India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అమిత్‌షా అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకూడదన్న కాంగ్రెస్ నిర్ణయంపై ‘పారిపోకండి’ అంటూ Xలో పోస్ట్ పెట్టారు. ‘INCకి భారీ ఓటమి తప్పదు. ఆ విషయం ఆ పార్టీకి తెలుసు. ఇక ప్రజలను, మీడియాను ఎలా ఎదుర్కొంటుంది? అందుకే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకుండా పారిపోతోంది. అలా చేయకుండా ఓటమినెదుర్కొని ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.

తిరుమలలో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రతిరోజూ(MON-SAT) మ.3 గంటలకు టీటీడీ ప్రత్యేక స్లాట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సమయంలో ఇతర క్యూలు నిలిపివేసి, వీరికి నేరుగా ఉచిత దర్శనం కల్పిస్తారు. దీనికోసం TTD వెబ్‌సైట్‌లో టికెట్ బుక్(FREE) చేసుకోవాల్సి ఉంటుంది. 65+వయసున్న వారు, హార్ట్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. వారు ఆధార్, మెడికల్ సర్టిఫికెట్ చూపించాలి.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు క్రిస్ గేల్(63) పేరిట ఉంది. ఈ లిస్టులో అతని తర్వాతి స్థానాల్లో వరుసగా రోహిత్ శర్మ(35), జోస్ బట్లర్(33), యువరాజ్ సింగ్(33), డేవిడ్ వార్నర్(31), షేన్ వాట్సన్(31), ఏబీ డివిలియర్స్(30), విరాట్ కోహ్లీ(28) ఉన్నారు. అత్యధిక మ్యాచులు ఆడిన రికార్డు రోహిత్ శర్మ(39) పేరిట ఉంది. షకీబ్ (36) రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

దేశంలోని ఐఐటీల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ర్యాంకులు ఈనెల 9న వెలువడనున్నాయి. తాజాగా రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. https://jeeadv.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు ప్రైమరీ ‘కీ’ విడుదల కానుంది. ఈనెల 26న జరిగిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40వేల మంది హాజరయ్యారు.

తేది: జూన్ 1, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:49 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:47 గంటలకు
ఇష: రాత్రి 8.08 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఇంగ్లండ్ క్రికెటర్ బ్రైడన్ కార్సేకు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. బెట్టింగ్‌లకు పాల్పడినందుకు 16 నెలల పాటు నిషేధం విధించింది. ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన కార్సే 2017-19 మధ్య జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్‌ల్లో 303 బెట్‌లు వేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అతడిపై ఈసీబీ నిషేధం విధించింది. కార్సే ఇంగ్లండ్ తరఫున 14 వన్డేలు, 3 టీ20లు ఆడారు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

1926: హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో జననం
1964: సినీ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి జననం
1970: నటుడు మాధవన్ జననం
1975: మాజీ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి జననం
1985: నటుడు నిఖిల్ సిద్ధార్థ జననం
1996: భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మరణం
* అంతర్జాతీయ బాలల దినోత్సవం
* ప్రపంచ పాల దినోత్సవం

బీటౌన్ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ <<13348886>>బ్రేకప్ <<>>వార్తలను ఆమె మేనేజర్ ఖండించారు. అవన్నీ పుకార్లని కొట్టిపారేశారు. వాళ్లు ప్రస్తుతం కలిసే ఉన్నారని తెలిపారు. వారు విడిపోయారని వార్తలు వస్తుండటంతో మీడియా అతడిని ప్రశ్నించగా ఇలా స్పందించారు. మలైకా, అర్జున్ 2018 నుంచి సహజీవనం చేస్తున్నారు. గతంలో అర్బాజ్ ఖాన్‌ను పెళ్లాడిన ఆమె 18ఏళ్ల తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.