India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఆహార దుకాణాల యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో ఓటేసేవారికి జిలేబీ, ఐస్‌క్రీమ్, అటుకుల ఉప్మా ఫ్రీగా అందిస్తామని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్‌తో సమావేశం అనంతరం దుకాణదారుల సంఘం మీడియాకు తెలిపింది. ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు పెద్దఎత్తున పాల్గొనాలని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

AP: కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నిడదవోలు(తూర్పుగోదావరి) 2008లో కొత్త సెగ్మెంట్‌గా ఏర్పడింది. 2009, 14లో బూరుగుపల్లి శేషారావు(TDP), 2019లో శ్రీనివాసనాయుడు(YCP) గెలిచారు. ఈసారి కూడా YCP నుంచి ఆయనే బరిలో దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా జనసేన నేత కందుల దుర్గేశ్ పోటీ చేస్తున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2019లో YCPకి 81వేల ఓట్లు రాగా, TDP, JSPకి కలిపి 82,386 ఓట్లు వచ్చాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. కవితకు బెయిల్ ఇవ్వాలని నిన్న ఆమె తరఫు న్యాయవాది రాణా వాదనలు వినిపించగా.. కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పుష్పలత (36) అనే మహిళకు 4.5 కిలోల మగ బిడ్డ జన్మించాడు. ఇది ఆమెకు మూడవ కాన్పు కాగా ఆపరేషన్ లేకుండా జన్మించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా పుట్టిన బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 3 కిలోల మధ్య ఉంటుంది.

AP: పాలిసెట్-2024కు సన్నాహకంగా నేడు పాలిసెట్ గ్రాండ్ టెస్టును నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ‘పాలిసెట్ కోసం ఈ నెల 1 నుంచి ఉచిత శిక్షణ అందించాం. దానికి ముగింపుగా ఈ టెస్టును నిర్వహిస్తాం. ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 7273మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 12513మంది విద్యార్థులు శిక్షణ పొందారు. శిక్షణ కేంద్రాల్లోనే ఉచితంగా టెస్టును నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.

AP: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లోని 46 మండలాల్లో ఇవాళ తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు 143 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఇటు రైల్వే శాఖను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రయాణికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.. తాగునీరు, వైద్య బృందాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

TG: లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. మే 15లోగా బ్యాలెట్ బాక్సులకు సీళ్లు, అడ్రస్ ట్యాగ్‌లను ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియగా.. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

జేఈఈ మెయిన్-2 ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న ఫలితాలు వెల్లడికావాల్సి ఉండగా.. ఇవాళే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 22న జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేయగా.. ఫలితాలు ప్రకటించేందుకు NTA కసరత్తు చేస్తోంది. కాగా దేశ వ్యాప్తంగా 12.57 లక్షల మంది పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆర్బీఐ నుంచి రూ.3వేల కోట్ల రుణం తీసుకుంది. ఆర్బీఐ నిర్వహించిన వేలంలో ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ అప్పు తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలలకు గాను రూ.47 వేల కోట్ల అప్పులకు కేంద్రం అనుమతిచ్చింది. కాగా ఈ నెల 2న ప్రభుత్వం రూ.4వేల కోట్ల రుణం తీసుకుంది.

TG: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇవాళ్టి నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ఇవాళ మధ్యాహ్నం కోల్‌కతా నుంచి HYD రానున్నారు. 27వ తేదీ వరకు విచారణ చేపట్టనున్న ఆయన.. ఒకరోజు మేడిగడ్డ బ్యారేజీని కూడా సందర్శించనున్నారు. విచారణ కోసం కావాల్సిన సాంకేతిక, న్యాయపరమైన సిబ్బందిని ఆయన నియమించుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.