India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమిళ స్టార్ హీరో విజయ్‌తో సినిమా ఇప్పట్లో కష్టమేనని దర్శకుడు వెట్రిమారన్ అన్నారు. ఓ అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చాలా రోజుల క్రితం విజయ్‌కి ఓ కథ చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవచ్చని చెప్పారు. ప్రస్తుతం వెట్రిమారన్ ‘విడుతలై పార్ట్-1’ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రంలో నటిస్తున్నారు.

కర్ణాటకలో ముస్లింలు బ్యాక్‌వర్డ్ క్యాస్ట్‌లలో భాగం కావడాన్ని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వార్డ్ క్లాసెస్ (NCBC) తప్పుపట్టింది. ‘ముస్లింలు ఓబీసీ పరిధిలోకి వస్తారని కర్ణాటక ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 17 ముస్లిం వర్గాలు కేటగిరీ-1, మరో 19 ముస్లిం వర్గాలు కేటగిరీ-2A పరిధిలోకి వస్తాయి. ముస్లిం వర్గాల్లో నిరుపేదలు ఉన్నా ఆ మతం మొత్తాన్ని వెనుకబడిన వర్గంగా పరిగణించడం సరికాదు’ అని పేర్కొంది.

TG: ఇంటర్ ఫెయిల్ అయినందుకు ఇద్దరు అమ్మాయిలు తనువు చాలించారు. మెదక్ జిల్లా శేరిపల్లిలో ఇంటర్ సెకండియర్ బాలిక పంబాల రమ్య ఉత్తీర్ణత సాధించలేదు. మనస్తాపానికి గురైన ఆమె.. గ్రామ శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లాలోనూ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ కావడంతో తేజస్విని అనే విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
**ఫెయిలైతే సప్లిమెంటరీలో పాస్ కావొచ్చు. కానీ జీవితం తిరిగి రాదు.

యూపీ టెన్త్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన బాలిక ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటాన్ని పలువురు ట్రోల్ చేశారు. ఆ పరిస్థితిని PCOD అంటారని వైద్యులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా తలెత్తే ఈ ప్రాబ్లమ్ వల్ల నెలసరి సక్రమంగా రాకపోవడం, అధిక రక్తస్రావం, బరువు పెరగడం వంటి పలు ఇబ్బందుల్ని PCOD మహిళలు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి వీలైతే అండగా ఉండాలి తప్ప గేలి చేయడం సరికాదని సూచిస్తున్నారు నిపుణులు.

TG: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాలఘాట్ జిల్లాలోని అలత్తూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమ్య హరిదాస్ తరఫున ఆయన ప్రచారం చేశారు. అక్కడి ప్రజలతో మమేకమవుతూ ఆయన ఓట్లు అభ్యర్థించారు. ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాగా భట్టికి పాల్‌ఘాట్ డీసీసీ అధ్యక్షుడు తంగప్పన్ ఘనస్వాగతం పలికారు.

AP: ఎమ్మెల్యే అభ్యర్థులకు TDP చీఫ్ చంద్రబాబు బీ ఫామ్‌లు అందజేశారు. దెందులూరు అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, నరసరావుపేట అభ్యర్థి చదలవాడ అరవిందబాబుతోపాటు మరికొందరికి బీ ఫామ్‌లు ఇచ్చారు. దెందులూరును BJPకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ TDP అభ్యర్థి చింతమనేనికే బీ ఫామ్ ఇచ్చారు. కాగా ఇటీవల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు బీ ఫామ్ అందించారు. ఆరోజు పలు కారణాలతో14 మంది బీ ఫామ్‌లు తీసుకోలేదు.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 26 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఏప్రిల్ 5న విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

TG: కేసీఆర్ ఇంటర్వ్యూపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపించిందని అన్నారు. 9 ఏళ్ల తర్వాత ఆయన అసలు స్వరూపం బయటపడిందని చెప్పారు. తిట్ల పురాణం మొదలుపెట్టింది బీఆర్ఎస్ చీఫ్ అని దుయ్యబట్టారు. కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందన్నారు.

12th ఫెయిల్ మూవీ స్టోరీకి కారణమైన రియల్ లైఫ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ ఐజీగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆయన ‘కొత్త ఛార్జ్’ అంటూ బాధ్యతలు స్వీకరించిన ఫొటోలను ట్వీట్ చేశారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్న ఆయనకు ఇటీవలే ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉద్యోగోన్నతి లభించింది. 12వ తరగతిలో ఫెయిలైన మనోజ్ కుమార్ తర్వాత ఐపీఎస్ అయ్యి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇవాళ ఐపీఎల్‌లో వందో మ్యాచ్ ఆడనున్నారు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌తో ఆయన ఈ ఘనత అందుకోనున్నారు. గిల్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 3,000కుపైగా పరుగులు చేశారు. అందులో 3 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో కూడా ఆయన అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 298 రన్స్ బాదారు.
Sorry, no posts matched your criteria.