India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నటుడు సైఫ్ అలీఖాన్ టాటూ వ్యవహారం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. గతంలో తన భార్య కరీనా కపూర్ పేరును చేతిపై టాటూ వేయించుకున్న సైఫ్.. తాజాగా దాన్ని తొలగించారు. ఆ స్థానంలో త్రిశూలం టాటూ కనిపించింది. ఎయిర్‌పోర్టులో మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా టాటూను దాచే ప్రయత్నం చేశారు. దీంతో వీరు విడిపోతున్నారేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2012లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.

ప్రభుత్వ పెన్షన్ ఫండ్‌కు అర్హులైన సంస్థల జాబితా నుంచి అదానీ పోర్ట్స్‌ను తొలగిస్తున్నట్లు నార్వే సెంట్రల్ బ్యాంక్ నార్గెస్ వెల్లడించింది. అదానీతో పాటు యూఎస్‌కు చెందిన ఎల్3హ్యారిస్ టెక్నాలజీస్, చైనాకు చెందిన వీచాయ్ పవర్‌ను కూడా తొలగించింది. 2022 నుంచి ఈ సంస్థపై నిఘా పెట్టామని తెలిపింది. యుద్ధం, సంక్షోభాలను ఎదుర్కొనే ప్రాంతాల్లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనలతో ఈ సంస్థకు సంబంధం ఉందని పేర్కొంది.

ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ 2018లో అవిభక్త కవలలకు జన్మనిచ్చినట్లు ఇటీవల అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ పేర్కొంది. 4 చేతులు, 3 కాళ్లతో ఒకరికొకరు అతుక్కొని పుట్టినట్లు తెలిపింది. ప్రతి 20 లక్షల మందిలో ఒకరు ఇలా జన్మిస్తారని వెల్లడించింది. నిత్యం జీవిత పోరాటం చేస్తున్న వారిని వేరుచేయడం చాలా కష్టమని తెలిపింది. సర్జరీ ద్వారా మూడో కాలును తొలగించడంతో ప్రస్తుతం కూర్చోగలుగుతున్నారని వివరించింది.

AP: పోలింగ్ రోజు(మే 13), ఆ తర్వాత పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి సహా పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాడులను అదుపు చేయడంలో సీఎస్, డీజీపీ విఫలమయ్యారని పిటిషనర్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి వెంటనే అల్లర్లను అరికట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీఎస్, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి నోటీసులు జారీ చేశారు.

AP: వచ్చే నెల 9న విశాఖపట్నంలో రెండో సారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మళ్లీ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘మా లక్ష్యం 175 సీట్లకు చేరువగా వస్తున్నాం. రాజకీయాల్లో జగన్ ట్రెండ్ సెట్ చేశారు. ఓడిపోతామనే అసహనంతో టీడీపీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. మా నేత పిలుపునిస్తే.. ఒక నిమిషంలో అంతా మారిపోతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చారు. సుమారు 20-25 నిమిషాల పాటు ఈసీ వారి నుంచి వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్లు మంజూరు చేసేందుకు ఆల్గారిథమ్స్‌పై ఆధారపడటం తగ్గించుకుంటే మంచిదని RBI హెచ్చరించింది. లబ్ధిదారుడి రికార్డ్‌లో ఉన్న డేటాను మాత్రమే ఆల్గారిథమ్స్ పరిగణనలోకి తీసుకుంటాయనే విషయం గుర్తించాలని సూచించింది. క్రెడిట్ అసెస్‌మెంట్‌ను కేవలం దీని ఆధారంగా అంచనా వేయడం సరికాదంది. లోన్స్ త్వరగా మంజూరు చేసేందుకు సంస్థలు ఈ పద్ధతిని అనుసరిస్తున్న నేపథ్యంలో RBI ఈ సూచనలు చేసింది.

AP: ఉద్దేశపూర్వకంగానే పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాను ఎన్నికల కోసం తీసుకొచ్చారని YCP నేత పేర్ని నాని ఆరోపించారు. ‘మిశ్రా రాష్ట్రానికి వచ్చిన దగ్గరి నుంచి TDP సానుభూతిపరులైన రిటైర్డ్ అధికారులను కలిశారు. జిల్లా SPలను కూడా ఆయన బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా రాష్ట్రం వదలి వెళ్లడం లేదు. ఆయన వల్లే రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. తక్షణమే ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలి’ అని డిమాండ్ చేశారు.

మదుపర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌ను (SIP) క్రమంగా పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టెపప్ ఎస్ఐపీగా పిలిచే ఈ పద్ధతితో అధిక లాభాలు ఆర్జించొచ్చట. నెలకు రూ.5,400 చొప్పున ఎలాంటి పెంపు లేకుండా SIP కొనసాగిస్తే 20ఏళ్లకు రూ.49.67లక్షలు రిటర్న్ వస్తుంది. అదే 5% (ఏటా) పెంచితే రూ.68.87లక్షలు, 10%కు రూ.1.06కోట్లు, 15%కు రూ.1.54కోట్లు రిటర్న్ వస్తాయని చెబుతున్నారు.

భారత్‌లోకి ఉగ్రవాదులను పంపుతూ శునకానందం పొందుతున్న పాక్ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. ఓవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు POKలో ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇది దేశం చీలిక దిశగా సాగినా ఆశ్చర్యం లేదని విశ్లేషకుల అంచనా. POKలో ఉన్న 2,600MW నీలమ్ జీలమ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో తమకు వాటా ఇవ్వాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. GOVT ఉద్యోగులపైనా చిన్న చూపు ఉందని, జీతాలు తక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.