India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: పల్నాడు(D) వినుకొండలో ఘోరం జరిగింది. ముళ్లమూరు బస్టాండ్ సెంటర్‌లో బుధవారం రాత్రి రషీద్ అనే యువకుడిపై జిలానీ అనే వ్యక్తి అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. దాడిలో రషీద్ చేయి తెగిపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయారు. కాగా హత్య చేసిన జిలానీ TDP వ్యక్తి అని YCP ఆరోపిస్తోంది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అల్లు అర్జున్-సుకుమార్ మధ్య గొడవ జరిగిందంటూ కోలీవుడ్‌కు చెందిన సోషల్ మీడియా పేజీల్లో <<13648051>>వార్తలు<<>> వైరల్ అయ్యాయి. దీనిపై బన్నీ టీమ్ స్పష్టత ఇచ్చింది. ‘సుకుమార్ USకు వెళ్లారు. బన్నీ యూరప్ వెళ్లారు. అక్కడ వారికున్న ఇతర పనుల వల్లే పుష్ప-2 షూటింగ్ నిలిచింది. బన్నీ-సుకుమార్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరితో మరొకరికి సమస్యలు లేవు. డిసెంబర్ 6న సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవుతుంది’ అని క్లారిటీ ఇచ్చింది.

AP: అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించేలా శ్రీకాకుళంలోని డా.BR.అంబేడ్కర్ వర్సిటీ మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు రీలాంచ్ రాకెట్లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే లాంచింగ్‌లో సక్సెస్ అయ్యామని, తర్వాత 100M పైకి పంపిస్తామన్నారు. ఇంధనంగా అమ్మోనియం పెర్క్లోరేట్ కాంపోజిట్ ప్రొపెల్లెంట్, రాకెట్ నమూనాకు 3D ప్రింటింగ్ టెక్నాలజీ వాడారట. దీంతో వాతావరణ పర్యవేక్షణ చేస్తారట. వారు ఆర్థిక ప్రోత్సాహం కోరుతున్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మరో వారం రోజుల్లో ముగియనుంది. డిగ్రీ పూర్తైన వారు జులై 24 వరకు అప్లై చేయవచ్చు. పోస్టులను బట్టి 18-30, 20-30, 18-27 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఫీజు రూ.100. మహిళలు, SC, ST, PWd వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. టైర్-1 పరీక్షలు సెప్టెంబర్/అక్టోబర్, టైర్-2 డిసెంబర్‌లో జరుగుతాయి.

మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన <<13649598>>ఎన్‌కౌంటర్‌లో<<>> తిపాగడ్ దళం ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 6 గంటల పాటు కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. అందులో ఇద్దరు తెలుగువారు ఉన్నట్లు సమాచారం. ఇక కాల్పుల్లో గాయపడ్డ జవాన్‌ను చికిత్స కోసం నాగ్‌పుర్‌కు తరలించారు.

AP: శాంతిభద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియాకు సీఎం వివరాలు వెల్లడిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన ఐదేళ్లలో నమోదైన అక్రమ కేసులు, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడి కత్తి, వివేకా హత్య కేసులు, తదితర అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.

మహారాష్ట్రకు చెందిన ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె తండ్రి దిలీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దిలీప్ ఖేడ్కర్ <<13605832>>ఆస్తులపై<<>> విచారణకు పుణేలోని ACB సిద్ధమైంది. మరోవైపు పూజ పేరెంట్స్ ఓ రైతును పిస్తల్‌తో బెదిరించిన ఘటనలో ఇప్పటికే ఇంకో కేసు నమోదైంది.

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీని థామస్ అనే కాంట్రాక్టర్‌కు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని TTD స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. శ్రీవారి లడ్డూ తయారీలో ప్రస్తుతం 980 మంది హిందువులు పాల్గొంటున్నారని తెలిపింది. లడ్డూను కొన్ని శతాబ్దాలుగా వైష్ణవ బ్రాహ్మణులే తయారు చేస్తున్నారని స్పష్టం చేసింది.

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన అమల తన 3ఏళ్ల కుమారుడు ఆదిత్యకు కాలేయ దానం చేశారు. చిన్నారి పుట్టుక నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆదిత్యకు కాలేయ మార్పిడి చేశారు. సర్జరీ అనంతరం ఆ తల్లి తన కుమారుడికి భోజనం తినిపించి మురిసిపోయారు. తద్వారా ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చారు. మీరేమంటారు?

స్థానిక కోటా బిల్లు ఇంకా తయారీ దశలోనే ఉన్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై తదుపరి కేబినెట్ భేటీలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని X ద్వారా వెల్లడించింది. కాగా ప్రైవేట్ కంపెనీల్లో నాన్ మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 70%, మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 50% పోస్టులను కన్నడిగులకే ఇవ్వాలనే బిల్లును కేబినెట్ ఇటీవల ఆమోదించింది. దీనిపై పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Sorry, no posts matched your criteria.