India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘మనమే’. ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. ట్రైలర్‌పై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. రేపు ఉదయం 11.07 గంటలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారని ప్రకటించింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. జూన్ 7న మూవీ రిలీజ్ కానుంది.

ఎన్నికల పోలింగ్ జరిగేటప్పుడు/పోలింగ్ పూర్తయ్యాక వివిధ ఏజెన్సీలు సర్వేలు చేస్తాయి. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుంది? అని అంచనా వేస్తాయి. AXIS MY INDIA, C-ఓటర్, చాణక్య, టైమ్స్ నౌ, ఇండియా టుడే, CNX, ABP తదితర సంస్థలు సర్వేలు నిర్వహించి ప్రాచుర్యం పొందాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన సందర్భాలూ ఉన్నాయి.

AP: రేపు అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అటు ఇవాళ పల్నాడు(D) వినుకొండలో 45.9 డిగ్రీలు, ప్రకాశం(D) పుల్లలచెరువులో 45.4, NTR(D) నందిగామలో 45.3, GNT(D) తుళ్లూరు, ఫిరంగిపురంలో 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పౌల్ట్రీ, పక్షుల అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే తమకు తెలియజేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. AP(నెల్లూరు), MH(నాగ్‌పూర్), KL(అలప్పుజ, కొట్టాయం), JH(రాంచీ)లలో ఈ ఏడాది <<13347975>>బర్డ్ ఫ్లూ<<>> వ్యాప్తిని గుర్తించామని తెలిపింది. ఇది మనుషులకు సోకే అవకాశం ఉందని.. మందులు, PPE కిట్లు, మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్‌ఫెక్షన్ సోకిన పక్షులను వధించే, పర్యవేక్షించే వారి నమూనాలను టెస్ట్ చేయాలంది.

కస్టడీలో తనకు ఇంటి నుంచి భోజనం తెప్పించేలా అవకాశం కల్పించాలని, కేసుకు సంబంధించి మీడియా కవరేజీపై ఆంక్షలు విధించాలని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జడ్జిని కోరారు. దీంతో పాటు బాత్రూమ్‌లు శుభ్రంగా లేవని, దుర్వాసన వస్తోందని వివరించారు. మహిళలపై అత్యాచారం, వీడియోల చిత్రీకరణ కేసులో ప్రజ్వల్‌ను కోర్టు కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే.

ఒడిశాలో ‘ఆంత్రాక్స్’ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కోరాపుట్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్‌గా తేలడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరింత మందికి వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఆంత్రాక్స్ సోకిన ఆవు కళేబరం నుంచి వారికి ఈ బ్యాక్టీరియా సోకినట్లు గుర్తించారు. ‘బాసిల్లస్ ఆంత్రాసిస్’ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా రేపు ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

AP CM జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఇప్పటికే ఆయన లండన్ నుంచి బయల్దేరారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. రేపు మధ్యాహ్నం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. జగన్ ఈనెల 17న విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

TG: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ICET పరీక్ష జూన్ 5, 6 తేదీల్లో జరగనుంది. కాసేపటి క్రితం అధికారులు హాల్‌టికెట్లను విడుదల చేశారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్, DOB, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నంబర్లను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <

ఎగ్జిట్ పోల్స్ వెలువడే వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. TV ఛానల్స్‌లో జరిగే ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు AICC అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ‘ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. దానికి ముందు TRP కోసం ఊహాగానాలతో జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనదు. ఫలితాలు వెలువడే రోజు నుంచి పాల్గొంటాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.