India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతి ఇచ్చారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. జులై 23న కేంద్ర బడ్జెట్ 2024-25ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారని ఆయన వివరించారు.

ఇండియన్ ఆర్మీ అమ్ములపొదిలోకి ఆధునిక AK-203 అసాల్ట్ రైఫిల్స్ చేరాయి. భారత్-రష్యా జాయింట్ వెంచర్ కింద ఏర్పాటైన ఇండో-రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ వీటిని రూపొందించింది. తొలి విడత కింద 35వేల రైఫిల్స్ అందుబాటులోకి వచ్చాయి. INSAS, AK-47 రైఫిళ్లను ఇవి భర్తీ చేయనున్నాయి. రష్యా సహకారంతో యూపీలోనే వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. కాగా ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది.

భోలే బాబాకు సంబంధించిన రూ.100కోట్ల ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. ఆయనకు 24 విలాసవంతమైన ఆశ్రమాలున్నాయని దర్యాప్తులో తేలింది. ప్రత్యేక ప్రైవేటు సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉండటం గమనార్హం. అయితే ఎలాంటి డొనేషన్స్ తీసుకోనని చెబుతున్న భోలే బాబా ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారనేది ఆసక్తికరంగా మారింది. యూపీలో ఈ బాబా నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించారు.

అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా యాత్రకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. యాత్రికుల భద్రత నిమిత్తం ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రెండు మార్గాల్లోనూ నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు గుహలోని మంచు శివలింగం కరిగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత వారంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో కరిగిపోతున్నట్లు సమాచారం.

హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ సింగ్‌పై ఎట్టకేలకు కేసు నమోదైంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు సత్సంగ్‌కు అనుమతి తీసుకున్న దేశ్ ప్రకాశ్ మధుకర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని హాథ్రస్ ఎస్పీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు.

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఓపెనర్ అవతారం ఎత్తారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అశ్విన్ దుండిగల్ డ్రాగన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. తిరుచ్చి గ్రాండ్ చోళాస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఓపెనర్‌గా వచ్చారు. కానీ 5 పరుగులకే ఔటై నిరాశపరిచారు. కాగా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో అశ్విన్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ఎంపికయ్యారు.

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా)కు కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (17039/17040)ను ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైలు బుధ, శుక్రవారాల్లో SEC నుంచి.. గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్ తదితర స్టేషన్లలో ఆగుతుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ.1.31 కోట్ల జరిమానా విధించింది. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కస్టమర్ల చిరునామాలకు సంబంధించిన రికార్డులు భద్రపరచడంలో PNB విఫలమైందని ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు పనితీరుపై 2022 మార్చి 30న తనిఖీలు నిర్వహించగా ఆదేశాలు పాటించని బ్యాంకులకు నోటిసులు జారీ చేసింది. అయితే వాటి వివరణతో సంతృప్తి చెందకపోవడంతో ఫైన్ వేసింది.

TG: భద్రాద్రి కొత్తగూడెం(D) చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న 13 ఏళ్ల హరికృష్ణ(13) గుండెపోటుతో మరణించాడు. పాఠశాలలోనే ఛాతీలో నొప్పి రావడంతో సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా బాలుడికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

TG: మెదక్ జిల్లా టేక్మాల్(M) పరిధిలోని బోడగట్టుకు చెందిన సాయిలు(35) భార్య, పిల్లలతో HYDలో ఉంటూ కూలిపని చేస్తున్నారు. అడ్డా మీద దాహం వేయడంతో ఓ టీ స్టాల్‌కి వెళ్లి బాటిల్‌లో నీరు పట్టుకున్నారు. ‘దాహం వేస్తే తాగు. కానీ బాటిల్లో ఎందుకు నింపుకున్నావు’ అని టీ స్టాల్‌లోని సతీశ్ అనగా గొడవ మొదలైంది. సతీశ్ స్నేహితులు వచ్చి సాయిలును తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.