India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమిళనాడులో కల్తీసారా ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలైంది. వారేమీ స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక కార్యకర్తలు కాదని గౌస్ తన పిల్‌లో పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన వారి కుటుంబాలకే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. కల్తీసారా తాగి మరణించిన ఘటనలో ఇవ్వడం సరికాదని తెలిపారు. దీనిపై కోర్టు విచారణను 2వారాలకు వాయిదా వేసింది.

కెనడాలోని ఓ చర్చి నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో చిన్నారులపై ప్రీస్ట్‌లు, ఇతర చర్చి అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 1940 నుంచి కొనసాగుతున్న ఈ దురాగతం 2020లో వెలుగులోకి వచ్చింది. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కుంభకోణంగా నిలిచింది. ఈ కేసును విచారించిన కోర్టు 292 మంది బాధితులకు $76 మిలియన్లు పరిహారం చెల్లించాలని ఇటీవల ఆదేశించింది. ఒక్కొక్కరు $40వేలు-$6లక్షల మధ్య అందుకోనున్నారు.

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 15వ తేదీ వరకు వారాహి నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. అలాగే దుర్గమ్మకు ఆషాడ సారె ఉత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. నెల రోజులపాటు అమ్మవారికి భక్తులు సారె సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జులై 19 నుంచి 21 వరకు శాకాంబరీ ఉత్సవాలు జరగనున్నాయి.

మనకు ఫోన్ చేసిన వారి పేరును తెలుసుకునే ఫీచర్‌ను ట్రాయ్ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫోన్లో అవతలి వారి నంబర్ సేవ్ చేసి లేకున్నా, గుర్తు తెలియని వారు ఫోన్ చేసినా ఇకపై మన మొబైల్ స్క్రీన్‌పై వారి పేర్లు కనిపిస్తాయి. ఈ నెల 15 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. సిమ్ కార్డు కొన్నప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కాలర్ల పేర్లు కనిపిస్తాయి. ఈ ఫీచర్ కోసం ప్రస్తుతం చాలామంది ట్రూ కాలర్ యాప్ వాడుతున్నారు.

TG: వినియోగదారులు సులభంగా ఫిర్యాదు చేసేందుకు కేంద్రం వాట్సాప్ చాట్‌బాట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. MRP కంటే అధిక ధరకు కంటే విక్రయించినా? నాసిరకం ఉత్పత్తులమ్మినా? ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. వాట్సాప్‌లో 8800001915 నంబరులో హాయ్ అని మెసేజ్ పెట్టాలి. అక్కడ చూపించే ఆప్షన్ల ఆధారంగా వివరాలిస్తే ఫిర్యాదు నమోదవుతుంది. ఆపై కేసు పరిష్కారమయ్యే వరకు సూచనలూ ఇస్తారు. 1800114000/1915 నంబరుకూ ఫిర్యాదు చేయొచ్చు.

AP: నంద్యాల(D) కోర్నపల్లిలో ప్రభుత్వ టీచర్‌ను TDP నేత విజయ్ భాస్కర్ <<13567851>>దూషించిన<<>> ఘటనను ST కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనికి సంబంధించిన వివరాలను అందించాలని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని నంద్యాల SPని ఆదేశించింది. ఆలిండియా గిరిజన ఉద్యోగ సంఘం కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్కూల్‌లో బియ్యం బస్తాలు దించొద్దన్నందుకు TDP నేత బూతులతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని మూవీ యూనిట్ వెల్లడించింది. కావ్యా థాపర్, సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ-రామ్ కాంబోలో 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.

శాకాహార భోజనం సగటు ధర జూన్‌లో 10% పెరిగినట్లు క్రిసిల్ తన నివేదికలో వెల్లడించింది. వెజ్ థాలీ ప్లేట్ సగటు ధర 2023 జూన్‌లో రూ.26.70 కాగా.. ఈ ఏడాది జూన్‌లో రూ.29.40కు పెరిగింది. 2024 మేలో ఇది రూ.27.80గా ఉంది. ఉల్లి, టమాటా, బంగాళదుంపలు, బియ్యం, పప్పుల ధరలు పెరగడమే కారణంగా పేర్కొంది. ఇటు చికెన్ రేటు 14% తగ్గడంతో నాన్ వెజ్ థాలీ ఈ జూన్‌లో రూ.58కి దిగివచ్చింది. గతేడాది జూన్‌లో ఇది రూ.60.50గా ఉంది.

AP: అనంతపురంలో ఎయిర్‌పోర్టుతో పాటు విమానయాన సిబ్బంది శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ను అనంతపురం, హిందూపురం MPలు కోరారు. ఉద్యాన పంటలైన పూలు, పండ్లు, కూరగాయల ఎగుమతితో పాటు ప్రయాణికుల అవసరాలు తీర్చేలా ఎయిర్‌పోర్టు ఉండాలని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వినతిపత్రం సమర్పించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం కరవు పీడిత ప్రాంతానికి వరంగా మారడంతోపాటు, యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

AP: TDP నేతల విధ్వంసాలు, అరాచకాలతో ఇబ్బంది పడుతున్న కేడర్‌కు అండగా ఉంటామని YCP అధినేత జగన్ భరోసా ఇచ్చారు. కొందరు ఊళ్లు వదిలి పక్క రాష్ట్రాల్లో ఉంటున్నట్లు పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జగన్ చెప్పారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ MLA కాసు మహేశ్ రెడ్డి సహా పలువురు జగన్‌ను కలిశారు.
Sorry, no posts matched your criteria.