India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం హింసను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

విద్యుత్ వాహనాల తయారీపై రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టతకు ఆయా పరిశ్రమ వర్గాలతో త్వరలో కేంద్రం మరోసారి సమావేశం కానుంది. EV ప్రాజెక్టుపై సుమారు రూ.4,150కోట్లు పెట్టుబడి పెడితే పన్నుల తగ్గింపు, పలు రాయితీలు ఇచ్చేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా ఆయా సంస్థలు మూడేళ్లలో తమ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. అయిదేళ్లలో 50% విడిభాగాలను మన దేశంలో ఉత్పత్తి చేయాలి.

తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ యూపీ, జార్ఖండ్‌లోని మూడు గ్రామాల ప్రజలు ఐదో దశ ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. UPలోని కౌశాంబి(D) హిసామ్‌పూర్, బారాబంకి(D)లోని పరహాజీ వాసులు తమ గ్రామాల్లో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు జార్ఖండ్‌లోని కుసుంబా గ్రామానిది అదే దుస్థితి. అండర్ పాస్ నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

దేశవ్యాప్తంగా నిన్న జరిగిన ఐదో దశ ఎన్నికల పోలింగ్‌లో 60.09శాతం పోలింగ్ (రాత్రి 11.30 గంటల వరకు) నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్‌లో అత్యధికంగా 74.65 శాతం మంది ఓటేశారు. బీహార్‌లో(5 స్థానాలు) 54.85%, జమ్ము&కశ్మీర్‌లో(ఒక స్థానం) 56.73%, జార్ఖండ్‌లో(3) 63.07%, మహారాష్ట్రలో(13) 54.29%, ఒడిశాలో(05) 67.59శాతం, యూపీలో(14) 57.79శాతం పోలింగ్ నమోదైంది.

Do something at the drop of a hat: Do something unplanned
Have a method to one’s madness: Seeming to be crazy but in fact, clever
Cry over spilt milk: Worrying or complaining about something that cannot be fixed/rectified
Cut the mustard: Do a perfectly good job
Go down in flames: To fail terribly

AP: విశాఖలో ధనలక్ష్మి కుటుంబంపై దాడికి కారకులెవరో పోలీసులే చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. బాధితుల వేదనను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడం దారుణమన్నారు. ఈ కేసులు రాజకీయ ప్రేరేపితమని.. మీడియా ప్రతినిధులను భయపెట్టే చర్యలు సరికాదన్నారు. విశాఖలో ఇటీవల ధనలక్ష్మి కుటుంబంపై కొందరు దాడి చేశారు. తమ పార్టీకి ఓటు వేయలేదని YCP శ్రేణులే దాడి చేశాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇంగ్లండ్ క్రికెటర్లు కీలక దశలో IPLను వదిలి వెళ్లడానికి కారణం లీగ్ షెడ్యూల్ సరిగా లేకపోవడమేనని ఆ దేశ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ అన్నారు. ‘సొంత దేశానికి ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పులేదు. IPL షెడ్యూల్ ఆలస్యమైంది. మే 19న ఫైనల్ జరిగేలా ఉంటే.. ఇంగ్లండ్ క్రికెటర్లు ఫైనల్ ఆడి వెళ్లేవాళ్లు’ అని వాన్ అన్నారు. కాగా, ఇంగ్లిష్ క్రికెటర్లు IPLను వీడటంపై భారత దిగ్గజాలు గవాస్కర్, పఠాన్ తప్పుబట్టిన విషయం తెలిసిందే.

1960: మలయాళ నటుడు మోహన్ లాల్ జననం
1975: నటుడు అబ్బాస్ జననం
1991: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం
1998: నటుడు రాజనాల కాళేశ్వరరావు మరణం
2023: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మరణం
ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విదేశీ నిధుల సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్‌లను ఆప్ ఉల్లంఘించినట్లు పేర్కొంది. కెనడాలో సేకరించిన నిధులను ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌తో సహా మరికొందరు తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారని తెలిపింది.

తేది: మే 21, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:23 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:45 గంటలకు
మఘ్రిబ్: రాత్రి 6:43 గంటలకు
ఇష: రాత్రి 08.03 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.