India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AUG19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. మహాలక్ష్మీ, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి వంటి పథకాలతో పాటు ఉత్తమ వార్తా చిత్రం(న్యూస్ క్లిప్) విభాగాల్లో ఫొటోలు తీయాలి. మొదటి ముగ్గురికి రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, తర్వాత ఐదుగురికి ప్రోత్సాహకంగా రూ.5వేలు ఇస్తుంది. ఫొటోలను adphoto.ts@gmail.coకి పంపాలి. మరిన్ని వివరాలకు 9949351523కి ఫోన్ చేయవచ్చు.

అగ్నివీర్, మైనార్టీ తదితర అంశాలను రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చి లోక్‌సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలను పిల్లల ప్రవర్తన అని చెప్పి తేలికగా తీసుకోవద్దని స్పీకర్ ఓం బిర్లాను కోరాను. హిందువులను ఎగతాళి చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి సీనియర్ నేతలున్నా అరాచక, అబద్ధాల మార్గంలో వెళ్లాలనుకోవడం ఆందోళనకరమన్నారు.

భారత వరల్డ్ కప్ హీరోలు యువరాజ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఉతప్ప, హర్భజన్ మళ్లీ మైదానంలో అఫ్రిదీ, మిస్బా, బ్రెట్‌లీ, కల్లిస్ అలనాటి ప్రత్యర్థులను ఎదుర్కోనున్నారు. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ 2024 లీగ్ నేటి నుంచి 13 వరకు జరగనుంది. ఇండియా ఈ రోజు ENGతో, 5న WI, 6న PAKతో, 8న AUSతో 10 SAతో తలపడనుంది. సాయంత్రం 5గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్ 1లో ప్రసారమవుతాయి.

AP: నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్‌లో అడవి దున్న కెమెరా ట్రాప్‌లో కనిపించింది. 1870 తర్వాత అడవి దున్న ఇక్కడ కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది సైతం ఆశ్చర్యపోతున్నారు. వెలుగోడు రేంజ్‌లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవిదున్నను గుర్తించామని.. అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు.

* చైల్డ్ రేప్ – మరణశిక్ష
* గ్యాంగ్ రేప్ – 20ఏళ్ల జైలు శిక్ష
* జీరో FIR(ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు)
* FIRపై 90రోజుల్లో అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది.
* ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిస్తే ఏడాది జైలు
* విచారణ ముగిసిన 45రోజుల్లో తీర్పు
* మొదటి విచారణ తర్వాత 60 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు
>> SHARE

టీషర్ట్, టోన్డ్ జీన్స్ కాలేజీకి రావొద్దని ముంబైలోని చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులకు హుకుం జారీ చేసింది. విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో వస్తే అనుమతించమని స్పష్టం చేసింది. గతనెలలో ఇదే సొసైటీ కళాశాల ప్రాంగణంలో హిజాబ్, బుర్ఖా, నకాబ్, టోపీలపై నిషేధం విధించింది. దానిపై పలువురు విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. నిషేధాన్ని హైకోర్టు సైతం సమర్థించింది.

AP: ఎన్నికలకు ముందు ప్రకటించిన DSCకి దరఖాస్తు చేసిన వారు మెగా DSCకి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి లోకేశ్ వెల్లడించారు. మెగా DSC, TETకు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. వయోపరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.

T20WC ఫైనల్‌లో తాను అందుకున్నది క్లీన్ క్యాచ్ అని సూర్య కుమార్ స్పష్టం చేశారు. ‘సాధారణంగా రోహిత్ భాయ్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేయరు. కానీ అప్పుడు చేశారు. మిల్లర్ క్యాచ్ రోహిత్ తీసుకుంటారేమోనని ఒక్క క్షణం ఆయన వైపు చూశా. ఆయనా నా వైపు చూశారు. నేను పరిగెత్తుకెళ్లి క్యాచ్ అందుకున్నా. రోహిత్ నాకు దగ్గర్లో ఉంటే బంతిని అతడికి విసిరేద్దామనుకున్నా. కానీ సమీపంలో లేక నేనే మళ్లీ అందుకున్నా’ అని SKY చెప్పారు.

AP: మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో మంగళవారం అర్ధరాత్రి పలువురిని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలను రెండు, మూడు రోజులుగా సేకరించారు. CC కెమెరాల ద్వారా దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. ఇందులో గుంటూరుకి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసుల గాలింపు చర్యలతో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

TG: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రేపు లేదా ఎల్లుండి కొత్త మంత్రుల ప్రకటనతో పాటు శాఖల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది.
Sorry, no posts matched your criteria.