India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసా అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో అక్కడి ప్రభుత్వం ఈ వీసా అందిస్తుంది. ఇంతకుముందు సినీ ఇండస్ట్రీకి చెందిన రజనీకాంత్, షారుఖ్, అల్లు అర్జున్, అమలాపాల్, త్రిష, దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి తదితరులకు గోల్డెన్ వీసా లభించింది.

నందమూరి తారక రామారావు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్నారు. రూ.2కే కేజీ బియ్యం, పక్కా ఇళ్లు, సగం ధరకే చేనేత వస్త్రాలు, వితంతువులు, కూలీలకు పెన్షన్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మండలాల ఏర్పాటు, ప్రజల వద్దకే పాలన లాంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. మరి NTR పథకాల్లో మీకు నచ్చిందేదో కామెంట్ చేయండి.

చైనా సైంటిస్టులు ఓ రోగికి సెల్ థెరపీ ద్వారా షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. చికిత్సలో భాగంగా తొలుత క్లోమంలోని కణజాలంపై షుగర్ ప్రభావాన్ని కృత్రిమ అల్గారిథమ్‌తో విశ్లేషించారు. తర్వాత సెల్ థెరపీతో మూల కణాల్లో కొన్ని మార్పులు చేశారు. వీటిని క్లోమంలో ప్రభావితమైన కణాల స్థానంలో ప్రవేశపెట్టారు. క్రమంగా రోగికి ఇచ్చే ఇన్సులిన్‌ను తగ్గించారు. ఇలా 11 వారాల్లోనే మందుల అవసరం లేకుండా చేశారు.

దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిరంజీవి ఆయనకు నివాళి అర్పించారు. ‘కొందరి కీర్తి అజరామరం. భావితరాలకు ఆదర్శం. తారక రామారావు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచిత గౌరవం అని భావిస్తున్నా. తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్రప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థ LIC సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు కొత్త ప్రభుత్వం కాంపోజిట్ లైసెన్స్ మంజూరు చేసే అవకాశం ఉందని LIC ఛైర్మన్ సిద్ధార్థ మోహంతి పేర్కొన్నారు. ప్రస్తుతం జీవిత బీమాకే పరిమితమైన ఎల్ఐసీకి ఈ కాంపోజిట్ లైసెన్స్‌తో మరో రకం ఇన్సూరెన్స్‌ను అందించే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఆరోగ్య బీమా సేవలను ఎంచుకుంది.

AP: కాకినాడ జిల్లా సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగ్రామం పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లిలో తుదిశ్వాస విడిచారు. బుల్లబ్బాయి రెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.

భారత జట్టు కోచ్ పదవి కోసం BCCIకి 3వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మోదీ, అమిత్ షా, సచిన్ టెండూల్కర్, ధోనీ వంటి సెలబ్రిటీల పేర్లతోనూ అప్లికేషన్లు వచ్చినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. అయితే వీటిలో చాలా వరకు నకిలివే ఉన్నట్లు తెలుస్తోంది. 2022లోనూ 5వేల అప్లికేషన్లు రాగా, వాటిలో ఎక్కువగా ఫేక్ అని గుర్తించారు. కాగా నిన్నటితో కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే.

AP: గత ఏడాది జూన్ నుంచి సరైన వర్షాలు, కృష్ణా నదికి వరదలు లేకపోవడంతో పల్నాడు జిల్లా అచ్చంపేటలోని పులిచింతల జలాశయం ఖాళీ అయ్యింది. దీని నీటి నిల్వ సామర్థ్యం 45.77 TMCలు కాగా ప్రస్తుతం ఒక టీఎంసీ జలాలు కూడా లేవు. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి కృష్ణా డెల్టాలో రైతులు ఖరీఫ్‌లో 10.35 లక్షల ఎకరాల్లో వరి సాగు, 5.71 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారు. నీళ్లు అడుగంటడంతో ఈసారి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది.

రోడ్డు ప్రమాద బాధితులకు బీమా సంస్థలు వేగంగా సెటిల్మెంట్ చేయడం లేదు. ప్రస్తుతం రూ.80,455 కోట్ల విలువైన 10,46,163 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు RTI సమాచారంతో వెల్లడైంది. బాధితులకు సత్వర న్యాయం అందకపోవడంపై కేసీ జైన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. త్వరలోనే ఇది విచారణకు రానుంది.

AP: సిజేరియన్లు చేస్తున్న ఆస్పత్రులపై వైద్యారోగ్యశాఖ కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున్న 104 ఆస్పత్రులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ స్థాయిలో ఆపరేషన్లు ఎందుకు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. హై రిస్క్ కేసులు వస్తున్నాయని, అలాగే ముహూర్తాల పేరుతో ఒత్తిడి చేయడం వల్ల ఎక్కువగా సిజేరియన్లు చేస్తున్నామని ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి.
Sorry, no posts matched your criteria.