News May 17, 2024

కోహ్లీ క్రీజులో ఉంటే ప్రత్యర్థులకు తిప్పలే: పాక్ మాజీ క్రికెటర్

image

టీమ్ఇండియా క్రికెటర్ కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థులు విజయంపై ఆశలు వదులుకోవాల్సిందేనని పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నారు. ‘WCలో విరాట్‌తో ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పవు. కోహ్లీ స్ట్రైక్ రేట్ విషయంలో చర్చలు అనవసరం. మ్యాచ్ ఎలా గెలిపించాలో అతడికి బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ప్రత్యర్థిపైనైనా చెలరేగి ఆడగలడు. విరాట్ ప్రపంచంలోనే మేటి ఆటగాడు’ అని మిస్బా కొనియాడారు.

News May 17, 2024

‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా

image

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘అరవింద సమేత’లో రెండో హీరోయిన్‌గా నటించారు ఈషా రెబ్బా. ఆ సినిమాను తాను తొలుత ఒప్పుకోలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నాకు ప్రధాన పాత్ర చేయాలని ఉండటంతో సైన్ చేయలేదు. కానీ నాదీ ప్రధాన పాత్రేనంటూ దర్శకనిర్మాతలు ఒప్పించారు. అయితే లాస్ట్‌కి నా సీన్స్ ఎడిటింగ్‌లో పోయాయి. కనీసం సెకండ్ లీడ్‌గానైనా పేరు రాలేదు. ఆ మూవీ విషయంలో బాధపడ్డాను’ అని ఈషా వెల్లడించారు.

News May 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 17, 2024

మే 17: చరిత్రలో ఈరోజు

image

1749: రోగనిరోధక శాస్త్ర పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్ జననం
1906: తెలుగు కవి శ్రీరంగం నారాయణబాబు జననం
1920: సినీనటి శాంతకుమారి జననం
1945: భారత క్రికెటర్ బీఎస్ చంద్రశేఖర్ జననం
1983: సినీ దర్శకుడు సాగర్ కె. చంద్ర జననం
1986: నటి ఛార్మి జననం
2019: నటుడు రాళ్లపల్లి మరణం
* ప్రపంచ టెలీకమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం
* ప్రపంచ రక్తపోటు దినోత్సవం

News May 17, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 17, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:25 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:43 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:43 గంటలకు
మఘ్రిబ్: రాత్రి 6:42 గంటలకు
ఇష: రాత్రి 08.01 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 17, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 17, శుక్రవారం
శు.నవమి: ఉదయం 08:49 గంటలకు
పుబ్బ: రాత్రి 09:18 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:13 నుంచి 09:04 వరకు
తిరిగి మధ్యాహ్నం 12:29 నుంచి 01:20 వరకు
వర్జ్యం: తెల్లవారుజాము 03:15 నుంచి 05:03 వరకు

News May 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 17, 2024

TODAY HEADLINES

image

✒ వర్షం కారణంగా GTతో మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్‌కు SRH
✒ రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛెత్రి
✒ 151 MLA, 22 MPలు దాటుతున్నాం: CM జగన్
✒ విద్యా దీవెన, ఆసరా నిధులు విడుదల
✒ ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ నిలిపేయాలి.. గవర్నర్‌కు CBN లేఖ
✒ పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలపై ఈసీ వేటు
✒ తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
✒ పన్ను ఎగవేతలపై కఠినంగా ఉండాలి: CM రేవంత్
✒ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ 24కు వాయిదా

News May 16, 2024

SCBA ప్రెసిడెంట్‌గా కపిల్ సిబల్

image

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(SCBA) అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. ఆయనకు 1,066 ఓట్లు రాగా, మరో అడ్వొకేట్ ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు, అదిష్ అగర్వలాకు 296 ఓట్లు వచ్చాయి. ఫైనల్ ఓట్లు అధికారికంగా వెలువడాల్సి ఉంది. సిబల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం ఇది నాలుగోసారి. 1995-96, 1997-98, 2000-01లో పనిచేశారు. ఈయన ప్రస్తుతం యూపీ నుంచి(సమాజ్‌వాదీ పార్టీ) రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

News May 16, 2024

మెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రం

image

42 రకాల ఔషధాల ధరలను కేంద్రం తగ్గించింది. ఇందులో గుండె, కాలేయం, షుగర్ జబ్బులకు చెందిన మందులు కూడా ఉన్నాయి. యాంటిసిడ్స్, మల్టీ విటమిన్, యాంటీ బయాటిక్స్ ధరలను తగ్గించింది. తగ్గిన ధరలను డీలర్లు, స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా కంపెనీలను ఆదేశించింది. ధరల తగ్గింపుతో 10 కోట్లకుపైగా షుగర్ వ్యాధిగ్రస్థులు లబ్ధి పొందనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మంది షుగర్ వ్యాధిగ్రస్థులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.