India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పులివెందుల అంటే ఓ సక్సెస్ స్టోరీ అని CM జగన్ అన్నారు. ‘మంచి చేయడం, మంచి మనసు, మాట తప్పకపోవడం, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. నా పులివెందుల.. నా సొంత గడ్డ.. నా ప్రాణానికి ప్రాణం. నాపై ఆరోపణలు చేస్తున్న నా బంధువులకు ఒక్కటి చెప్పదలుచుకున్నా. పేదలకు సాయం చేయమని నాకు దేవుడు సీఎం పదవి ఇచ్చాడు. డబ్బు సంపాదన కోసం కాదు. నా బంధువుల్ని కోటీశ్వరుల్ని చేయమని కాదు’ అని పులివెందుల బహిరంగ సభలో చెప్పారు.

అమెరికా, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నా గాజా విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. హమాస్ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. దక్షిణ గాజాలో కీలకమైన రఫా సిటీలో గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైంది. పాలస్తీనా పౌరుల్ని ఆ సిటీ నుంచి పంపించేందుకు మిలిటరీ చర్యలు చేపడుతోంది. ఏ క్షణమైనా అక్కడ మిలిటరీ ఆపరేషన్ జరిగే అవకాశముంది. కాగా ఈ సిటీలో 10లక్షల మంది దాకా ఆశ్రయం పొందుతున్నారు.

IPLలో భారత బ్యాటర్లు దుమ్మురేపుతున్నా బౌలర్లు తేలిపోతున్నారు. బుమ్రా తప్ప మిగతా పేసర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. సిరాజ్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ వరుసగా విఫలం అవుతున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు పేసర్ల ఫామ్ ఆందోళన కల్గిస్తోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు షమీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. వరల్డ్ కప్ వరకు ఫిట్ అవ్వడం కష్టమే.

ఏపీసీసీ చీఫ్ షర్మిలపై వైఎస్ జగన్ పులివెందుల సభలో పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మల్ని ఎవరు పంపించారో మీకు కనిపిస్తోంది. చిన్నాన్నను చంపింది నేనే అని తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో ప్రజలు చూస్తున్నారు. చిన్నాన్నను అన్యాయంగా ఓడించిన వారితోనే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారా?’ అంటూ జగన్ ప్రశ్నించారు.

హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ విభాగం నోటీసులిచ్చింది. ఫెయిర్‌ప్లే యాప్‌లో IPL 2023 మ్యాచులను చట్టవిరుద్ధంగా ప్రసారం చేసిన కేసులో ఈనెల 29న విచారణకు రావాలని ఆదేశించింది. నటుడు సంజయ్ దత్‌కి కూడా ఇదే కేసులో సమన్లు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. వీరిద్దరూ ఆ యాప్ కోసం ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. ఫెయిర్‌ప్లే యాప్‌లో మ్యాచుల ప్రసారం వల్ల వయాకామ్ కోట్ల రూపాయలు నష్టపోయినట్లు సమాచారం.

AP: కూటమి నేతల కుట్రలో భాగంగా YSR వారసులమంటూ కొందరు ప్రజల్లోకి వస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ‘ఆ మహానేతకు వారసులెవరో ప్రజలే చెప్పాలి. YSR చనిపోయాక ఆయనపై కేసులు వేసింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? YSR పేరును కనబడకుండా చేయాలనుకుని కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేసింది. అలాంటి మన శత్రువులతో కలిసిన వీళ్లా YSR వారసులు. మన ఓట్లను విడగొట్టే కుట్ర చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. అయితే దీంట్లో ఇంపాక్ట్ ప్లేయర్ల పాత్ర ఉందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు. బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ల రూపంలో బ్యాటర్లకు అదనపు శక్తి లభిస్తోందని అన్నారు. వాళ్లున్నారనే ధైర్యంతోనే బ్యాటర్లు విరుచుకుపడుతున్నారని చెప్పారు. కాగా ఇప్పటికే పలువురు సీనియర్ ఆటగాళ్లు ఈ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన పోలీసులకు జీవిత ఖైదు పడే అవకాశం కనిపిస్తోంది. వారిపై సైబర్ టెర్రరిజం సెక్షన్ల కింద ఐటీ యాక్ట్ 66(ఎఫ్)ను ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చట్టాన్ని జోడిస్తూ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. నేర నిరూపణ జరిగితే నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఐటీ యాక్ట్-70 కింద కేసు నమోదు చేశారు. ఈ యాక్ట్ ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడుతుంది.

LSG చేతిలో CSK ఓటమికి కెప్టెన్ రుతురాజ్ వైఫల్యమే కారణమని తాను వ్యాఖ్యానించినట్లు వస్తున్న వార్తలపై అంబటి రాయుడు స్పందించారు. ‘ఆరోజు నేను కామెంటరీ చేయలేదు. నా తోటలో మామిడిపండ్లు కోస్తున్నా. ఏదైనా రాసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించండి. ఇలాంటి వాటిని వ్యాప్తి చేయకండి’ అంటూ ఫైరయ్యారు. రాయుడు వ్యాఖ్యలకు ‘క్రెడిట్ ధోనీ.. బ్లేమ్ గైక్వాడ్’ అంటూ నవజోత్ సిద్ధూ కౌంటర్ వేసినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఉక్రెయిన్‌కు తాము దీర్ఘ పరిధి క్షిపణుల్ని రహస్యంగా పంపించినట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సలివాన్ తాజాగా తెలిపారు. ఆ దేశానికి తాము అందించే 300 మిలియన్ డాలర్ల సాయంలో క్షిపణులూ భాగమని పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని పంపుతామని తేల్చిచెప్పారు. తొలుత క్షిపణుల్ని పంపాలని అనుకోనప్పటికీ, రష్యా ఉత్తర కొరియా మిస్సైల్స్‌ను వాడుతుండటంతో ఉక్రెయిన్‌కు అండగా నిలవాలనుకున్నామని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.