News April 25, 2024

కూటమి మేనిఫెస్టో ఆవిష్కరించనున్న ప్రధాని

image

AP: టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 3, 4 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అనకాపల్లి లేదా రాజమండ్రి సభల్లో ఈ కార్యక్రమం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి.

News April 25, 2024

నేడు పులివెందులలో సీఎం జగన్ నామినేషన్

image

AP: నిన్నటితో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించిన సీఎం జగన్.. ఇవాళ పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందుల వెళ్తారు. అక్కడ సీఎస్ఐ చర్చి గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు.

News April 25, 2024

పబ్‌ల న్యూసెన్స్.. ఓటింగ్ బహిష్కరించిన ప్రజలు

image

రోడ్లు, తాగు నీటి సదుపాయం కోసం ఓటింగ్ బహిష్కరించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా పుణేలోని కళ్యాణీ నగర్‌లో రోజూ అర్ధరాత్రి వరకు పబ్‌లు, సౌండ్‌లతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయామని వారు చెబుతున్నారు. నివాస ప్రాంతాల్లో పబ్‌లను అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇక్కడ ఎల్లుండి పోలింగ్ జరగనుంది.

News April 25, 2024

ఎల్లలు లేని మానవత్వం.. పాక్ యువతికి భారతీయుడి గుండె

image

మానవత్వానికి సరిహద్దులు లేవని నిరూపితమైంది. గుండె వ్యాధితో బాధపడుతోన్న పాకిస్థాన్‌కు చెందిన ఆయేషా రశన్(19) అనే యువతికి చెన్నైలోని ఆస్పత్రిలో ఓ స్వచ్ఛంద సంస్థ చికిత్స అందించింది. ఇటీవల చనిపోయిన ఢిల్లీకి చెందిన వ్యక్తి గుండెను ఆమెకు విజయవంతంగా అమర్చింది. రూ.35 లక్షలకు పైగా ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఫ్రీగా చేసింది. తమ కూతురికి జీవితాన్నిచ్చిన ట్రస్టు, వైద్యులకు ఆమె తల్లి ధన్యవాదాలు తెలిపారు.

News April 25, 2024

CMAT పరీక్ష ఎప్పుడంటే?

image

మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీమ్యాట్ పరీక్ష తేదీ ఖరారైంది. మే 15న పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. తాజాగా CMAT దరఖాస్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ వివరాలు వెల్లడిస్తామని NTA తెలిపింది.

News April 25, 2024

One Word Substitution- Person/People

image

☛ One who lives in solitude::- Recluse
☛ A person who is indifferent to the pains and pleasures of life::- Stoic
☛ A scolding nagging bad-tempered woman::- Termagant
☛ A person who shows a great or excessive fondness for one’s wife::- Uxorious
☛ One who possesses outstanding technical ability in a particular art or field::- Virtuoso

News April 25, 2024

రేవంత్ క్రేజ్.. తగ్గేదేలే!

image

TG: సీఎం రేవంత్ రెడ్డి క్రేజ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాహుల్, ప్రియాంక, ఖర్గే తర్వాత రేవంతే అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇప్పటికే ఏపీ, కేరళ, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, బిహార్ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోనూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

News April 25, 2024

506 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

కేంద్ర సాయుధ బలగాల్లో (CAPF) 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు నిర్దిష్టమైన శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నేటి నుంచి మే 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 4న రాతపరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://upsconline.nic.in/

News April 25, 2024

వేమన నీతి పద్యం- భావం

image

పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక! పరహితచారై
పరు లలిగిన తా నలగక
పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుడు వేమా!
తాత్పర్యం: తోటి స్త్రీలను తన సోదరిలుగా భావించి, ఇతరుల ధనాన్ని ఆశించకుండా, ఇతరులు అలిగి కోప్పడినా తాను అలగకుండా, ఇతరుల చేత కీర్తింపబడుతూ జీవనాన్ని సాగించేవాడు గొప్పవాడు.

News April 25, 2024

D-ఓటరు ఓటేయలేరు.. అసలు వీరెవరు?

image

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ బెంగాలీలు అస్సాంలోని బరాక్ లోయ ప్రాంతంలో స్థిరపడ్డారు. భారత పౌరులుగా నిరూపించుకునేందుకు సరైన ఆధారాలు చూపించలేని వారిని D-ఓటరు లేదా సందేహాస్పద ఓటరుగా పేర్కొంటున్నారు. వీరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నా.. ఏ ఎన్నికలోనూ ఓటు వేయలేరు. అస్సాంలో మొత్తం 96,987 మంది D-ఓటర్లు ఉన్నారు. CAA ప్రకారం పౌరసత్వ సమస్య పరిష్కారమైతే వీరికి ఇబ్బందులు తొలగిపోతాయని BJP అంటోంది.
<<-se>>#ELECTIONS2024<<>>