News April 7, 2024

సీపీఎస్‌కు పరిష్కారం చూపిస్తాం: పవన్

image

AP: తమ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ‘నేను సాధారణ ఉద్యోగి కుమారుడిని. ఉద్యోగులకు పెన్షన్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. NDA ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే న్యాయం చేస్తాం. అనకాపల్లి SEZలో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా కృషి చేస్తాం. యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించారు.

News April 7, 2024

జగన్ సీఎం కాదు.. సారా వ్యాపారి: పవన్

image

AP: సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. ‘అమ్మ ఒడి పథకం ఎంతమంది పిల్లలున్నా వేస్తామని చెప్పి.. 83 లక్షల మంది లబ్ధిదారుల్లో 44 లక్షల మందికే ఇచ్చారు. రూ.19,600కోట్లు అమ్మఒడికి ఇచ్చి.. మద్యం అమ్మి నాన్న తడి పథకం కింద రూ.లక్ష కోట్లు దోచేసిన సారా వ్యాపారి జగన్. మనకి ఈ కోడిగుడ్డు ప్రభుత్వం, కోడిగుడ్డు మంత్రి వద్దు’ అని అనకాపల్లి సభలో జనసేనాని వ్యాఖ్యానించారు.

News April 7, 2024

ఉద్యోగాల్లేక యువత HYD వెళ్లే దుస్థితి: చంద్రబాబు

image

AP: రాజధాని అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం వచ్చేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పామర్రులో మాట్లాడుతూ.. ‘రోడ్ల మీద గుంతలు పూడ్చలేని జగన్ 3 రాజధానులు కడతారంట. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క యువత హైదరాబాద్‌కు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చారు.

News April 7, 2024

FLASH: ముంబైకి తొలి విజయం

image

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై తొలి విజయాన్ని అందుకుంది. ఢిల్లీపై 29 పరుగుల తేడాతో గెలిచింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 205/8 స్కోర్ చేయగలిగింది. పృథ్వీ షా 66, అభిషేక్ పోరెల్ 41 రాణించగా, చివర్లో స్టబ్స్ 25 బంతుల్లోనే 71 పరుగులు(7 సిక్సులు, 3 ఫోర్లు) చేసినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో గెరాల్డ్ 4, బుమ్రా 2 వికెట్లు, షెఫర్డ్ ఒక వికెట్ తీశారు.

News April 7, 2024

IPL: టాస్ గెలిచిన LSG

image

ఈరోజు LSG, GTకి మధ్య జరగనున్న మ్యాచ్‌లో లక్నో టాస్ గెలుపొంది బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

GT జట్టు: గిల్, సుదర్శన్, విజయ్ శంకర్, బీఆర్ శరత్, తెవాతియా, రషీద్, నల్కండే, నూర్ అహ్మద్, ఉమేశ్, స్పెన్సర్, మోహిత్

LSG జట్టు: డికాక్, రాహుల్, పడిక్కల్, స్టొయినిస్, పూరన్, బదోనీ, కృనాల్, బిష్ణోయీ, యశ్ థాకూర్, నవీన్ ఉల్-హక్, మయాంక్ యాదవ్

News April 7, 2024

దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్: CBN

image

AP: తాము అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పలువురు దివ్యాంగులు తమను కలిసిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘వైసీపీ పాలనలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు అండగా ఉంటాం. సాధారణ పెన్షన్లు కూడా నెలకు రూ.4వేలకు పెంచుతాం. మహిళలకు నెలకు రూ.1500 అందిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. అందరికీ ఇస్తాం’ అని చెప్పారు.

News April 7, 2024

‘హ్యాపీ డేస్’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

image

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీ డేస్’ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 19 ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లోబల్ సినిమాస్ ఈ చిత్రాన్ని థియేటర్లలో రీరిలీజ్ చేయనుంది. కాగా ఈ మూవీలో వరుణ్ సందేశ్, నిఖిల్ సిద్ధార్థ, తమన్నా, కమలినీ ముఖర్జీ కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా 2007లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

News April 7, 2024

ఘోరం: 29 గంటలపాటు ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

image

కేరళలోని వయనాడ్ వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్(20) FEB 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ‘FEB 16న ఉ.9 నుంచి మరుసటి రోజు మ.2 వరకు 29 గంటలపాటు సిద్ధార్థన్‌పై సీనియర్లు క్రూరంగా దాడి చేశారు. బెల్టులతో కొడుతూ ర్యాగింగ్ చేశారు. దీంతో మానసిక ఒత్తిడికి గురై అతను బాత్‌రూమ్‌లో ఉరివేసుకున్నాడు’ అని పోలీసులు నివేదించారు. కాగా ఈ కేసును CM విజయన్ CBIకి అప్పగించారు.

News April 7, 2024

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తాం: స్టాలిన్

image

విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ వైతిలింగానికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు. బీజేపీ పదేళ్ల పాలనలో ఈ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. కాగా ఇక్కడి ఏకైక ఎంపీ స్థానానికి ఈ నెల 19న పోలింగ్ జరగనుంది.

News April 7, 2024

మరో 2 నెలల్లో మళ్లీ ‘జగన్ అనే నేను’: వైఎస్ జగన్

image

AP: మరో 2 నెలల్లో మళ్లీ ‘జగన్ అనే నేను’ అంటూ తాను ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘అధికారాన్ని చంద్రబాబు దోచుకోవడానికి ఉపయోగించాడు. నేను సంక్షేమానికి వినియోగించాను. ప్రతి గ్రామంలో మా సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా’ అంటూ ప్రశ్నించారు.