India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతం మార్పుపై ప్రజాభిప్రాయం తీసుకుందా అని BJP MP బండి సంజయ్ ప్రశ్నించారు. సమస్యలను పక్కదారి పట్టించడంలో BRS, కాంగ్రెస్ రెండూ ఒకటేనని విమర్శించారు. చార్మినార్ అంటే HYD అంటున్న KCR కొడుకును అక్కడున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్నదేమిటని ప్రశ్నించారు. HYD అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ అని బండి స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితాలపై స్టాక్ మార్కెట్ల జోష్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఐదు ప్రధాన రంగాలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. విద్యుత్, మౌలికవసతులు, పర్యాటకం, రియల్టీ, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ & మాన్యుఫాక్చరింగ్ రంగాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. విద్యుత్ రంగంలో రూ.4.75లక్షల కోట్లతో నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ అమలు సహా ఇతర రంగాల్లో కేంద్రం భారీగా వెచ్చించనుండటమే కారణం.

న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనున్న భారత్, పాక్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. మ్యాచ్ సమయంలో అలజడి సృష్టించే అవకాశం ఉండటంతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నాసౌ కౌంటీ పోలీస్ కమిషనర్ పాట్రిక్ తెలిపారు. డ్రోన్ దాడులకూ అవకాశం ఉన్నందున మ్యాచ్ జరుగుతున్న ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని న్యూయార్క్ గవర్నర్ ఆదేశాలిచ్చారు.

నియోజకవర్గానికి ఒక కౌంటింగ్ హాల్‌ను కేటాయిస్తారు. ఆ హాల్‌లో ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేయాలనేది అధికారులు నిర్ణయిస్తారు. ఒక్కో అభ్యర్థి టేబుల్‌కు ఒకరి చొప్పున ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఉదాహరణకు 14 టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే ఒక అభ్యర్థి 14 మంది ఏజెంట్లను నియమించుకోవచ్చు. వీరికి అదనంగా రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఒక ఏజెంట్, పోస్టల్ బ్యాలెట్ల పరిశీలనకు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి.

కోహ్లీతో తన బంధం గురించి దేశం తెలుసుకోవాల్సిన అవసరం లేదని గంభీర్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘టీమ్ గెలుపు కోసం అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు నాకెంత ఉందో అతనికీ అంతే ఉంటుంది. మా బంధం ప్రజలకు మసాలా(ఎంటర్‌టైన్‌మెంట్) అందించడం కోసం కాదు. వాస్తవికతకు ఓ అభిప్రాయానికి వ్యత్యాసం ఉంటుంది’ అని పేర్కొన్నారు. 2023 ఐపీఎల్‌లో వీరి మధ్య మాటల యుద్ధం జరగగా ఈ ఏడాది ఇద్దరూ కలిసిపోయిన విషయం తెలిసిందే.

గతంలో ఏ ప్రధాని కూడా మోదీలా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్‌సింగ్ ఆరోపించారు. ‘PM పదవి గౌరవాన్ని తగ్గించిన మొదటి ప్రధాని మోదీ. ఒక వర్గమే లక్ష్యంగా అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ హయాంలో రైతుల నిరసనలు జరిగాయి. రైతుల ఆదాయాన్ని పెంచుతానన్న హామీని మోదీ మరిచిపోయారు’ అని మన్మోహన్ విమర్శించారు.

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో 16 మంది భారత జవాన్లపై కేసు నమోదైంది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగింది. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఆర్మీ సైనికుడి ఇంటిపై స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న సహచర సైనికులు PSపై దాడి చేసి పోలీసులను తీవ్రంగా కొట్టగా ఎస్ఐతో సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. దాడికి పాల్పడిన 16 మంది జవాన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ఈవెంట్లో బాలకృష్ణ కుర్చీ వద్ద బాటిల్లో మద్యం ఉందంటూ కొందరు నెట్టింట విమర్శలు చేశారు. అయితే, దీనిపై మోక్షజ్ఞ తేజ టీమ్ స్పందించింది. అసలైన ఫుటేజీ ఇదేనంటూ రెండు ఫొటోలను పంచుకుంది. ఆయన కాలి వద్ద సెకండ్ బాటిల్ లేదని, ఇది CG (కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్ అని క్లారిటీ ఇచ్చింది. యూట్యూబ్‌లో ఉన్న ఈవెంట్ వీడియోలోనూ రెండో బాటిల్ లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పుణేలో పోర్షె కారు ప్రమాద ఘటనలో రోజుకో అంశం వెలుగుచూస్తోంది. ప్రమాదం అనంతరం నిందితుడి బదులు అతడి తల్లి శివాని అగర్వాల్ రక్తం నమూనాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తాజాగా వెల్లడైంది. వాటిని తారుమారు చేసేందుకు అక్కడున్న నలుగురు సహకరించినట్లు తేలింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడితో పాటు అతడి తండ్రి, తాత సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

AP: ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. సత్రంపాడులో నడిరోడ్డుపై జక్కుల రత్న గ్రేస్(22) అనే యువతిని యువకుడు ఏసురత్నం గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. యువతి స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.