India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పుణేకు చెందిన ఇంద్రా రాజ్వర్(29) అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ చేశారు. తన బాయ్‌ఫ్రెండ్ ముంబై వెళ్లేందుకు విమానాశ్రయం వచ్చాడని, అతడి వద్ద బాంబు ఉందని ఆమె అధికారులకు తప్పుడు సమాచారమిచ్చారు. జూన్ 26న ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెపై FIR నమోదు చేశారు.

జింబాబ్వేపై రెండో టీ20లో భారత్ విజయం సాధించడంతో కొందరు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్ ఓడటంపై థరూర్ స్పందిస్తూ ‘సీనియర్లను పంపాల్సి వస్తే సిరీస్ పోస్ట్‌పోన్ అవుతుందని ఇండియాAను జింబాబ్వేకు పంపింది. ఈ ఓటమితో BCCI అహంకారం తగ్గింది’ అని అన్నారు. కాగా తాజాగా అదే జట్టు గెలవడంతో థరూర్ విమర్శలకు కేంద్ర బిందువయ్యారు.

ఏపీకి చెందిన ప్రముఖ యూట్యూబర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రీకూతుళ్ల బంధంపై అతడితోపాటు మరికొందరు యూట్యూబర్లు అసభ్యకర <<13581564>>వ్యాఖ్యలు<<>> చేసిన వీడియో వైరలైంది. హీరో సాయిధరమ్ తేజ్ దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన CM, డిప్యూటీ CM భట్టి ఆదేశాలతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా కొందరు వ్యక్తులు ఓ క్యానులో ఏదో విషపదార్థాన్ని తీసుకొచ్చి చల్లారని భోలే బాబా న్యాయవాది ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత వారు తప్పించుకునేందుకు వాహనాలను సిద్ధం చేసుకున్నారన్నారు. భోలే బాబాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలా చేశారని ఆయన అంటున్నారు. అటు భోలే బాబా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

రెండో టీ20లో సౌతాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 రన్స్ చేసింది. ఓపెనర్ బ్రిట్స్(52) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా అన్నెకె(40), లారా(22), కాప్(20) రాణించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 3 T20ల సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ భారత్ గెలిచి తీరాలి. తొలి మ్యాచ్ SA గెలిచింది.

BCCI కాంట్రాక్టు కోల్పోవడంపై భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తొలిసారి స్పందించారు. ‘నేను పరుగులు చేస్తున్నా బెంచ్‌లో కూర్చోబెట్టారు. నేనెంతో అలసిపోయాను. అందుకే కాస్త విరామం తీసుకోవాలనుకున్నా. అయితే నా నిర్ణయాన్ని నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ మినహా ఎవరూ అర్థం చేసుకోలేదు’ అని కిషన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా తాము ఆదేశించినా అతడు దేశవాళీ క్రికెట్ ఆడలేదన్న కారణంతో BCCI ఇషాన్‌పై వేటు వేసింది.

TMC MP మొయిత్రాపై కొత్త క్రిమినల్ చట్టం కింద కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మపై అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే కారణంతో BNS సెక్షన్79 కింద కేసు నమోదైంది. ఇటీవల హాథ్రస్‌కు వెళ్లినప్పుడు తనకు ఓ వ్యక్తి గొడుగు పట్టగా రేఖాశర్మ ఖాళీ చేతులతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోపై మొయిత్రా స్పందిస్తూ ‘ఆమె తన ఓనర్ పైజామాను పట్టుకోవడంలో చాలా బిజీగా ఉంది’ అని అన్నారు.

TG: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అర్ధాంతరంగా ఆగిపోయిన 6 సాగునీటి ప్రాజెక్టులపై CM రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వాటిని త్వరగా వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నీలంవాగు, పింప్రి, పాలెంవాగు, మత్తడివాగు, SRSP స్టేజ్-2, సదర్మాట్ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తిచేయాలని CM ఆదేశించారు.

2019-2024లో ఏపీ ఎంపీల్లో రఘురామ కృష్ణరాజు ఉత్తమ పనితీరు కనబరిచారని ‘పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్’ ఏజెన్సీ తెలిపింది. పార్లమెంటులో హాజరు శాతం, లేవనెత్తిన ప్రశ్నల ఆధారంగా ర్యాంకులను వెల్లడించింది. 100 పర్సంటైల్‌తో రఘురామ టాప్ ర్యాంకు సాధించారని పేర్కొంది. ఈ లిస్టులో గల్లా జయదేవ్, వంగా గీత, రామ్మోహన్ తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారని తెలిపింది. కాగా 2024 ఎన్నికల్లో RRR ఉండి MLAగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

AP: భారీ వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కొండల నుంచి వరద వస్తుండటంతో రాజమండ్రి బ్రిడ్జి వద్ద గోదావరి ఎరుపెక్కింది. రెండు, మూడు రోజుల క్రితం నీలిరంగులో ఉన్న నది ఎర్రగా మారడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.