India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రధాని నరేంద్ర మోదీని ఓడిపోయిన చక్రవర్తిగా అభివర్ణించారు సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్. మోదీ ధ్యానం చేస్తోన్న ఫొటోలను Xలో పంచుకుంటూ.. ‘ఈరోజు ఎన్నికల చివరి దశ. నేను ద్వేషానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాను. నా దేశం కూడా ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేసిందని నేను నమ్ముతున్నా. 4వ తేదీన కలుద్దాం. వారాంతాన్ని బాగా గడపండి’ అని పోస్ట్ చేశారు.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న 67,873 మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీకి రూ.3.93 కోట్ల ఆదాయం సమకూరింది.

AP: ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లే ముందుగా వారికి బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఆ టెస్ట్‌లో మద్యం తాగినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా వెనక్కి తిరిగి పంపుతారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు పోలీసుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారాయి.

TG: ఈ ఏడాది ఫార్మసీతో పాటు పలు కోర్సుల ఫీజులు పెరగనున్నాయి. బీ ఫార్మసీకి కనిష్ఠ ఫీజు ₹45,000, గరిష్ఠ ఫీజు ₹1.10 లక్షలు, ఫార్మా(డీ)(₹55,000, ₹1.25 లక్షలు), ఎం ఫార్మసీ (₹1.10లక్షలు, ₹1.25లక్షలు), ఫార్మసీ(డీ)పీబీ కోర్సుకు (₹68,000, ₹1.15లక్షలు), ఎంఆర్క్(₹70వేలు, ₹80వేలు), బీఆర్క్(₹65వేలు, ₹1.20లక్షలు), BFA(₹35,000)గా ఉండనుంది. ఈ ఫీజుల్ని గతేడాదే పెంచారు. కానీ కౌన్సెలింగ్ పూర్తవడంతో అమలు చేయలేదు.

‘బాహుబలి’ సినిమాలో అనుష్క తరహాలో పాత్రలు చేయడం తన డ్రీమ్ రోల్ అని హీరోయిన్ కృతిశెట్టి అన్నారు. యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేయాలని ఉందని తెలిపారు. జయాపజయాల గురించి తాను పట్టించుకోనని మీడియా సమావేశంలో చెప్పారు. శర్వానంద్‌కు జోడీగా నటించిన ‘మనమే’ సినిమాలో తన పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందన్నారు. కాగా ‘మనమే’ మూవీ ఈ నెల 7న విడుదల కానుంది.

కంపెనీల యాజమాన్యాలు, ఉన్నతస్థాయి ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న, పబ్లిక్‌కు వెల్లడించని సమాచారం ఆధారంగా ట్రేడింగ్ చేయడాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటారు. కంపెనీ లాభ, నష్టాలు, నూతన పెట్టుబడుల సమాచారం బయట పెట్టకుండా కొందరు షేర్లు కొనుగోలు/విక్రయించి లబ్ధి పొందుతారు. అందుకే దీన్ని SEBI నిషేధించింది. ఎవరైనా <<13353039>>ఇన్‌సైడర్<<>> ట్రేడింగ్ చేస్తే భారీ ఫైన్‌లతోపాటు కొంతకాలం ట్రేడింగ్ చేయకుండా నిషేధిస్తుంది.

మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ సర్కారు రూ.2 లక్షల లోపు ఉన్న పంటరుణాలను షరతులేవీ విధించకుండా మాఫీ చేసింది. ఒకేసారి రూ.20 వేల కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఆ సొమ్మును లోన్ పేమెంట్ కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి. తెలంగాణ వ్యవసాయ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు MHలో ఈ విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

పాలల్లో అనేక పోషకాలు ఉంటాయి. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు 2001లో UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) ఏటా జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. అందుబాటు ధరల్లో పోషకాలు ఉండే పాలను సమతుల్య ఆహారంలో భాగం చేయడమే ఈ ఏడాది థీమ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉండటం విశేషం.

టెస్లాలోని $7.5 బిలియన్ల షేర్లను విక్రయించి ఎలాన్ మస్క్ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ ఓ వాటాదారుడు కోర్టులో దావా వేశారు. కంపెనీ షేర్లు తగ్గుతాయనే సమాచారంతో 2022 చివర్లో వాటిని విక్రయించి $3 బిలియన్ల ప్రయోజనం పొందారని ఆరోపించారు. 2023 జనవరి 2న నాలుగో క్వార్టర్ అంచనాలను ప్రజలకు వెల్లడించిన తర్వాత కంపెనీ షేరు విలువ తగ్గిపోయిందన్నారు. ఆయన పొందిన లాభాలను తిరిగి చెల్లించేలా ఆదేశించాలని కోరారు.

T20 వరల్డ్‌కప్ సన్నాహాల్లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య న్యూయార్క్ వేదికగా వార్మప్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, డిస్నీ+హాట్‌స్టార్ యాప్/వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కాగా టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా జట్టులో చేరారు. అతను వార్మప్ మ్యాచులో ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.