India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన భార్య సునీతకు ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. భవిష్యత్తులోనూ పోటీ చేయబోదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరోవైపు వివాదాస్పదంగా మారిన ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో రెండు వెర్షన్లు ఉన్నాయన్నారు. దీనిపై పారదర్శకమైన విచారణ చేయాలని ఆయన కోరారు.

బెంగాల్‌లో 2010 తర్వాత మంజూరైన దాదాపు 5లక్షల OBC సర్టిఫికెట్లు చెల్లవని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇప్పటికే లబ్ధి పొందుతున్నవారిపై ఈ తీర్పు ప్రభావం చూపించబోదని కోర్టు వివరించింది. ఈ OBC సర్టిఫికెట్లు WB బ్యాక్‌వర్డ్ క్లాస్ కమిషన్ చట్టానికి విరుద్ధంగా మంజూరైనట్లు దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది. ఇదిలా ఉంటే.. ఈ తీర్పును అంగీకరించబోమని, ఇది BJP కుట్ర అని CM మమత ఆరోపించారు.

RBI ఆంక్షలతో సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం, ఆర్థిక భారం తగ్గించుకునేందుకు చర్యలకు సిద్ధమైంది. ఉద్యోగాల్లో కోత సహా పలు ఆస్తులను విక్రయించాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. FY24 చివరి త్రైమాసికంలో రూ.550కోట్ల భారీ నష్టం వాటిల్లడంతో సంస్థ ఈ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి (FY26) బలంగా పుంజుకునేలా సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

చిమ్మ చీకట్లో కాంతులీనుతున్న భూమి ఫొటోను నాసా షేర్ చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఈ చిత్రం ‘మనం ఒకరితో మరొకరు కలిగి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తోంది’ అని పేర్కొంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) థాయ్‌లాండ్ మీదుగా వెళ్తున్నప్పుడు ఈ ఫొటోను క్లిక్ మనిపించినట్లు నాసా తెలిపింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆకుపచ్చ కాంతి భూమి అంచుని సూచిస్తుందని వివరించింది.

డబ్బుండి ప్రైవేటు కాలేజీల్లో చదివినంత మాత్రాన MBBS విద్యార్థులకు గ్రామాల్లో సర్వీస్ నుంచి మినహాయింపు ఉంటుందా? అని సుప్రీం ప్రశ్నించింది. మెడికల్ విద్యార్థులు శాశ్వత గుర్తింపు కోసం కనీసం ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయాలని కర్ణాటక విధించిన నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై SC స్పందించింది. గ్రామాల్లో సర్వీస్ చేయడమంటే చిన్నచూపనే ఆలోచనలు ఎలా వస్తాయని అసంతృప్తి వ్యక్తం చేసింది.

AP: అల్పపీడనం ప్రభావంతో రేపు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. ఎల్లుండి ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

యూట్యూబ్‌లో వ్యూయర్ షిప్ ఒక్కసారిగా పడిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. లైవ్ వీడియోలకు వేలల్లో ఉండాల్సిన సంఖ్య కేవలం సింగిల్, డబుల్ డిజిట్లలోనే దర్శనమిస్తోందని పేర్కొంటున్నారు. యూట్యూబ్‌కు ఏమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారత్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నట్లు మరికొందరు చెబుతున్నారు.

ఢిల్లీలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. నార్త్ బ్లాక్‌లో ఉన్న హోంశాఖ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు దుండగులు ఈమెయిల్ చేశారు. దీంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. కంట్రోల్ రూమ్ వద్దకు 2 ఫైర్ ఇంజిన్లను రప్పించారు. కొద్దిరోజులుగా బాంబు బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ ఢిల్లీ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల స్కూళ్లు, ఆసుపత్రులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

TG: సోనియా గాంధీ వల్ల తెలంగాణ రాలేదని, అమరవీరుల త్యాగాల వల్ల వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను పిలుస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఏ ప్రాతిపదికన ఆమెను పిలుస్తారని ప్రశ్నించారు. వందల మందిని బలి తీసుకున్న సోనియాను పిలవడమేంటని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

గత రెండేళ్లలో చెత్త ప్రదర్శనతో నిరాశపర్చిన కోల్‌కతా.. గౌతీ రాకతో ఈసారి ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. బౌలర్ నరైన్‌ను ఓపెనర్‌గా దించి గంభీర్ సక్సెస్ అయ్యారు. ఇతర ఆటగాళ్ల ప్రదర్శన కూడా ఆ జట్టుకు కలిసొచ్చింది. విలువైన సూచనలతో లీగ్ దశలో జట్టును టేబుల్ టాపర్‌గా నిలపడంలో ఆయనదే కీలకపాత్ర. సారథిగా 2012, 14లో KKRకు కప్పు అందించిన గౌతీ.. ఈ సారి మెంటర్‌గా మరో కప్పు సాధించేందుకు అడుగు దూరంలో నిలిచారు.
Sorry, no posts matched your criteria.