India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: CM రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత అమిత్ షాపై పాతబస్తీలో నమోదైన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసును ఉపసంహరించుకున్నారని BRS ట్వీట్ చేసింది. దీని ద్వారా కాంగ్రెస్, BJP మధ్య ఉన్న అక్రమ సంబంధం మళ్లీ బయటపడిందని పేర్కొంది. ‘మొన్న సింగరేణి బొగ్గు గనుల వేలంకు BJPకి మద్దతు తెలపడం. ఇప్పుడు కేసు కొట్టివేయడం.. ఇలా కాంగ్రెస్, BJP పరస్పర సహకారంతో ప్రజలను మోసం చేస్తున్నాయి’ అని ఆరోపించింది.

బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ HDFC సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు యూజర్లకు మెసేజ్‌లు పంపుతోంది. ఈనెల 13వ తేదీన ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సిస్టమ్ అప్‌గ్రేడ్ జరగనుంది. ఈ సమయంలో ATM & DEBIT CARDS మాత్రమే పనిచేస్తాయి. మూడున్నర గంటలు (9:30AM – 12:45PM) UPI పనిచేయదు. నెట్ & మొబైల్ బ్యాంకింగ్ సేవలు పాక్షికంగా అందుబాటులో ఉంటాయి.

తనకు నేరుగా దేవుడితో కనెక్షన్ ఉందని చెప్పే మోదీ.. అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన ‘మోదీ అయోధ్య నుంచే పోటీ చేద్దామనుకున్నారు. కానీ ఓడిపోతారని సర్వేలు చెప్పాయి. తన రాజకీయ జీవితం అయోధ్యలో ముగుస్తుందనే భయంతో మోదీ పోటీ చేయలేదు’ అని ఎద్దేవా చేశారు. కాగా ఎల్లుండి తాను మణిపుర్ వెళ్లనున్నట్లు రాహుల్ తెలిపారు.

AP: రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. నిన్న కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన జగన్.. వైసీపీకి ఓటేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పులివెందుల చరిత్రలో ఇలాంటి సంప్రదాయం లేదని, శిశుపాలుడి పాపాల మాదిరిగా బాబు పాపాలు పండుతున్నాయని జగన్ విమర్శించారు.

బాక్సాఫీస్ వద్ద ‘కల్కి’ మూవీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ‘బాక్సాఫీస్ ఆన్ ఫైర్’ అని పేర్కొంది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్లు నటించిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది.

వాట్సాప్ తన యూజర్ల కోసం మరో ఫీచర్ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దాదాపు అందరు యూజర్లకు ‘మెటా AI’ని అందుబాటులోకి తెచ్చింది. అది ప్రస్తుతం యూజర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ AI జనరేటెడ్ ఫొటోలను అందిస్తోంది. అయితే త్వరలోనే మన ఫొటోలకు రిప్లై ఇవ్వడంతో పాటు వాటిని ఎడిట్ చేయనుంది. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

TG: ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’లో దూకుడు పెంచింది. దీంతో ఆ పార్టీలోకి BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా గద్వాల MLA హస్తం కండువా కప్పుకున్నారు. ఇక BRSకు చెందిన మరో 4 ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వారెవరనేది ఆసక్తిగా మారింది. మరోవైపు వెళ్లేవారితో పార్టీకి నష్టమేమీ లేదంటున్న KCR.. వలసలు ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

AP: ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విభజన సమస్యల పరిష్కారానికి జరగనున్న సమావేశంలో ఏపీ పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న <<13573822>>వార్తలు<<>> రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సీఎంల భేటీని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుంది’ అని ట్వీట్ చేశారు.

TG: హీరో రాజ్‌తరుణ్ తనను మోసం చేశారని లావణ్య చేసిన ఫిర్యాదుపై నార్సింగి పోలీసులు స్పందించారు. ‘4 పేజీలతో హీరో రాజ్‌తరుణ్ సహా మరికొందరిపై ఆమె ఫిర్యాదు చేశారు. సరైన ఫార్మాట్‌లో కంప్లైంట్ లేదు. తేదీలు, సమయం, ప్లేస్ వివరాలు ఇవ్వలేదు. ఫోన్ కాల్స్, నోటీసులకు ఆమె స్పందించడం లేదు’ అని వెల్లడించారు. అటు సాయంత్రం వరకు వేచి చూసి దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పోలీసులు పరిగణించే ఛాన్సుంది.

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ నేతలకు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు మీడియాతో పేర్కొన్నారు. దీనిపై ఆయన స్పందించాలని కోరారు. ఆరు గ్యారంటీల ఊసెత్తకుండా ఇలాగే పాలన కొనసాగితే ప్రజలు ఉపేక్షించరని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.