News May 8, 2024

క్యాష్ లోన్లపై ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు!

image

నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీలు క్యాష్ లోన్లు మంజూరు చేయడంపై RBI కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. క్యాష్ లోన్లు రూ.20వేలకు మించి మంజూరు చేయొద్దని పేర్కొందట. ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 269SS ప్రకారం నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. IIFL ఫైనాన్స్‌లో ఇటీవల అవకతవకలు జరిగిన నేపథ్యంలో NBFCలకు RBI ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

News May 8, 2024

ఓపెనర్ల ఊచకోత.. SRH రికార్డు విజయం

image

లక్నోతో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH 9.4 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్లు హెడ్(89*), అభిషేక్(75*) LSG బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదారు. ఈ విజయంతో SRH ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి.

News May 8, 2024

ఎవరీ పిట్రోడా?

image

శామ్ పిట్రోడా ఒడిశాలోని టిట్లాగఢ్‌లో 1942లో జన్మించారు. అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లిన ఆయన టెక్నాలజీ నిపుణుడిగా పేరొందారు. ఇది గుర్తించిన ఇందిరా గాంధీ 1984లో ఇండియాకు ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఇందిరా, రాజీవ్, యూపీఏ ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సీ-డాట్ ఆయన హయాంలోనే మొదలైంది. ఎస్టీడీ బూత్‌ల ఏర్పాటు ఆయన ఆలోచనే. 1992లో ఐక్యరాజ్య సమితిలోనూ పనిచేశారు.

News May 8, 2024

ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు: జగన్

image

APలోనే అతిపెద్ద నగరం విశాఖ అని.. ఇప్పటికే అక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ‘తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో ఏపీకి విశాఖ ఐకాన్ సిటీ. అమరావతిలో అభివృద్ధికి ఎకరానికి రూ.2కోట్లు అవసరం. HYD, బెంగళూరు, చెన్నై స్థాయికి విశాఖ ఎదగాలి. మా హయాంలో APకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. MSMEలో 20 లక్షల మందికి ఉపాధి దక్కింది’ అని వెల్లడించారు.

News May 8, 2024

IPL: సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే?

image

ఉప్పల్ వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. LSG టాపార్డర్ విఫలమవ్వగా.. బదోని(55), పూరన్(48) పరుగులతో రాణించారు. SRH బౌలర్లలో భువనేశ్వర్ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు. SRH టార్గెట్ 166.

News May 8, 2024

గుర్తుండిపోయే రోడ్ షో: మోదీ

image

AP: విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో ముగిసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌తో విజయవాడలో చేసిన రోడ్ షో గుర్తుండిపోతుందని ప్రధాని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీలో పర్యటించిన తర్వాత ప్రజలు ఎన్డీఏకు ఓటు వేస్తారని విశ్వసిస్తున్నట్లు మోదీ తెలిపారు. మహిళలు, యువ ఓటర్లు తమకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.

News May 8, 2024

చూడాలని లేనప్పుడు అభివృద్ధి కనిపించదు: జగన్

image

APలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం అభివృద్ధి కాదా? అని ప్రతిపక్షాలను సీఎం జగన్ ప్రశ్నించారు. ‘4 పోర్టులు కడుతున్నాం. కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్ పనులను పరుగులు పెట్టిస్తున్నాం. EODBలో ఏపీని నం.1 స్థానంలో ఉంచాం. గ్రామాల్లో సచివాలయాలు, RBK, విలేజ్ క్లినిక్‌లు పెట్టాం. ఇదంతా అభివృద్ధి కాదా? చూడాలని లేనప్పుడు ఈ అభివృద్ధి కనిపించదు’ అని ఎద్దేవా చేశారు.

News May 8, 2024

CMగానే అసెంబ్లీలో అడుగుపెడతా: CBN

image

AP: ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రావడంలో ఏమాత్రం సందేహం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే ఏపీ ఎక్కువగా నష్టపోయిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో దాదాగిరి పెరిగిందని అన్నారు. జగన్‌లా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని బాబు అన్నారు.

News May 8, 2024

‘పవర్ ప్లే’ కింగ్ భువనేశ్వర్

image

స్వింగ్ కింగ్ భువనేశ్వర్ పవర్ ప్లేలో అదరగొడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆయన 10 వికెట్లు తీశారు. దీంతో IPL 2024లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఖలీల్ అహ్మద్(8) ఉన్నారు. కాగా లక్నోతో జరుగుతున్న మ్యాచులో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు.

News May 8, 2024

భూమిపై సర్వహక్కులు కల్పించేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: జగన్

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రతిపక్షాల ఆరోపణలపై జగన్ మరోసారి స్పందించారు. ‘రాజకీయ స్వార్థంతో వారు ఇలా చేయడం దారుణం. వందేళ్ల తర్వాత సర్వే చేసి.. భూ రికార్డులు సిద్ధం చేశాం. భూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టం. 17వేల గ్రామాల్లో రికార్డులు పూర్తయ్యాయి. టైటిల్స్‌లో తప్పులు లేకుండా చూడటమే గ్యారంటీ. భూములకు ఇన్సూరెన్స్ ఉంది. సచివాలయాలనే రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా మార్చాం’ అని వెల్లడించారు.