16న మంత్రివర్గం సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధిక వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు సమాచారం. రేపు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం జరగనుంది. పశ్చిమ బెంగాల్ CM మమత ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి, ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకానున్నారు.
Sorry, no posts matched your criteria.