India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎయిర్ ఇండియా ‘ఫ్రీడమ్ సేల్’ ఆఫర్ తీసుకొచ్చింది. దేశీయ ప్రయాణాలకు సంబంధించి టికెట్ ధరలు రూ.1,279, విదేశాలకు సంబంధించి రూ.4,279 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. చెక్ ఇన్ బ్యాగేజీకి రూ.200 అదనంగా చెల్లించాలని వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 15వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయంది. ఈ నెల 19 నుంచి 2026 మార్చి 31 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
టాలీవుడ్‌లో సినీ కార్మికుల వేతనాల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. తమ డిమాండ్లకు నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఇవాళ్టి నుంచి షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇవాళ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫెడరేషన్ నాయకులు సమావేశం కానున్నారు. మరోవైపు ఇదే విషయమై నిర్మాతలు ఏపీ మంత్రి దుర్గేశ్‌ని కలుస్తారని తెలుస్తోంది. నాయకులైనా ఈ బంద్‌కు శుభం పలుకుతారేమో చూడాలి.
9వ తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. ఇందులో భాగంగా లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పరీక్షలను స్టూడెంట్స్ బుక్స్ చూస్తూ రాయొచ్చు. అయితే స్కూళ్లు దీన్ని అమలుచేయడం తప్పనిసరి కాదని బోర్డు తెలిపింది. మరోవైపు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది.
AP: ‘ఆడుదాం ఆంధ్ర’ నిర్వహణలో అవినీతి జరిగిందన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు విచారణ ముగించారు. ఇవాళ 30 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. కిట్ల కొనుగోలు, పోటీల నిర్వహణలో రూ.40కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. విచారణలో నిధుల దుర్వినియోగం జరిగిందని తేల్చినట్లు సమాచారం. మాజీమంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది.
USకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను 2 నెలల్లో లాంచ్ చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. 6,500KGs బరువుండే బ్లాక్-2 బ్లూబర్డ్ శాటిలైట్ వచ్చే నెల INDకు వస్తుందన్నారు. ఇస్రోకు చెందిన హెవీయెస్ట్ రాకెట్ LVM-3-M5 ద్వారా దీన్ని లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. నాసాతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన అత్యంత ఖరీదైన <<17251299>>NISAR<<>> శాటిలైట్‌ను ఇస్రో జులై 30న విజయవంతంగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీనివాసుడిని 82,628 మంది భక్తులు దర్శించుకోగా 30,505 మంది తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీకి రూ. 3.73 కోట్ల ఆదాయం సమకూరింది.
AP: రేపు ZPTC <<17363356>>ఉపఎన్నికలు<<>> జరిగే పులివెందుల, ఒంటిమిట్టలో నిన్న రాత్రి నుంచి ప్రలోభాల పర్వం ఊపందుకున్నట్లు సమాచారం. 2 కీలక పార్టీల నాయకులు ఓటుకు రూ.5వేలు చొప్పున పంపిణీ చేసినట్లు తెలిసింది. గెలుపుపై అనుమానం ఉన్న ప్రాంతాల్లో 2వ విడత పంపిణీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. YCP చీఫ్ జగన్ సొంత జిల్లా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కూడా ఉండటంతో ఈ ఎన్నికలను TDP, YCP ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
AP: రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. 26 జిల్లాలు 32కి పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. కృష్ణా(D) నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను NTR(D)లోకి మార్చాలని చూస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశంలోకి వెళ్లే ఛాన్సుంది. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు రానున్నట్లు సమాచారం.
నేడు దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో PM ఫసల్ బీమా యోజన కింద రూ.3,200 కోట్లు జమ కానున్నాయి. రాజస్థాన్‌లో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం 2016లో ప్రారంభం కాగా, రైతులు ఖరీఫ్ పంటలకు 2శాతం, రబీ పంటలకు 1.5శాతం, వాణిజ్య పంటలకు 5శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ DK పరుల్కర్(రిటైర్డ్) ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు IAF వెల్లడించింది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో ప్రత్యర్థులు ఆయన విమానంపై కాల్పులు జరిపారు. ఫ్లైట్ వదిలేసి ప్రాణాలు కాపాడుకోమని ఉన్నతాధికారులు చెప్పారు. కానీ, ధైర్యంగా విమానాన్ని తిరిగి బేస్‌కు చేర్చారు. 1971 ఇండో-పాక్ వార్ టైంలో యుద్ధ ఖైదీగా ఉన్న ఆయన.. అదే సమయంలో వారి కళ్లుగప్పి తప్పించుకుని భారత్ చేరుకున్నారు.
Sorry, no posts matched your criteria.