News November 21, 2024

అదానీ కంపెనీ షేర్లు క్రాష్.. ఇన్వెస్టర్లు లబోదిబో

image

గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదవ్వడంతో అదానీ గ్రూప్ షేర్లు క్రాష్ అయ్యాయి. అదానీ ఎనర్జీ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18.6%, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అంబుజా సిమెంట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ 15%, ఏసీసీ 13%, అదానీ పోర్ట్స్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ 10%, సంఘి ఇండస్ట్రీస్ 7% మేర పతనమయ్యాయి. దీంతో గౌతమ్ అదానీ నెట్‌వర్త్ రూ.వేలకోట్ల మేర తగ్గినట్టు సమాచారం.

News November 21, 2024

స్టాక్ మార్కెట్లు విలవిల: రూ.3లక్షల కోట్ల నష్టం

image

దేశీయ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గౌతమ్ అదానీపై USలో అభియోగాలు నమోదవ్వడం, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, క్రూడాయిల్ ధరలు, $ విలువ పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. సెన్సెక్స్ 77,013 (-564), నిఫ్టీ 23,320 (-200) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.3L CR సంపద ఆవిరైంది. ADANIENT, ADANIPORTS, SBI టాప్ లూజర్స్. INFY, TCS టాప్ గెయినర్స్.

News November 21, 2024

టీమ్ ఇండియా తుది జట్టులోకి తెలుగు తేజం?

image

రేపటి నుంచి AUSతో జరిగే BGT తొలి టెస్టుతో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. AUSలో అతడు రాణించగలడని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తాజా ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ధాటిగా బ్యాటింగ్, వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయగల నితీశ్ లాంటి ఆల్‌రౌండర్ అవసరం ప్రతి జట్టుకు ఉంటుందన్నారు. దీంతో అతడికి తుది జట్టులో చోటు కన్ఫర్మ్ అని వార్తలొస్తున్నాయి. దీనిపై రేపు స్పష్టత రానుంది.

News November 21, 2024

PM కిసాన్, PM ఆవాస్ పేరుతో మోసాలు

image

TG: PM కిసాన్, PM ఆవాస్ యోజన పేరుతో వచ్చే SMSలను నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది. సైబర్ నేరగాళ్లు ఈ పథకాల పేర్లతో నకిలీ SMSలు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. APK ఫైల్స్ పంపి, వాటి ద్వారా పథకంలో చేరాలని చెబితే ఆ లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించింది. తెలియని వ్యక్తుల నుంచి APK ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. అనుమానం వస్తే 1930కి కాల్ చేయాలంది.

News November 21, 2024

పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: బీఎస్సీ పారామెడికల్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాల కోసం NTR హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ ఉ.11 గంటల నుంచి DEC 9వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ విద్యార్థులు రూ.2360, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.1888 చొప్పున రుసుం చెల్లించాలి. 17 ఏళ్లు పైబడిన విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 21, 2024

మాపై ఒత్తిడి లేదు.. రెడీగా ఉన్నాం: కమిన్స్

image

రేపటి నుంచి భారత్‌తో జరిగే BGT కోసం ప్రిపేర్డ్‌గా ఉన్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ తెలిపారు. గత పదేళ్లలో BGT గెలవకపోయినా తమ జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. టీమ్ ఇండియా లాంటి బలమైన జట్టుతో ఆడటం తమకు మంచి ఛాలెంజ్ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఇండియాకు బుమ్రా కెప్టెన్సీ చేయడంపై స్పందిస్తూ తమలాగా మరింత మంది పేసర్లు కెప్టెన్లుగా ఎదగాలని ఆకాంక్షించారు.

News November 21, 2024

రూ.20లక్షలు చెల్లిస్తేనే ఉద్యోగం: జొమాటో CEO

image

జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఈవో దీపిందర్ గోయల్ పిలుపునిచ్చారు. 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వారు అర్హులని తెలిపారు. అయితే, దీనికి ఎలాంటి రెజ్యూమ్ అవసరం లేదని, జాయిన్ అవ్వాలంటే రూ.20లక్షలు విరాళంగా ఇవ్వాలన్నారు. వీటిని చారిటీకి అందిస్తామని, తనతోపాటు ఉంటూ నేర్చుకోవాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశం అని సూచించారు. ఇదొక లర్నింగ్ ప్రోగ్రామ్ మాత్రమే అని ప్రకటనలో చెప్పారు.

News November 21, 2024

పీఏసీ ఛైర్మన్ ఎన్నిక.. సర్వత్రా ఉత్కంఠ

image

AP అసెంబ్లీలో PAC ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షానికి ఈ పదవిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుండగా, సభ్యుడి ఎన్నికకు 18 ఓట్లు అవసరం. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ఇవాళ నామినేషన్ వేస్తారా? లేదా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జగన్‌కు ప్రతిపక్ష హోదా దక్కలేదని అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలు PAC ఛైర్మన్ పదవి అంశంలో ఎలా ముందుకెళ్తారో చూడాలి.

News November 21, 2024

తల్లి కావడంలో ఫెయిల్ అయ్యా.. నటి ఎమోషనల్

image

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను పొందిన మిచెల్ యోహ్ ఎన్నో విజయాలను చూశారు. ఆస్కార్ అవార్డు సైతం ఆమెను వరించింది. కానీ, తాను తల్లి కావడంలో ఫెయిల్ అయ్యానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తల్లిగా అనుభూతి చెందలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పిల్లలు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంతానోత్పత్తికి చికిత్స కూడా తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News November 21, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్

image

AP: SCT పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగించినట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు 9441450639, 9100203323 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.