India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు సూర్యతాపం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాడ్పులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వృద్ధులు, చిన్నారులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నిన్న వడదెబ్బకు గురై రాష్ట్రంలో ఐదుగురు మరణించారు.

ఐపీఎల్ రసవత్తరంగా మారుతోంది. ఈరోజు లక్నో వేదికగా మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ను LSG ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 6మ్యాచులు ఆడి 4 గెలిచిన CSK 3వ స్థానంలో ఉంది. మరోవైపు ఆరింట్లో 3 గెలిచిన LSG 5వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ వైపు దూసుకెళ్లాలని రెండు జట్లూ భావిస్తున్నాయి. హెడ్‌టుహెడ్ రికార్డులు.. 1-1తో సమానంగా ఉన్నాయి. అందరి చూపు ధోనీపైనే ఉంది.

AP: రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. దీంతో ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మికశాఖ కమిషనర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవు ఇచ్చినందుకు జీతంలో ఎలాంటి కోత విధించకూడదని సూచించారు. తెలంగాణలోనూ ఇప్పటికే సెలవు ప్రకటించారు.

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా కొందరు నేడు బోర్డర్ దాటి వచ్చి మరీ ఓటు వేయనున్నారు. ఈ అరుదైన దృశ్యం త్రిపురలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద జరగనుంది. పశ్చిమ త్రిపురలోని జాయ్‌పుర్ ప్రాంతానికి చెందిన వీరు భారతీయులే అయినా సరిహద్దు అవతల వారి పొలాలు, చేపల చెరువులు ఉండటంతో అదే వారి నివాసం అయిపోయింది. దొంగలు తమ పంటను ఎత్తుకెళ్తారేమోననే భయంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వస్తోందట. <<-se>>#Elections2024<<>>

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఆ భూభాగానికి ఆంక్షలు, వివాదాలు లేకపోవడంతో 15 కుటుంబాలు అక్కడ నివసించగలుగుతున్నాయి. ‘సొంతగడ్డకు దూరంగా ఉన్నామనే భావన కలుగుతోంది. చీకటి పడితే బంగ్లాదేశ్ జవాన్లు, కొందరు మూకల దయాదాక్షిణ్యాలపైనే బతకాల్సి వస్తోంది’ అని వాపోతున్నారు. బోర్డర్ దగ్గర రాకపోకలు సాగించడంలో ఎదురయ్యే సమస్యలు ఈ ఎన్నికల తర్వాత అయినా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు. <<-se>>#Elections2024<<>>

TG: ఎన్నికల విధులకు రాని ఉద్యోగులపై చర్యలు ఉంటాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటికి అదనంగా 452 సహాయ పోలింగ్ కేంద్రాలకు ఈసీ అనుమతిచ్చిందని తెలిపారు. మొత్తంగా 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. 2.90లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో భాగస్వాములు కానున్నారని వెల్లడించారు.

తెలంగాణలో ఈ ఏడాది వానాకాలంలో రైతులు వరి సాగుకు పెద్దపీట వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈసారి దాదాపు 65లక్షల ఎకరాల్లో వరి, 53లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని భావిస్తోంది. ఈమేరకు వానాకాలం సీజన్‌కు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసింది. గత వానాకాలంలో 64లక్షల ఎకరాల్లో వరి, 44.77లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పంటల సాగు అంచనాల మేరకు విత్తనాల సరఫరాకు సన్నాహాలు చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ నిన్న మొదలు కాగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి 39 మంది MP అభ్యర్థులు, 190 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు తెలంగాణ నుంచి 42 మంది ఎంపీ అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి తమ నామినేషన్ దాఖలు చేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>

TG: పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచంద్ రెడ్డి నామినేషన్‌కు హాజరై సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు హాజరైన అనంతరం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈనెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్, 23న నాగర్‌కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్‌లో పర్యటించనున్నారు.

గుజరాత్‌లోని కచ్‌లో ఇటీవల గుర్తించిన శిలాజాలకు సంబంధించి IIT రూర్కి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇవి ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాముకు చెందిన వెన్నెముక భాగాలు కావొచ్చని పేర్కొంది. అంతరించిపోయిన మాడ్‌ట్సోయిడే కుటుంబానికి చెందిన ఈ పాము పొడవు 11-15 మీటర్లు (36-49 ఫీట్లు) ఉండొచ్చని తెలిపింది. కాగా కొత్తగా గుర్తించిన ఈ రకం పాము జాతికి పరిశోధకులు ‘వాసుకీ ఇండికస్’ అని నామకరణం చేశారు.
Sorry, no posts matched your criteria.