News April 21, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 21, ఆదివారం
శు.త్రయోదశి: అర్ధరాత్రి 1:11 గంటలకు
ఉత్తర ఫల్గుని: సా.5:08 గంటలకు
దుర్ముహూర్తం: మ.4:40 నుంచి సా.05.30 వరకు
వర్జ్యం: లేదు

News April 21, 2024

టుడే టాప్ స్టోరీస్

image

తొలి దశలో ఎన్డీఏకు అనుకూలంగా ఓటింగ్: PM మోదీ
AP: విలన్లకు హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారు: CM
AP: పరదాల మహారాణిని సాగనంపే సమయం వచ్చింది: పవన్
AP: KGF-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి: చంద్రబాబు
TG: రేవంత్ పదవి కోసం ఎవరినైనా తొక్కుతారు: హరీశ్ రావు
TG: కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ బేరసారాలు: పొన్నం
కేసీఆర్, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు: MP లక్ష్మణ్
IPL.. ఢిల్లీపై సన్‌రైజర్స్ విజయం

News April 21, 2024

IPL 2024: ఎక్కువ డాట్ బాల్స్ వేసింది ఎవరంటే?

image

ఐపీఎల్-2024లో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అత్యధిక (83) డాట్ బాల్స్ వేశారు. ఈ లిస్టులో అతని తర్వాత వరుసగా జస్ప్రీత్ బుమ్రా (79), కగీసో రబాడ (75), తుషార్ దేశ్ పాండే (69), ట్రెంట్ బౌల్ట్ (68) ఉన్నారు. ఇక ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన వారిలో బుమ్రా (13) తొలిస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా చాహల్ (12), కోయెట్జి (12), ముస్తాఫిజుర్ (11), కుల్దీప్ (10), ఖలీల్ (10) ఉన్నారు.

News April 20, 2024

రణ్‌వీర్, దీపికా నాకు థాంక్స్ చెప్పాలి: కరీనా

image

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘రామ్‌లీలా సినిమాలో ఫస్ట్ ఛాన్స్ నాకే వచ్చింది. నేను వదులుకోవడంతో ఆ సినిమాలో రణ్‌వీర్ సరసన దీపికా నటించారు. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఓ రకంగా చూస్తే వాళ్లు నాకు థాంక్స్ చెప్పాలి’ అని కరీనా తెలిపారు. ఇటు సైఫ్ అలీఖాన్ ‘కల్ హో నా హో’ మూవీని రిజెక్ట్ చేశానని.. ఆ మూవీ చేసుంటే సైఫ్‌తో తన వివాహం ఇంకా ముందే జరిగి ఉండేదని చెప్పారు.

News April 20, 2024

BREAKING: SRH ఘన విజయం

image

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో SRH 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 267 రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ 199 స్కోరుకే ఆలౌట్ అయ్యింది. జేక్ ఫ్రేజర్ 65, అభిషేక్ పోరెల్ 42, పంత్ 44 మినహా అందరూ విఫలమయ్యారు. నటరాజన్ 4, మార్కండే 2, నితీశ్ రెడ్డి 2, సుందర్, భువనేశ్వర్ చెరో వికెట్ తీశారు.

News April 20, 2024

కష్టాలు, త్యాగాలు అనే పదాలు నచ్చవు: కోహ్లీ

image

తాను ఎన్నో కష్టాలు పడ్డానని, త్యాగాలు చేశానని ఎప్పుడూ చెప్పుకోనని ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నారు. ‘నా జీవితంలో నేను ఎలాంటి కష్టాలు పడలేదు.. ఎలాంటి త్యాగాలు చేయలేదు. అందరిలాగే నేను కూడా ఇష్టపడి పని చేస్తున్నా. ప్రజల కష్టాలతో పోల్చుకుంటే నా కష్టాలు ఎంత? అందుకే వాటి గురించి అస్సలు మాట్లాడను’ అని ఆయన పేర్కొన్నారు.

News April 20, 2024

రాధాకిషన్‌రావుకు మధ్యంతర బెయిల్

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు మధ్యంతర బెయిల్ దక్కింది. తన తల్లికి అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో తల్లిని చూసేందుకు రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయనకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

News April 20, 2024

బౌండరీల వర్షం.. హెల్మెట్లతో బాల్ బాయ్స్

image

ఐపీఎల్-2024లో భాగంగా SRH, DC మ్యాచులో బౌండరీల వర్షం కురుస్తోంది. దీంతో బౌండరీల బయట ఉండి బాల్స్ అందించే బాల్ బాయ్స్ బెంబేలెత్తిపోతున్నారు. రక్షణ కోసం హెల్మెట్స్ ధరించడం చూస్తుంటేనే అక్కడ ఎంతటి విధ్వంసం జరుగుతోందనేది అర్థం అవుతోంది. ఒక బాల్ బాయ్ భయంతో హెల్మెట్ పెట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సేఫ్టీ ఫస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 20, 2024

IPLలో అత్యంత వేగంగా 200 రన్స్ చేసిన జట్లు

image

14.1 – RCB vs PBKS, బెంగళూరు, 2016 (15 ఓవర్ల మ్యాచ్)
14.4 – SRH vs MI, హైదరాబాద్, 2024
14.5 – SRH vs DC, ఢిల్లీ, ఈరోజు*
14.6 – SRH vs RCB, బెంగళూరు, 2024
15.2 – KKR vs DC, వైజాగ్, 2024

News April 20, 2024

ఏపీలో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే..

image

ఇవాళ ప్రకాశం(D) దరిమడగులో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తిరుపతి(D) మంగనెల్లూరులో 43.9, చిత్తూరు(D) నింద్రలో 43.6 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. రేపు 45 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు.. సోమవారం 70 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 116 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ప్రభావిత మండలాల లిస్ట్ కోసం ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి.