News July 14, 2024

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

image

TG: గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ MLA హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘గతంలో ఇదే డిమాండ్ భట్టి విక్రమార్క చేశారు. మీ ప్రకటనకు కట్టుబడి 1:100 చొప్పున ఎంపిక చేయాలి. గ్రూప్ 2,3 పోస్టుల సంఖ్య పెంచాలి. మెగా DSC, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగులకు రూ.4వేలు భృతి ఇవ్వాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

News July 14, 2024

Xలో 100M ఫాలోవర్స్.. మోదీ రికార్డు

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ల మార్కును చేరుకుంది. ఇండియా నుంచి ఈ ఫీట్‌ నమోదు చేసిన తొలి రాజకీయ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఓవరాల్‌గా అత్యధిక ఫాలోవర్ల జాబితాలో ఏడో స్థానానికి చేరారు. తొలి ఆరు స్థానాల్లో ఎలాన్ మస్క్(188.7M), ఒబామా(131.7M), రొనాల్డో(112M), జస్టిన్ బీబర్(110.5M), రిహన్నా(108M), కాటీ పెర్రీ(106.3M) ఉన్నారు.

News July 14, 2024

అనుమతి లేకుండా అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు అరెస్ట్

image

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లికి ఆహ్వానం లేకుండా వెళ్లిన ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ PSలో కేసులు నమోదు చేశారు. వారిలో ఒకరు అల్లూరి వెంకటేశ్ నరసయ్య(26) కాగా, మరో వ్యక్తి షేక్ మహ్మద్ షఫీ(28)గా గుర్తించారు. వీరిద్దరూ ఏపీ నుంచి వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితులకు నోటీసులిచ్చి ఆ తర్వాత వదిలిపెట్టారు.

News July 14, 2024

నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ

image

నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలిని నియమించినట్లు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు. ఓలితోపాటు కొత్త మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది. ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల <<13616662>>కుప్పకూలింది<<>>. దీంతో 77 సీట్లున్న కేపీ శర్మ(CPN-UML), 88 సీట్లున్న బహదూర్(NC) కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేశారు. తొలి 18 నెలలు ఓలి, ఆ తర్వాత బహదూర్‌గా ప్రధానిగా కొనసాగుతారు.

News July 14, 2024

అమర జవాన్ భార్యపై చెత్త కామెంట్స్ చేసింది పాకిస్థానీ: రేఖా శర్మ

image

అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతిపై అసభ్యకర కామెంట్స్ చేసింది పాకిస్థానీ అని తెలుస్తోందని NCW ఛైర్‌పర్సన్ రేఖాశర్మ వెల్లడించారు. ‘అదొక దిగజారుడు కామెంట్. సోషల్ మీడియాలో దాన్ని చూడగానే సుమోటోగా తీసుకున్నాం. పోలీసులు FIR <<13622271>>నమోదు<<>> చేశారు’ అని తెలిపారు. గత ఏడాది సియాచిన్‌లో వీరమరణం పొందిన అన్షుమాన్‌కు కేంద్రం కీర్తి చక్ర అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.

News July 14, 2024

శంకర్ మ్యాజిక్ ఏమైంది.. ఆయన లేకపోవడమే కారణమా!

image

వైవిధ్యభరితమైన కథ, కథనం, కళ్లుచెదిరే సెట్లు ఇవన్నీ డైరెక్టర్ శంకర్ మూవీల్లోని ప్రత్యేకతలు. 90వ దశకంలో వరుస హిట్‌లతో సంచలనం సృష్టించారు. కానీ ఇప్పుడా మ్యాజిక్ పని చేయట్లేదు. దీనిక్కారణం శంకర్ ఆస్థాన రైటర్ సుజాత రంగరాజన్ లేకపోవడమే అంటున్నాయి సినీ వర్గాలు. రోబో తర్వాత సుజాత మరణించారు. ఆ తర్వాత ఆయన తీసిన స్నేహితుడు, ఐ, రోబో2, భారతీయుడు2 నిరాశపర్చాయి. మరి గేమ్‌ఛేంజర్‌తోనైనా శంకర్ హిట్ కొడతారేమో చూడాలి.

News July 14, 2024

BREAKING: భారత్ స్కోరు ఎంతంటే?

image

జింబాబ్వేతో జరుగుతున్న 5వ T20లో భారత జట్టు ఒక మాదిరి స్కోరు చేసింది. 20 ఓవర్లలో 167/6 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సంజూ శాంసన్ 58 రన్స్‌తో రాణించడంతో పాటు దూబే(26), రియాన్ పరాగ్(22) ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోరు సాధించింది. జింబాబ్వే జట్టులో బ్లెస్సింగ్ 2 వికెట్లు, సికందర్, రిచర్డ్, బ్రాండన్ తలో వికెట్ తీశారు.

News July 14, 2024

రోహిత్‌ను కెప్టెన్ చేసినప్పుడు విమర్శించారు: గంగూలీ

image

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తే అప్పట్లో అందరూ తనను విమర్శించారని BCCI మాజీ ప్రెసిడెంట్ గంగూలీ గుర్తు చేసుకున్నారు. ‘T20- 2021WC తర్వాత కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకోవడంతో రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే. అప్పుడు నన్ను విమర్శించారు. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో భారత్ WC నెగ్గింది. అయితే రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారనుకుంటా’ అని సరదాగా వ్యాఖ్యానించారు.

News July 14, 2024

ప్రజలందరికీ ఇన్సూరెన్స్.. బీమా చట్టంలో మార్పులు?

image

దేశంలోని అందరికీ 2047కల్లా బీమా అందించాలనే లక్ష్యంతో బీమా చట్టంలో కేంద్రం సవరణలు చేయనుందని సమాచారం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టొచ్చట. ఇందులో బీమా కంపెనీల ఆంక్షల్లో సడలింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీమా రంగంలో కొత్త కంపెనీలొచ్చి పాలసీ ధరలు అందుబాటులోకొస్తాయని, మారుమూల ప్రాంతాలకు బీమా ఉత్పత్తులు వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలసీదారుల ప్రయోజనాలూ పెరుగుతాయంటున్నారు.

News July 14, 2024

BIG ALERT.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, NLG, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, SRD, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.