News May 27, 2024

IPL: చప్పగా ఫైనల్.. మజా లేదు!

image

ఎంతో ఉత్కంఠగా సాగుతుందనుకున్న IPL-2024 ఫైనల్ క్రికెట్ అభిమానులను నిరాశ పరిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచులో KKR జయకేతనం ఎగరేసింది. ఈ సీజన్లో పవర్ ప్లేలోనే (తొలి 6 ఓవర్లు)125 రన్స్ చేసిన SRH.. నిన్నటి మ్యాచులో 113కే ఆలౌటైంది. ప్రత్యర్థులపై ఉప్పెనలా విరుచుకుపడే అభిషేక్, హెడ్, క్లాసెన్.. KKR బౌలింగ్‌కు దాసోహమయ్యారు. అటు బౌలింగ్‌లోనూ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు.

News May 27, 2024

ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు

image

APలో రహదారులు నెత్తురోడాయి. తిరుపతి జిల్లా ఎం.కొంగరవారిపల్లి వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో నలుగురు మరణించారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు జిల్లాకు చెందిన వారు TNలోని వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా కోడూరుపాడు పెట్రోల్ బంక్ వద్ద కారు లారీని ఢీకొట్టడంతో తమిళనాడుకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. కాకినాడలో రాత్రి కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు.

News May 27, 2024

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

image

TG: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల MLC ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగనుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.63 లక్షలమంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 52మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, BRS నుంచి రాకేశ్ రెడ్డి, BJP అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

News May 27, 2024

రఫాపై దాడిలో 35 మంది మృతి

image

హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రఫాపై నిన్న ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 35 మంది మరణించినట్లు గాజా అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు పేర్కొన్నారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు రఫాపై చేసిన దాడిలో హమాస్ గ్రూప్ అధికారులు యాసిన్ రబియా, ఖలీద్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది.

News May 27, 2024

ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు

image

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్‌గా సునీల్ నరైన్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు మూడు సీజన్లలో అతను ఈ ఘనత సాధించారు. 2012లో 24 వికెట్లు, 2018లో 357 రన్స్, 17 వికెట్లు, 2024లో 488 రన్స్, 17 వికెట్లతో రాణించి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచారు. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

News May 27, 2024

థియేటర్‌లో ఉక్కపోత.. యాజమాన్యానికి జరిమానా

image

ప్రేక్షకుడిని అసౌకర్యానికి గురిచేసినందుకు HYDలోని ముక్త ఏ2 సినిమాస్‌కు వినియోగదారుల కమిషన్ ఫైన్ వేసింది. 2023లో నిష్ఫర్ అనే వ్యక్తి సినిమాకు వెళ్లారు. AC, ఫ్యాన్ పనిచేయట్లేదని థియేటర్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సరైన స్పందన రాకపోవడంతో వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వాదనలు విన్న కమిషన్‌ ఆ వ్యక్తికి టికెట్ డబ్బులు, ₹3వేలు, కేసు ఖర్చులకు ₹1,000 ఇవ్వాలని యాజమాన్యాన్ని ఆదేశించింది.

News May 27, 2024

వర్షాల్లేవు.. మళ్లీ ఎండలే!

image

AP: నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. అటు TGలోనూ జూన్ 1 వరకు పొడివాతావరణం కొనసాగనుంది.

News May 27, 2024

రూ.9,289 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు

image

TG: రాష్ట్రంలో నిన్నటి వరకు 9,289.72 కోట్ల విలువైన 42.23 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కొనుగోళ్లు కాస్త పెరిగాయి. కాగా అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 4.34 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మరోవైపు కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో కేంద్రాలకు వచ్చే ధాన్యం తగ్గుతోంది.

News May 27, 2024

స్కూళ్లలో మధ్యాహ్న భోజనం.. వంట సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో మరింత నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మధ్యాహ్న భోజనం వండే సిబ్బందికి వంటకాల తయారీపై విజయవాడలోని తాజ్ హోటల్‌లో పనిచేసే చెఫ్‌లతో శిక్షణ ఇప్పించింది. అంతేకాకుండా తిరుపతి తాజ్ హోటల్ చెఫ్‌లతో వంటల చిట్కాలు, ఆయా వంటలతో కలిగే లాభాల గురించి వీడియోలను రూపొందించింది. వాటిని పాఠశాల విద్యాశాఖ నిర్వహించే సోషల్ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్ చేసింది.

News May 27, 2024

అకాల వర్షాలు.. 13 మంది మృతి

image

TG: నిన్న రాష్ట్రంలో ఈదురుగాలులు, ఆకాల వర్షాల ధాటికి వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మరణించారు. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు చనిపోగా, హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌లో ఇద్దరు మరణించారు. మరోవైపు పలు జిల్లాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. జగిత్యాలలోని జైనలో అత్యధికంగా 46.5 డిగ్రీలు నమోదైంది. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.