India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీ20 WCలోకి భారత జట్టు నం.1 ర్యాంకుతోనే అడుగుపెట్టనుంది. ఇటీవల ప్రకటించిన ఐసీసీ టీమ్ ర్యాంకుల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ టీమ్స్ ఉన్నాయి. వీటిలో ENG, వెస్టిండీస్ ఇప్పటివరకు తలో రెండు సార్లు ట్రోఫీ నెగ్గాయి. ఇక భారత్, AUS ఒక్కోసారి టైటిల్ అందుకున్నాయి. 2021లో రన్నరప్‌గా నిలిచిన NZ ఈ సారి కప్పుపై కన్నేసింది.

TG: ఎగ్జిట్ పోల్స్ విడుదలైన అనంతరం ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించినట్లు నిందితుడు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. అతడే సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారన్నారు. BRS ఓడిపోవడంతో డిసెంబర్ 4న రా.7.30 నుంచి 8.15 గంటల వరకు హార్డ్ డిస్కులను కట్టర్లతో కట్ చేశామని చెప్పారు. తన ఫోన్, ల్యాప్‌టాప్ ఫార్మాట్ చేశానని, పెన్‌డ్రైవ్‌లను పారేశానని తెలిపారు.

TGలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 1,855 టేబుళ్లు ఏర్పాట్లు చేసినట్లు CEO వికాస్ రాజ్ వెల్లడించారు. *34 ప్రాంతాల్లో సెగ్మెంట్ల వారిగా <<13340511>>ఓట్ల<<>> లెక్కింపునకు ఏర్పాట్లు *తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ *అత్యధికంగా చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురలో 24 రౌండ్లు, అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో 13 రౌండ్లలో కౌంటింగ్ *నియోజకవర్గంలో 5 VVప్యాట్‌ల ఓట్ల లెక్కింపు.

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ పాలిసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో సాంకేతిక విద్యాశాఖ మార్పులు చేసింది. జూన్ 3న జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను జూన్ 6కు మార్చింది. 7వ తేదీ నుంచి 10 వరకు ఆప్షన్ల నమోదు, 11న ఆప్షన్ల మార్పు, 13న తుది సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపింది. 14 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, 19లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొంది. జూన్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. దుల్కర్ ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే.

శ్రీవారి దర్శనం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు సాయంత్రం చేరుకుంటారు. రాత్రికి తిరుమల చేరుకుని వకుళామాత అతిథిగృహంలో బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, మ.12 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.

టీ20 WCలో పాకిస్థాన్‌పై భారత్ కచ్చితంగా గెలుస్తుందని పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ జోస్యం చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. పాక్ తరఫున కమ్రాన్ 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌లో నేటి సాయంత్రం నుంచి జూన్ 1న మ.3 గంటల వరకు ధ్యానంలో కూర్చుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు అక్కడ భద్రతను పెంచారు. 2వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం ముగిసిన అనంతరం ఆయన కేదార్‌నాథ్ గుహలో ధ్యానం చేసిన సంగతి తెలిసిందే.

TG: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని గతంలో ప్రకటించగా తాజాగా షెడ్యూల్‌ను మార్చింది. రోజూ ఉ.7 నుంచి ఉ.11 వరకు స్కూల్ టీచర్లు తమ పరిధిలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొంది. ఇందులో భాగంగా చదువుకు దూరంగా ఉంటున్న పిల్లల్ని టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాల్సి ఉంటుంది.

ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాలను జూన్ తొలి వారంలో విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలనూ ఒకేసారి ప్రకటించనుందట. ఈనెల 16 నుంచి 23 వరకు జరిగిన పరీక్షలకు 3,39,139 మంది హాజరయ్యారు. కాగా ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.