News April 21, 2024

రాహుల్ గాంధీకి అస్వస్థత

image

ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఇవాళ మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో జరగాల్సిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనడం లేదు. రాహుల్ స్థానంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సత్నా, రాంచీ సభల్లో పాల్గొననున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రాహుల్ మళ్లీ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు.

News April 21, 2024

స్టార్ హీరో విజయ్‌పై కేసు?

image

తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ సామాజిక కార్యకర్త కేసు పెట్టినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఈ నెల 19న పోలింగ్ సమయంలో విజయ్ వల్ల అక్కడ ఉన్నవారికి ఇబ్బంది కలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపాయి. పోలింగ్ బూత్‌కు విజయ్ తన మద్దతుదారులతో వచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో విజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించాయి.

News April 21, 2024

సినిమా చూసి నాని భావోద్వేగం

image

జెర్సీ సినిమాను అభిమానులతో కలిసి చూసిన హీరో నాని, భావోద్వేగానికి లోనయ్యారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఆ మూవీ రిలీజై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో వేసిన ప్రత్యేక షోకు ఆయన హాజరయ్యారు. ‘తన ప్రయాణాన్ని మళ్లీ గుర్తుచేసుకునేందుకు, మరోసారి వీడ్కోలు చెప్పేందుకు అర్జున్ ఈరోజు బతికొచ్చినట్లు అనిపించింది. గుండె బరువెక్కింది’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

News April 21, 2024

రవీశ్ యూట్యూబ్ ఆదాయం రూ.కోట్లలోనే!

image

ప్రముఖ జర్నలిస్ట్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత రవీశ్ కుమార్ యూట్యూబ్ ఛానల్‌కు ఆదరణ భారీగా పెరిగింది. ప్రారంభించిన 16 నెలల్లోనే స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య 9.6Mకు చేరింది. ఇప్పటివరకు 526 వీడియోలను అప్‌లోడ్ చేయగా 980M+ వ్యూస్ వచ్చాయి. దీంతో ఆయన ఆదాయం రూ.కోట్లలోనే ఉన్నట్లు సైడ్ హస్టిల్ వీకెండ్ నివేదిక తెలిపింది. యూట్యూబ్ నుంచి రవీశ్‌కు నెలకు రూ.33 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు వస్తున్నట్లు పేర్కొంది.

News April 21, 2024

పేరులో ‘స్వస్తిక’ ఉన్నందుకు మహిళపై ఉబర్ నిషేధం!

image

ఆస్ట్రేలియాలో ఉబర్ సంస్థ వివాదంలో చిక్కుకుంది. స్వస్తిక చంద్ర అనే మహిళ గత ఏడాది అక్టోబరులో ఉబర్ ఈట్స్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఆమె పేరును హిట్లర్ నాజీ సంకేతంగా భావించిన ఉబర్ మహిళ ఖాతాను నిషేధించింది. బాధితురాలు సుమారు 5 నెలల పాటు సంస్థతో పోరాడింది. అటు ఆస్ట్రేలియా హిందూ మండలి కూడా జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు ఉబర్ దిగొచ్చింది. స్వస్తికకు సారీ చెప్పి మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చింది.

News April 21, 2024

ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓడినట్లే: అంబటి

image

AP: తాను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవాలని టీడీపీ, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 2019లో వచ్చిన మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గినా.. తాను నైతికంగా ఓడినట్లే అని అన్నారు. తనకు టికెట్ రాదని కూటమి నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని దుయ్యబట్టారు. సత్తెనపల్లిలో వైసీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

News April 21, 2024

అప్పట్లో ఈమె క్రేజే వేరు!

image

SRH మ్యాచ్‌లంటే కావ్యా మారన్ ఫేమస్. అయితే అంతకంటే ముందే హైదరాబాద్ ఫ్రాంచైజీకి గాయత్రి రెడ్డి వల్ల ఫుల్ క్రేజ్ ఉండేది. IPL ప్రారంభ ఎడిషన్‌లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్ కొనుగోలు, ప్లేయర్ల వేలం, జెర్సీ ఇలా ప్రతి విషయంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఆమె ఓనర్‌గా ఉండగానే 2009లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్ టైటిల్ గెలిచింది. ప్రస్తుతం SRH వరుస విజయాలతో ఫ్యాన్స్ గాయత్రి రెడ్డిని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

News April 21, 2024

ఫోన్ పోయిందా? ఈ పోర్టల్ మీ కోసమే

image

కేంద్రం తీసుకొచ్చిన <>‘సంచార్ సాథీ’<<>> పోర్టల్ మొబైల్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. దీని ద్వారా అపహరణకు గురైన మొబైల్‌ను ఐఎంఈఐ వివరాలతో వెంటనే బ్లాక్ చేయొచ్చు. అలాగే మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయన్న వివరాలు తెలుసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసే వారు దాని పూర్వాపరాలను ఈ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. కాల్స్, మెసేజ్‌ల ద్వారా సైబర్ నేరాలకు యత్నించారని గుర్తిస్తే ఫిర్యాదు చేయొచ్చు.

News April 21, 2024

నర్సాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా రామరాజు

image

AP: నర్సాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుని ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. కాగా ఎంపీ రఘురామకృష్ణ రాజు కోసం ఉండి సీటుని రామరాజు వదులుకున్నారు. అలాగే ప.గో జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని నియమించారు.

News April 21, 2024

న్యాయ రాజధాని అంటే ఇదేనా?: షర్మిల

image

AP: కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్న YCP నేతలు కనీసం మంచినీళ్లు కూడా అందించలేదని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. ‘కర్నూలు న్యాయ రాజధాని అంటే ఇదేనా? 5ఏళ్లలో సీమలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? గండ్రేవుల ప్రాజెక్టు పూర్తైతే కర్నూలుకు నీళ్లు వచ్చేవి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడ?’ అని కర్నూలు పర్యటనలో ఆమె ప్రశ్నించారు.